అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..
Actress Sreeleela: ‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైంది యంగ్ బ్యూటీ శ్రీలీల. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి.. అందం, అభినయంతో తనకంటూ ఫాలోయింగ్ సంపాదించింది శ్రీలీల. మరి ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు..

శివ కార్తికేయన్ సరసన..
‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల.. అందం, అభినయంతో తెలుగునాట క్రేజీ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ‘పరాశక్తి’ అనే మూవీలో నటిస్తోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రవి మోహన్, అథర్వ మురళి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 10న విడుదల కానుంది.
ప్రమోషన్స్ జోరు..
ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. ఇందులో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల సినిమాతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నది తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
అబ్బాయిల జోలికి వెళ్ళను..
తన పెళ్లిపై మాట్లాడిన శ్రీలీల.. పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తన వయస్సు 24 సంవత్సరాలు అని.. 30 ఏళ్లు దాటేవరకు పెళ్లి చేసుకోను అని.. అలాగే అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తాను లవ్‌లో ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ అదంతా వట్టి పుకార్లు మాత్రమేనని తేల్చింది.
అమ్మ నా వెంట..
నేను ఎవరితోనూ ప్రేమలో పడలేదు. షూటింగ్స్ అయినా.. మరెక్కడికైనా వెళ్లేటప్పుడు నేను మా అమ్మను వెంట తీసుకెళ్తున్నా.. అలాంటప్పుడు నేనెలా ప్రేమలో పడగలను అని తేల్చి చెప్పింది. యూఎస్ వెళ్లినప్పుడు కూడా నేను మా అమ్మతోనే వెళ్ళాను. అయినా నాపై రూమర్స్ వచ్చాయని అని శ్రీలీల చెప్పుకొచ్చింది.
హిట్స్ తక్కువ..
హీరోయిన్ శ్రీలీల కెరీర్‌లో హిట్స్ తక్కువేనని చెప్పాలి. అయితేనేం వరుసగా ఈ అమ్మడు క్రేజీ ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ చిన్నది నాలుగు సినిమాల్లో నటిస్తోంది. 'మాస్ జాతర', 'పరాశక్తి', 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు కార్తీక్ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తోంది.

