MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Deepthi-Shanmukh Breakup Effect: సిరి-శ్రీహాన్‌ ల కొంప ముంచుతుందా?.. నెట్టింట ఊపందుకున్న రూమర్స్?

Deepthi-Shanmukh Breakup Effect: సిరి-శ్రీహాన్‌ ల కొంప ముంచుతుందా?.. నెట్టింట ఊపందుకున్న రూమర్స్?

బిగ్‌బాస్‌ 5లో సిరి, షణ్ముఖ్‌ ల మధ్య జరిగిన వ్యవహారం పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. దీని దెబ్బకి ఏకంగా షణ్ముఖ్‌తో విడిపోతున్నట్టు ఆయన ప్రియురాలు దీప్తి తెలిపి షాకిచ్చింది. అయితే ఇప్పుడిది సిరి విషయంలోనూ జరగబోతుందా? అనే రూమర్లు ఊపందుకున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 03 2022, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌బాస్‌ షోలో ఎంతో మందికి లైఫ్‌ ఇస్తుంది. అవకాశాల మాట పక్కన పెడితే ఊహించనంత ఇమేజ్‌ని, పాపులారిటీని తీసుకొస్తుంది. ఓవర్‌ నైట్‌లో సెలబ్రిటీలు అయిపోతుంటారు. ఈ షో అనంతరం చాలా మంది లైఫ్‌లో బాగా సెటిల్‌ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అదే సమయంలో కొంత మంది నెగటివిటీని మూట గట్టుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ మాత్రం చాలా మందికి నెగటివిటీని తెచ్చిపెట్టింది. విన్నర్‌ వీజే సన్నీ, కాజల్‌, శ్రీరామ్‌, మానస్‌, విశ్వ వంటి వారికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ మెజారిటీగా చాలా మంది నెగటివిటీని మూటగట్టుకున్నారు. అందులో ప్రధానంగా షణ్ముఖ్‌ మాత్రం ఆడియెన్స్ దృష్టిలో విలన్‌ అయిపోయాడనే టాక్‌ వినిపించింది. హౌజ్‌లో అతని ప్రవర్తన పట్ల చాలా విమర్శలు వచ్చాయి. సిరితో ఆయన రిలేషన్‌ సైతం వివాదంగా మారింది. 
 

36

హౌజ్‌లో వీరిద్దరు స్నేహం పేరుతో మరింత క్లోజ్‌గా మూవ్‌ అయ్యారని, హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శలు మూటగట్టుకున్నారు. సిరి విషయంలో షణ్ముఖ్‌ ప్రవర్తన తీరుపట్ల ఇబ్బంది పడ్డ దీప్తిసునైనా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. బ్రేకప్‌ చెప్పింది. 
 

46

అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సిరిపై కూడా పడుతుందనే టాక్‌ వినిపిస్తుంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రావడానికి ముందే సిరి.. సహ నటుడు శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో షణ్ముఖ్‌ విషయంపై శ్రీహాన్‌ కూడా అసంతృప్తిగా ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. సోషల్‌ మీడియాలో ట్రోల్‌ ఊపందుకున్నాయి. 

56

 వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశారు సిరి ప్రియుడు శ్రీహాన్‌. తాజాగా సిరి బర్త్ డే(జనవరి3) సందర్భంగా ఆమెకి విషెస్‌ తెలిపారు. `హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్‌ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్‌. గాడ్‌ బ్లెస్‌ యూ` అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు.

66

`బిగ్‌బాస్‌`లో సిరిని ఎన్ని రకాలుగా ట్రోల్‌ చేసినా పట్టించుకోకుండా ఆమెని ఎంకరేజ్‌ చేస్తూ వచ్చాడు శ్రీహాన్‌. అయితే షో పూర్తయిన తర్వాత మాత్రం వీరిద్దరు కలవకపోవడం అనుమానాలను రేకెత్తిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో దీప్తి- షణ్ముక్‌ల మాదిరిగానే వీళ్లు కూడా విడిపోతారా? అనే ఊహాగానాల నేపథ్యంలో శ్రీహాన్‌ ఇన్‌స్టా పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. 

also read: Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి... ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved