Deepthi Sunaina: షణ్ముఖ్ తో బ్రేకప్ లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి... ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
లవ్ బ్రేకప్ తర్వాత మొదటిసారి దీప్తి సునైన లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో లవ్ బ్రేకప్ గురించి ఎమోషనల్ అయ్యారు. ఆమె షన్నుని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు.
ప్రేమించిన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం. పెళ్లి చేసుకొని వందేళ్లు కలిసి జీవించాలని ప్రేమిస్తే.. ఆ ప్రేమ మధ్యలో ముక్కలైతే పరిణామాలు ఊహించడం దారుణం. లవ్ బ్రేకప్స్ చాలా మందిని డిప్రెషన్ లోకి నెట్టివేస్తాయి. తాజాగా సోషల్ మీడియా సెలెబ్రిటీలైన దీప్తి సునైన (Deepthi Sunaina)-షణ్ముఖ్ జస్వంత్ విడిపోయారు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట అనూహ్యంగా బ్రేకప్ చెప్పుకున్నారు. దీప్తి సునైన షణ్ముఖ్ తో బ్రేకప్ ని అధికారికంగా ప్రకటించింది. ఓ సుదీర్ఘ సోషల్ మీడియా సందేశం ద్వారా తెలియజేసింది.
కాగా లవ్ బ్రేకప్ తర్వాత మొదటిసారి దీప్తి సునైన లైవ్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలో లవ్ బ్రేకప్ గురించి ఎమోషనల్ అయ్యారు. ఆమె షన్నుని తలచుకుని కన్నీరు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటీ?.. అన్న ప్రశ్నకు సమాధానంగా 'ఇప్పటి వరకు నా గురించి నేను ఆలోచించుకోలేదు. ఇకపై కెరీర్ పై ఫోకస్ పెడతాను. లైఫ్ లో ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేస్తాను, అంటూ కామెంట్ చేశారు.
ఇక దీప్తి-షణ్ముఖ్ (Shanmukh) తో విడిపోవడానికి సిరి కారణంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ (Bigg boss season 5) లో సిరి, షణ్ముఖ్ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే స్నేహం పేరుతో వీరు నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించారు. సిరి విషయంలో షణ్ముఖ్ హద్దులు దాటాడని భావించిన దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పినట్లు వినికిడి. హౌస్ నుండి షణ్ముఖ్ బయటికి వచ్చిన వెంటనే... రోజుల వ్యవధిలో దీప్తి బ్రేకప్ నోట్ విడుదల చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.
మరోవైపు షణ్ముఖ్-దీప్తిల బ్రేకప్ కి నేను కారణం కాదని సిరి (Siri) సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అలాగే షణ్ముఖ్ నాకు స్నేహితుడు మాత్రమే అని ఆమె చెబుతున్నారట. మరి దీప్తి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక షణ్ముఖ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేరు. మరి ఆయనైనా బ్రేకప్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Also read Deepthi-Shanmuk Breakup: షణ్ముఖ్-దీప్తి బ్రేకప్ కి కారణం నేను కాదు... సిరి సోషల్ మీడియా పోస్ట్?
యూట్యూబర్స్ గా దీప్తి, షణ్ముఖ్ ఫేమ్ సంపాదించారు. వీరిద్దరి కాంబినేషన్ లో సిరీస్లు, సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కాయి. ఇక షణ్ముఖ్ కంటే ముందే దీప్తి బిగ్ బాస్ షోకి వెళ్లడం విశేషం. ఆమె నాని హోస్ట్ గా 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్నారు. స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి 10వ వారం ఎలిమినేట్ కావడం జరిగింది.
Also read Chiranjeevi: మిస్టర్ కూల్ చిరంజీవికి ఏమైంది?