- Home
- Entertainment
- Bigg Boss 10: పదో వారం ఓటింగ్ రిజల్ట్.. బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
Bigg Boss 10: పదో వారం ఓటింగ్ రిజల్ట్.. బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
బిగ్ బాస్ తెలుగు 10 ఈ (పదో) వారం నామినేషన్లో ఎవరు ఉన్నారు, వీరిలో టాప్‌లో ఉన్నది ఎవరు, బాటమ్‌లో ఉన్నది ఎవరు? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది చూస్తే.

బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 షో ప్రారంభమై అప్పుడే పది వారాలు పూర్తవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ షోలో చాలా ట్విస్ట్ లు, టర్న్ లు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది సస్పెన్స్ గా మారింది. అయితే 9వ వారం ఎలిమినేషన్ లేదు. సుధీర్ చివర్లో సేఫ్ అయ్యాడు.
అయితే ఇప్పుడు పదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఓటింగ్ ప్రకారం ఎవరు బాటమ్‌లో ఉన్నారనేది ఆసక్తికరంగా. గత వారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ వారం ఓటింగ్‌లో ఎవరు వెనకబడ్డారు, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందనేది చూస్తే,
పదో వారం నామినేషన్లో ఉన్నది ఎవరంటే?
పదో వారంలో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, సుధీర్, నరేష్, రామ్ ప్రసాద్, స్వేత నాయుడు, రామకృష్ణ, శివకుమార్ నామినేషన్లో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు బాటమ్‌లో, ఎవరు టాప్‌లో ఉన్నారనేది చూస్తే, ముఖేష్ దుమ్ములేపుతున్నాడు. త్రిగుణ్‌ని దాటి టాప్‌లో ఉంటున్నారు. రోహిత్ ఓటింగ్ ముఖేష్‌కి పడుతున్నాయనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ తర్వాత త్రిగుణ్ ఉన్నాడు. సాలిడ్ ఓటింగ్‌తో రాణిస్తున్నాడు. నరేష్, అమన్, శివకుమార్ మంచి ఓటింగ్‌తో దూసుకుపోతున్నారు.
పదో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఇక తక్కువ ఓటింగ్ ఉన్నవారిలో శ్వేత నాయుడు, సుధీర్, రామ్ ప్రసాద్, రామకృష్ణ ఉన్నారు. వీరికి మీడియం స్థౠయిలో ఓటింగ్ వస్తుంది. డేంజర్లో మాత్రం డేబ్జానీ, వర్షిణి, నీతూ నటరాజ్ ఉన్నట్టు సమాచారం. కొందరి ఓటింగ్‌లో శివకుమార్, రామకృష్ణ, స్వేత బాటమ్‌లో ఉన్నారు. ఏదేమైనా పదో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. నీతూ నటరాజ్, రామకృష్ణ, స్వేత నాయుడు, దేబ్జానీ, శివకుమార్‌లో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారని చెప్పొచ్చు.
అయితే ఈ ప్రైవేట్ ఓటింగ్‌కి, బిగ్ బాస్ ఓటింగ్‌కి సంబంధం లేదు. అది కొన్నిసార్లు వేరుగా ఉండొచ్చు. స్వల్పంగా మార్పులు ఉండొచ్చు. కాబట్టి రేపటి(శనివారం) సాయంత్రానికి ఎవరు ఎలిమినేషన్, ఎవరు సేఫ్ అనేది క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు హౌజ్‌లో ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, సుధీర్, నరేష్, రామ్ ప్రసాద్, స్వేత నాయుడు, రామకృష్ణ, శివకుమార్, వంశీ హౌజ్‌లో ఉన్నారు. వరుసగా మూడు వారాలు డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉంది.













