MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Devatha: సత్యని క్షమాపణ కోరిన ఆదిత్య... మాధవ్ ప్రవర్తన చూసి జానకమ్మ షాక్!

Devatha: సత్యని క్షమాపణ కోరిన ఆదిత్య... మాధవ్ ప్రవర్తన చూసి జానకమ్మ షాక్!

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 15వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Navya G
Published : Sep 15 2022, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రాద దేవికి జడ వేస్తూ ఉంటుంది  అదే సమయంలో మాధవ్ ఇంటి బయటకు వచ్చి  గడ్డం గీసుకుంటూ ఉంటాడు. ఇంతలో చిన్నయి, రాదని దేవిని చూస్తూ ఉంటుంది.అప్పుడు రాదా చిన్మయితో, నువ్వు కూడా కరాటే నేర్చుకుంటావా అని అడగగా, వద్దమ్మా నేను నీ కళ్ళ ముందే ఉంటాను అని అంటుంది చిన్మయి. ఇంతలో జానకమ్మ అక్కడికి వస్తుంది. అదే సమయంలో మాధవ్ గడ్డం గీసుకుంటూ అద్దంలోని రాధ ముఖాన్ని చూసి ముద్దు పెట్టుకుంటాడు. ఇది జానకమ్మ చూస్తుంది.
 

27

ఆ తర్వాత రాధ దేవితో క్లాస్ కి బయలుదేరుదామా అని అనగా మాధవ్, నేను తీసుకువెళ్తాను అని అంటాడు. దానికి రాద ఏం అవసరం లేదు నేను దింపుకుంటాను అని అంటుంది. అప్పుడు జానకమ్మ వాడేంటి దాన్ని ముద్దు పెట్టుకుంటున్నాడు అసహ్యంగా. ఇలాంటి పనులన్నీ ఎప్పుడు నేర్చుకుంటున్నాడు అయినా రాద ఎందుకు అంత కోపంగా మాట్లాడింది అని ఆశ్చర్యపోతుంది జానకమ్మ. ఆ తర్వాత సీన్లో ఆదిత్య ఆ ఫోటో గురించి ఆలోచిస్తూ అది చిన్నయి కి  కాకుండా దేవికి చిక్కి ఉంటే బాగున్ను. నిజం ఎలా చెప్పాలి అని ఆలోచన ఉండేది కాదు.
 

37

తనంట తానే నిజం తెలుసుకునేది అని అంటాడు. ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి, ఏ ఆదిత్యతో ఈ మధ్య నీలో మార్పు వస్తుంది రా. నువ్వు మారుతున్నావు తల్లిని ఎప్పుడూ ఒక మాట కూడా అనేవాడు కాదు మొన్న అరిచావు అని అనగా, నన్ను క్షమించు అమ్మ మొన్న ఏదో టెన్షన్ లో అరిచాను సారీ అని అంటాడు. అలా కాదురా బయట పనులు ఇంటి వరకు తెచ్చుకోకూడదు, సత్య చాలా బాధపడుతుంది. నువ్వు సత్యతో సరిగ్గా మాట్లాడి ఎన్ని రోజులైంది. నువ్వు తనకి ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఎలా చెప్పు.
 

47

తను నీ మీద ఎన్నో అసలు పెట్టుకుంది కదా. ఒకసారి వెళ్లి సత్యతో మాట్లాడు అని అంటుంది దేవుడమ్మ. ఆ తర్వాత సీన్ లో దేవి కరాటే చేస్తున్నప్పుడు భాగ్యమ్మ రుక్మిణి దగ్గరికి వస్తుంది. ఏమైందమ్మా నువ్వు ఎందుకు ఇంటి నుంచి రాను అని అంటున్నావు అని అడగగా, చిన్మయి నీ చూస్తే నాకు ఇంటి నుంచి బయటకు వెళ్లాలని లేదు అమ్మ. నేను అప్పటికి చెప్పాను నీ దారి నువ్వు చూసుకో అని కానీ నన్ను అస్సలు వదలడం లేదు. నువ్వు లేకపోతే నేనులేను అని అంటుంది.నేను ఎక్కడ వెళ్ళిపోతానో అని రాత్రి కూడా సరిగ్గా పడుకోవడం లేదు.
 

57

నేను ఇద్దరినీ ఒకలాగే పెంచాను ఇప్పుడు నేను తను వదిలి వెళ్ళడం కష్టం అని అంటుంది. ఆ తర్వాత సీన్ లో  సత్య, ఆదిత్య ఫోటో చూసుకొని ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు ఆదిత్య,సత్య  దగ్గరికి వెళ్లి నన్ను క్షమించు సత్య.అమ్మ చెప్పేంత వరకు నేను చేసిన తప్పు నాకు తెలియలేదు. నేను నీ పట్ల ఈ మధ్య అశ్రద్ధ చూపిస్తున్నాను నాకు అర్థమైంది ఇంకెప్పుడూ అలా చేయను అని అనగా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు అది చాలా ఆదిత్యా. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. నువ్వు ఒకేసారి పిల్లలు వద్దు అన్న ఆ మాటకి నేను తట్టుకోలేకపోయాను అని అంటుంది.
 

67

 ఇప్పుడు నీ బాధ పోవాలంటే నేను ఏం చేయాలి అని ఆదిత్య అడగగా, నన్ను బయటకు తీసుకెళ్ళు, తినడానికి వెళ్దాము రోజంతా హాయిగా గడుపుదాము అని అంటుంది. అలాగే అని అంటాడు ఆదిత్య. అప్పుడు ఆనందంతో సత్య ఆదితిని హద్దుకుంటుంది. అప్పుడు ఆదిత్య మనసులో, ఎలాగో బయటకు వెళ్తున్నాం కదా దేవికి కూడా ఏవైనా వస్తువులు కొనాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో  జానకమ్మ మాధవ్ దగ్గరకు వెళ్లి, అసలు ఏమవుతుంది రా నీ ఈ మధ్య ప్రవర్తనలో  తేడా కనిపిస్తుంది.
 

77

ఎప్పుడూ లేనిది గిటార్ ఎందుకు వాయిస్తున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు మాధవ్, ఆనందం వస్తే వాయిస్తున్న అమ్మ అని అంటాడు.ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ బాధలో ఉంటే నీకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అని జానకమ్మ అంటుంది.ఇంతలో దేవి, రుక్మిణి, భాగ్యమ్మ అక్కడికి వస్తారు.దేవి పరిగెత్తుకుంటూ వచ్చి, నాయన నాకు బెల్టు వచ్చింది చూడు నాకు ప్రమోషన్ వచ్చిందే అని ఆనందపడుతుంది. ఇంతలో బెల్ట్ అందరికీ చూపించి సంబరపడిపోతుంది దేవి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Recommended image2
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం
Recommended image3
2025లో తెలుగు డైరెక్టర్లకు పోటీ ఇచ్చిన, టాప్ 5 కోలీవుడ్ దర్శకులు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved