డబ్బుకోసం త్రిష అబద్దం చెప్పిందా? స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష అబద్దాలు చెపుతుందా..? డబ్బుకోసం ఆమెఇలాంటి పనులు చేస్తుందా.. ఓ స్టార్ సింగర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.

20 ఏళ్లుగా స్టార్ హీరోయిన్
సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు త్రిష. స్దాదాపు సౌత్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది.
Also Read: నాగచైతన్య బాగా నచ్చిన నాగార్జున రెండు సినిమాలు, సీక్వెల్ చేయడానికి రెడీ అవుతున్న అక్కినేని యంగ్ హీరో
అజిత్ పట్టుదల సినిమాలో
రీసెంట్ గా అజిత్ జోడీగా పట్టుదల సినిమాలో నటించి మెప్పించింది సీనియర్ బ్యూటీ. అయితే ఈమూవీ కథ అద్భుతంగా ఉంది అన్న పేరు వచ్చిన.. కమర్షియల్ గా మాత్రం ప్లాప్ అయ్యింది.
Also Read: సమంత కాదు, త్రిష కాదు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కిన షాకింగ్ హీరోయిన్ ఎవరు..?
గుడ్ బ్యాడ్ అగ్లీ ఏప్రిల్‌లో విడుదల
అజిత్ సరసన త్రిష మరో సినిమాలో నటిస్తోంది. ఈసినిమానే గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈమూవీ ఏప్రిల్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.త్రిష తెలుగులో మెగా స్టార్ చిరంజీవి సరసన విశ్వంబర చిత్రంలో, సూర్య సరసన 45వ చిత్రంలో, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న రామ్ చిత్రంలో కథానాయికగా నటిస్తుండటం గమనార్హం.
Also Read: రష్మిక ను విజయ్ దేవరకొండ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా..?
పొన్నియిన్ సెల్వన్ విజయం
హీరోయిన్ గా రిటైర్ అయ్యింది అనుకున్న టైమ్ లో మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది త్రిష. ఇక రీసెంట్ గా త్రిష ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. కొన్ని రోజుల క్రితం తన ట్విట్టర్ పేజీలో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కొన్ని ప్రకటనలు ప్రచురితమైనప్పుడు షాక్ అయ్యింది. దీని తరువాత, కొన్ని ప్రమోషనల్ పోస్టులు విడుదలైన తర్వాత, నటి త్రిష తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేయబడిందని ప్రకటించింది. దీనిని పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
గాయకుడు కాన్వే వెస్ట్ వ్యాఖ్య
ఇది పక్కన పెడితే, ప్రస్తుతం నెటిజన్లు త్రిష వ్యాఖ్యలపై ట్రోల్ చేస్తున్నారు. వాటిని ప్రముఖ అమెరికన్ గాయని కాన్యే వెస్ట్ చేసిన వ్యాఖ్యలతో పోల్చారు. ఇటీవల, గాయకుడు కాన్వే వెస్ట్ మాట్లాడుతూ, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంబంధం లేని ఉత్పత్తులను ప్రమోట్ చేసి, ఆపై వారి ఖాతాలు హ్యాక్ అయ్యాయని చెబుతారని అన్నారు. అలా చేసినందుకు వారికి భారీ బహుమతులు లభిస్తాయి. ఈ సింగర్ చేసిన కామెంట్స్ త్రిష ట్విట్టర్ హ్యాక్‌తో సమానంగా ఉండటంతో, త్రిష డబ్బు కోసం అబద్ధం చెబుతుందా అని నెటిజన్లు అనుమానిస్తున్నారు.