Bigg Boss Telugu 6: శ్రీహాన్-రేవంత్ ప్రైజ్ మనీలో భారీ కటింగ్... ఫైనల్ గా మిగిలింది తెలిస్తే షాక్ అవుతారు!
బిగ్ బాస్ సీజన్ విన్నర్-రన్నర్ ఇద్దరూ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. రేవంత్, శ్రీహాన్ లకు ఆర్థికంగా లబ్ధి చేకూరింది. అయితే టాక్స్ కటింగ్ పోను వాళ్లకు వచ్చేది తెలిస్తే అయ్యో అంతేనా అంటారు.
బిగ్ బాస్ తెలుగు 6 (Bigg Boss Telugu 6) ముగిసింది. ఈ సీజన్ విన్నర్ గా సింగర్ రేవంత్ టైటిల్ అందుకున్నారు. శ్రీహాన్-రేవంత్ ఫైనల్ లో టైటిల్ కోసం పోటీపడ్డారు. అయితే శ్రీహాన్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలు తీసుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలో తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ రేవంత్ విన్నర్ అయ్యాడు. శ్రీహాన్ రూ. 40 లక్షల ఆఫర్ అంగీకరించకపోతే విన్నర్ గా అవతరించేవాడు. తృటిలో అతడు తప్పుడు నిర్ణయం వలన టైటిల్ కోల్పోయాడు. ఈ క్రమంలో విన్నర్, రన్నర్ ఇద్దరూ ఆర్థికంగా లబ్ధిపొందారు.
శ్రీహాన్(Sreehan) విన్నర్ గెలుచుకోవాల్సిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీ నుండి రూ. 40 లక్షలు నాగార్జున ఇచ్చిన ఆఫర్ రూపంలో తీసుకున్నారు. అలాగే లెన్స్ కార్ట్ స్పెషల్ ప్రైజ్ మనీ రూ. 5 లక్షలు శ్రీహాన్ కి లభించాయి. అంటే బిగ్ బాస్ షో నుండి ప్రైజ్ మనీ రూపంలో శ్రీహాన్ రూ. 45 లక్షలు రాబట్టాడు.
ఇక టైటిల్ విన్నర్ రేవంత్(Revanth)... శ్రీహాన్ కి ఇవ్వగా మిగిలిన రూ. 10 లక్షలు, రూ. 25 లక్షలు విలువ చేసే సువర్ణభూమి ఫ్లాట్, రూ. 10 లక్షలు మారుతి సుజుకి బ్రీజా కారు గెలుచుకున్నాడు. ఈ మొత్తం విలువ రూ. 45 లక్షలని అంచనా. విన్నర్, రన్నర్ సమానంగా బిగ్ బాస్ ప్రైజ్ మనీ పంచుకున్నట్లు అయ్యింది.
Bigg Boss Telugu 6
అయితే ఈ మొత్తం వాళ్లకు దక్కదు. ఈ ప్రైజ్ మనీ, బహుమతుల నుండి టాక్స్ కటింగ్ ఉంటుంది. ఆదాయపన్ను చట్టాల ప్రకారం లాటరీ లేదా ఇతర గేమ్ షోస్ లో గెలిచిన స్థిర, చర ఆస్తులపై భారీ మొత్తంలో పన్ను వసూలు చేస్తారు. దీన్ని సాధారణ ఆదాయంగా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి 30.9% టాక్స్ రూపంలో చెల్లించాలి.
Bigg Boss Telugu 6
కాబట్టి శ్రీహాన్ -రేవంత్ తమ ప్రైజ్ మనీ నుండి రూ. 13.9 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రేవంత్ కారు, ఫ్లాట్ గెలుచుకున్నందుకు తిరిగి అమౌంట్ టాక్స్ రూపంలో చెల్లించాలి. టాక్స్ చెల్లించగా వారికి రూ. 31.09 లక్షలు మిగులుతాయి. అదన్న మాట లెక్క. అయితే 15 వారాలు హౌస్లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ రూపంలో వారికి కొంత అమౌంట్ దక్కుతుంది. దానిపై ఇంత భారీ టాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి రమారమి శ్రీహాన్, రేవంత్ లకు రూ. 50 లక్షలు బిగ్ బాస్ షో ద్వారా అందుకున్నారు.