రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోయిన్స్, రాధిక నుంచి అదితి రావు హైదరీ వరకూ లిస్ట్ లో ఉన్నది వీళ్లే..
ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండో పెళ్ళి కామన్. అయితే హీరోయిన్లు కూడా రెండు పెళ్లిళ్ళు చేసుకోవడమే కాస్త చెప్పకోదగ్గ విషయంలో. అందులోను మాకేం తక్కువ.. అంటూ.. రాధిక నుంచి అదితిరావు వరకూ హీరోలకు పోటీగా విడాకులు తీసుకుని రెండు పెళ్ళిళ్లు.. అంతకు మించిన పెళ్ళిళ్లు చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసా..?
అదితిరావు హైదరీ
చిన్న వయస్సులోనే పెళ్ళి చేసుకుంది హీరోయిన్ అతిధిరావు హైదరి. ఆతరువాత మనస్పర్ధలతో విడాకులు తీసుకుని మోడలింగ్ వైపు అడుగు వేసింది. ఆతరువాత హీరోయని్ గా మారి.. సిద్దార్ధ్ తో ప్రేమలో పడింది. సిద్దుకి కూడా పెళ్లై విడాకులు అయ్యాయి. వీరిద్దరు చాలా కాలం ప్రేమించుకుని రీసెంట్ గా పెళ్ళి చేసుకున్నారు.
అమలా పాల్
2014లో డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్‍ను అమలాపాల్ పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి మనువాడారు. అయితే, 2017లో విజయ్‍తో విడిపోయారు అమలాపాల్. విభేదాలు తలెత్తటంతో విడాకులు తీసుకున్నారు. అమలా పాల్, జగత్ దేశాయ్ మంచి స్నేహితులు. అమలా పాల్ విడాకుల తర్వాత జగత్ దేశాయ్ అండగా నిలిచాడు. దీంతో వాళ్ళ స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
Also Read: ఘనంగా నాగ చైతన్య-శోభిత పెళ్లి వేడుక, మెగాస్టార్ తో పాటు హాజరైన అతిథులు ఎవరంటే..?
అమీ జాక్సన్
స్టార్ హీరోయిన్ అమీ జాక్సన్ కూడా రెండో పెళ్లి చేసుకుంది. ఇంగ్లిష్ యాక్టర్, మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను ఆమె వివాహం చేసుకుంది. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు బ్రిటిష్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో రిలేషన్ షిప్‌లో ఉన్న ఆమె..ఓ బిడ్డను కూడా జన్మించింది. ఆతరువాత వీరిమధ్య విభేదాలు రాగా బ్రేకప్ చెప్పి మరో పెళ్ళి చేసుకుంది హరోయిన్.
Also Read: అఖిల్ పెళ్ళిపై కొత్త పుకారు.. మ్యారేజ్ డేట్ పై తేల్చేసిన నాగార్జున.
రాధిక శరత్ కుమార్
ఇక చిరంజీవితో దాదాపు 25 సినిమాల్లో నటించిన రాధిక శరత్ కుమార్ కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారు. కెరిర్ బిగినింగ్ లో నటుడు ప్రతాప్ పోతన్ ను పెళ్ళాడిన ఆమె... ఆతరువాత కొన్నాళ్లకు రిచర్డ్ ను పెళ్లి చేసుకున్నారు. ఆతరువాత అతనికి కూడా విడాకులు ఇచ్చి.. 2001 లో హీరో శరత్ కుమార్ ను పెళ్లాడారు. ప్రస్తుతం శరత్ కుమార్ తోనే ఉంటున్నారు.
Also Read: పెళ్లి పీటలెక్కనున్న మరో యంగ్ హీరో, బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లాడబోయే అమ్మాయి ఎవరో తెలుసా..?
Super Star Krishna
విజయనిర్మల.
సూపర్ స్టార్ కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు లేడీ డైరెక్టర్ కమ్ యాక్ట్రస్ విజయ నిర్మల. పెళ్లై హీరో నరేష్ పుట్టిన తరువాత ఆమె హీరోయిన్ గా సినిమాలు చేసింది. అప్పుడు హీరో కృష్ణతో ప్రేమలో పడి మొదటి భర్తకు విడాకులు ఇచ్చారు విజయనిర్మల. ఆతరువాత కృష్ణను పెళ్ళి చేసుకని చివరి వరకూ ఆయనతోనే ఉన్నారు.
Also Read:నాగ చైతన్య రొమాన్స్ రూమర్స్.. శృతీ హాసన్ నుంచి కృతీ శెట్టి వరకు 6 మంది హీరోయిన్లతో గాసిప్స్
Gouthami, court, land fraud
గౌతమి.
అందాల హీరోయిన్ గౌతమి కూడా అంతే. కాకపోతే గౌతమి రెండో పెళ్లి చేసుకోలేదు కాని సహజీవనం చేశారు. గౌతమి పెళ్ళై ఒక కూతురు పుట్టిన తరువాత విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న ఆమె... లోక నాయకుండు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు. ఆతరువాత కొన్నేళ్లకు తాము విడిపోతున్నట్టు ప్రకటించారు.