- Home
- Entertainment
- Devatha: రాధను తన భార్యగా అంగీకరించి దేవుడమ్మ దగ్గరికి తీసుకు వెళ్లిన ఆదిత్య.. మాధవ పరిస్థితి?
Devatha: రాధను తన భార్యగా అంగీకరించి దేవుడమ్మ దగ్గరికి తీసుకు వెళ్లిన ఆదిత్య.. మాధవ పరిస్థితి?
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇక ఈ రోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంకా ఆదిత్య (Adithya) గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని మాధవ (Madhava) అడుగుతాడు. ఆదిత్య నా పెనిమిటి అని రుక్మిణి గట్టిగా అరుస్తుంది. ఆ మాట దూరం నుంచి ఆదిత్య వింటాడు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా.. ఆదిత్య సార్ నా భర్త అని అంటుంది. అసలు నీకు నాకు సంబంధం ఏమిటి? అని మాధవ ను అడుగుతుంది.
నా భర్త కట్టిన తాళి మెడలో వేసుకుని నా భర్తనే ప్రాణంగా బతుకుతున్న అని చెబుతుంది. అది విన్న ఆదిత్య ఎంతో బాధపడతాడు. ఆ క్రమంలో రుక్మిణి (Rukmini) తాళిబొట్టు ని కూడా బయటకు తీసి చూపెడుతుంది. ఇక ఆదిత్య (Adithya) నా భార్య ఇంకా నా జ్ఞాపకాల తోనే బ్రతుకుతుంది అని ఎంతో ఆనంద పడుతూ ఉంటాడు.
మరోవైపు దేవుడమ్మ (Devudamma) ఫ్యామిలీ మొత్తం సత్య (Sathya) గురించి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు సత్య అక్కడకు వచ్చి మీ అందరి కోసం స్వీట్ చేసుకొని వచ్చాను ఉంటుంది. ఇక మాధవ నేనంటే రాధకి లెక్క లేకుండా పోతుంది. ఎక్కడో నా లెక్క తప్పుతుంది అని కసిగా అనుకుంటూ ఉంటాడు.
ఒకవైపు ఆదిత్య (Adithya).. రుక్మిణి (Rukmini) కి మాధవ్ కి సంబంధం లేదు. మరి ఎందుకు రుక్మిణి ఆ ఇంట్లో ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉంటాడు. నేను ఎలా అయినా నా రుక్మిణి ని ఇంటికి తీసుకు రావాలి అని ఆదిత్య అనుకుంటాడు. ఇక ఆదిత్య తన కూతురు కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళి పోతాడు. నా కూతురు ని ప్రశాంతంగా నేను దగ్గరకు తీసుకోవాలి అనుకుంటాడు.
ఇక స్కూల్ గ్రౌండ్ కి వెళ్ళిన ఆదిత్య (Adithya) దేవి కోసం వెతుకుతూ ఉంటాడు. తర్వాత ఆదిత్య రాధ (Radha) ఇంకా నా భార్యలాగె బ్రతుకుంది అని మా అమ్మకు చెప్పేస్తాను అని ఇంటికి తిరిగి వెళతాడు. ఇక ఇంటికి వెళ్లిన రుక్మిని లోపలికి వెళ్ళకుండా దీనంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా అక్కడకు ఏం జరిగింది అమ్మ అనుకుంటూ మాధవ తండ్రి వస్తాడు.
అంతే కాకుండా మాధవ (Madhava) తండ్రి మేము పిల్లల్ని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోవు.. వాళ్లతో పనులు ఎలా చూపిస్తున్నావు అని అడుగుతాడు. ఇక వాళ్లకు బాధ్యత తెలిసి రావాలని అలా చేస్తున్నాను అని రుక్మిణి (Rukmini) అంటుంది. మరోవైపు దేవుడమ్మ ఆదిత్య పెళ్లి గురించి వాళ్ల ఆడపడుచు మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
ఇక తరువాయి భాగంలో ఆదిత్య (Adithya).. మీ దగ్గరికి వెళ్లి భార్య చేతిలో భర్త పట్టుకుంటే ఎవరూ ఏమీ అనుకోరు అంటూ రుక్మిణి (Rukmini) ను కారులో తన ఇంటికి తీసుకొని వెళతాడు. ఇక దేవుడు అమ్మకు చూపిస్తాడు. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.