- Home
- Entertainment
- Sanam Shetty: విద్యార్థుల కోసం వెళ్లి 'జన నాయగన్' మూవీపై కామెంట్స్.. చిక్కుల్లో పడ్డ శ్రీమంతుడు నటి
Sanam Shetty: విద్యార్థుల కోసం వెళ్లి 'జన నాయగన్' మూవీపై కామెంట్స్.. చిక్కుల్లో పడ్డ శ్రీమంతుడు నటి
చెన్నైలో జరుగుతున్న నీట్ నిరసనలో పాల్గొనేందుకు వెళ్లిన నటి సనం శెట్టికి చేదు అనుభవం ఎదురైంది. విద్యార్థులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
15

Image Credit : X
Sanam Shetty
టి.నగర్‌లోని బాలన్ ఇల్లంలో జరిగిన విద్యార్థుల నిరసనలో సనం శెట్టి మాట్లాడారు. తాను విద్యార్థుల హక్కుల కోసమే వచ్చానని చెప్పారు. అయితే, ప్రసంగం మధ్యలో "నేను దళపతి విజయ్ వీరాభిమానిని. నిన్నే 'జనగణనాయకన్' సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసొచ్చాను" అని ఆమె అనగానే, అక్కడున్న కొందరు విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. నీట్ నిరసనపై విజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారు?అని కొందరు ప్రశ్నించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : X
మైక్ లాగేసిన విద్యార్థులు
విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా సనం శెట్టి తన ప్రసంగాన్ని కొనసాగించారు. "ప్రతి పౌరుడికి తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది. ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను" అని ఆమె స్పష్టం చేశారు. ఆ సమయంలో, ఒక విద్యార్థి సంఘం నేత వేదికపైకి వచ్చి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. "ఎవరి ఒత్తిడితోనూ నేను ఇక్కడికి రాలేదు. విద్యార్థులకు మద్దతు తెలిపేందుకే నా సొంత ఇష్టంతో వచ్చాను" అని సనం బదులిచ్చారు. ఈ వాదన జరుగుతుండగానే, మరో యువకుడు ఆమె చేతిలోంచి మైక్‌ను లాక్కోవడంతో అక్కడ తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత నెలకొన్నాయి.
35
Image Credit : Asianet News
మాట్లాడకుండా అడ్డుకున్నారు
అక్కడి నుంచి బయటకు వచ్చిన సనం శెట్టి, మీడియాతో ఆవేదనగా మాట్లాడారు. "నేను ఏం మాట్లాడాలో ఇతరులు నిర్ణయించలేరు. విద్యార్థుల కోసం మాట్లాడమని పిలిచి, ఆ తర్వాత మాట్లాడకుండా అడ్డుకున్నారు. నేను 'జనగణనాయకన్' సినిమా చూశానని నన్ను 'జోకర్' అనడం దారుణం" అని ఆమె అన్నారు. "భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్లే నా చేతిలోంచి మైక్ లాక్కున్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? మాట్లాడే హక్కునే కాలరాస్తూ, వాళ్లు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది" అని ఆమె విమర్శించారు.
45
Image Credit : Asianet News
విద్యార్థుల సంక్షేమం కోసమే
తాను ఏ రాజకీయ ఉద్దేశంతోనూ నిరసనకు రాలేదని, కేవలం విద్యార్థుల సంక్షేమం కోసమే వచ్చానని సనం శెట్టి స్పష్టం చేశారు. "నా పూర్తి మద్దతు విద్యార్థులకే. కానీ విద్యార్థుల భావోద్వేగాలను ఎవరూ తమ స్వార్థానికి వాడుకోవద్దు. ఏ పరిస్థితిలోనూ నా అభిప్రాయాన్ని చెప్పే హక్కును వదులుకోను" అని ఆమె తేల్చిచెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
55
Image Credit : Asianet News
శ్రీమంతుడు చిత్రంలో మెరిసిన సనమ్ శెట్టి
సనమ్ శెట్టి తమిళం తో పాటు తెలుగులో కూడా నటించింది. మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ శ్రీమంతుడు చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ప్రేమికుడు అనే మూవీలో కూడా నటించింది.
Latest Videos

