MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Nagadurga Second Film: స్టార్‌ హీరోయిన్లకి షాకిస్తున్న ఫోక్‌ సంచలనం.. నాగదుర్గ రెండో సినిమా షురూ

Nagadurga Second Film: స్టార్‌ హీరోయిన్లకి షాకిస్తున్న ఫోక్‌ సంచలనం.. నాగదుర్గ రెండో సినిమా షురూ

తెలంగాణ జానపద నృత్యకారిణి నాగదుర్గ తెలుగులో మరో సినిమా చేస్తోంది. `శనార్తి` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం నేడు శుక్రవారం ప్రారంభమైంది. తెలంగాణ కల్చర్‌ని ఆవిష్కరించేలా ఈ మూవీ ఉంటుందట.

3 Min read
Author : Aithagoni Raju
Published : Aug 14 2026, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోయిన్‌గా వరుస ఆఫర్లు అందుకుంటున్న నాగదుర్గ
Image Credit : Youtube/JSR NETWORKS

హీరోయిన్‌గా వరుస ఆఫర్లు అందుకుంటున్న నాగదుర్గ

జానపద పాట సంచలనం నాగదుర్గ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఆమె ఇప్పటికే కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `లవ్‌ ఓ లవ్‌` పేరుతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లోకి వచ్చింది. కానీ ఆడియెన్స్ పట్టించుకోలేదు. ఓటీటీలో మాత్రం బాగా ఆదరణ పొందింది. ఇక ఇటీవలే తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతూ రూపొందుతున్న సినిమా `ఇడుపు కాయితం` ఆ మధ్యనే ప్రారంభమైంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా స్టార్ట్ కావడం విశేషం. `శనార్తి` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా `షురూ
Image Credit : Asianet News

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా `షురూ

`రాజు వెడ్స్ రాంబాయి` ఫేమ్‌ అఖిల్‌ రాజ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తుంది. సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది. సంపత్ నంది శిష్యుడైన రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'శనార్తి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇది తెలంగాణలో సాంప్రదాయకంగా పలకరించడానికి ఉపయోగించే పదం. టైటిల్ పోస్టర్‌లో ఒక చేయి పసుపు పచ్చ రంగులో, మరొక చేయి ఎరుపు రంగులో ఒకదానికొకటి పట్టుకున్న రెండు చేతులు.. విభిన్న రంగులు, అనుబంధం, సంప్రదాయం, ఐక్యతను అందంగా సూచిస్తాయి. రెండు చేతుల మణికట్టు చుట్టూ పవిత్రమైన జంధ్యాలు కట్టి ఉండగా, ఎరుపు రంగు వేసిన చేతికి సాంప్రదాయ ఎర్ర గాజుల దండ అలంకరించబడి ఉంది. పసుపు, కుంకుమ రంగులతో పాటు, ఈ అంశాలు తెలంగాణ ఆచారాలు, వేడుకలు, సంప్రదాయాల వాతావరణాన్ని గుర్తుకు తెస్తున్నాయి.

Related Articles

Related image1
Husharu Pittalu Review: హుషార్‌ పిట్టలు మూవీ రివ్యూ.. కుర్రాళ్లకి పండగే, కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
Related image2
Agnipariksha Final List: అగ్ని పరీక్ష టాప్ 15 లిస్ట్.. పదో సీజన్‌లోకి వెళ్లేది వీళ్లేనా ?
35
తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో శనార్తి
Image Credit : Asianet News

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో శనార్తి

టైటిల్ కింద `A Tale of Culture` అనే ట్యాగ్‌లైన్ సినిమా బ్యాక్ డ్రాప్ ని స్పష్టంగా సూచిస్తుంది. సాంస్కృతిక చిహ్నాలను ఆసక్తికరమైన విజువల్ మేళవించి టైటిల్ పోస్టర్ బలమైన ముద్ర వేస్తుంది. రచయితగా, కథకుడిగా, షో రన్నర్‌గా తనకున్న ప్రతిభతో పేరుగాంచిన దర్శకుడు సంపత్ నంది 'ఓదెల' ఫ్రాంచైజీతో సహా విజయవంతమైన కథలు, ఫ్రాంచైజీలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 'శనార్తి'తో ఆయన అనుబంధం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. తన విలక్షణమైన సంగీతంతో శంసలు పొందిన సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతపరంగా మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఆయన అందించే సంగీతం సినిమాలోని గ్రామీణ నేపథ్యానికి సరిగ్గా సరిపోవడమే కాకుండా చిత్రంలోని భావోద్వేగాలను పెంచుతోంది.

45
నాగదుర్గ రిక్వెస్ట్
Image Credit : Youtube/sytv

నాగదుర్గ రిక్వెస్ట్

నాగ దుర్గ మాట్లాడుతూ, నన్ను అభిమానించే అందరూ నేను ఎలాంటి సినిమాతో కనిపించాలని కోరుకుంటున్నారో.. అలాంటి సినిమా ఇది. కచ్చితంగా మీరందరూ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. అలాంటి మంచి సినిమా ఇది. నాకు సపోర్ట్ చేసిన సంపత్ నంది గారికి థాంక్యూ` అని చెప్పింది. హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరి ప్రేమాభిమానాలు కావాలి` అని అన్నాడు.

55
చిరంజీవి, శ్రీదేవి లాగా అఖిల్‌, నాగదుర్గ
Image Credit : Asianet News

చిరంజీవి, శ్రీదేవి లాగా అఖిల్‌, నాగదుర్గ

సంపత్ నంది మాట్లాడుతూ.. ఏ సినిమా చేయడానికి అయినా కథ కారణం అవుతుంది. ఈ సినిమా చేయడానికి మాత్రం కథతో పాటు గణేష్ కారణం. గణేష్ చాలా ప్రతిభావంతుడు. తను దర్శకుడు కావడానికి సపోర్ట్ చేసిన శ్రీధర్ కి ధన్యవాదాలు. అలాగే ఆదిత్య మూవీస్ ఉమేష్ కి కూడా ధన్యవాదాలు. ‘శనార్తి’.. పల్లెటూరిలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు ఉపయోగించే పదం ఇది. ఈ ప్రేమకథకి ఈ పదం అచ్చంగా సరిపోతుంది. అఖిల్‌కి ఈ కథ చాలా నచ్చింది. అలాగే నాగ దుర్గ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడానికి కారణం అఖిల్. ఇందులో హీరోయిన్ పాత్రకు నాగదుర్గ బాగుంటుందని సజెస్ట్ చేశాడు. నిజంగా ఆమె వీడియోలను చూసినప్పుడు ఈ పాత్రకు తనే పర్ఫెక్ట్ అనిపించింది. ఇద్దరూ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తారు. చిరంజీవి గారు-శ్రీదేవి గారు, వెంకటేష్ గారు-సౌందర్య గారిని తెరపై చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుందో.. వీళ్లిద్దరి కాంబినేషన్ కూడా అంత అందంగా ఉంటుంది. ఇది మన సినిమా` అని చెప్పాడు. మొత్తంగా నాగదుర్గ ఇంకా హీరోయిన్‌గా పరిచయం కాలేదు. కానీ అప్పుడే స్టార్‌ హీరోయిన్లకి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Husharu Pittalu Review: హుషార్‌ పిట్టలు మూవీ రివ్యూ.. కుర్రాళ్లకి పండగే, కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
Recommended image2
Vishwanath and Sons Review: విశ్వనాథ్‌ అండ్‌ సన్స్ మూవీ రివ్యూ, సూర్య తెలుగు సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Vishwanath And Sons Twitter Review: థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సూర్య.. విశ్వనాథ్ అండ్ సన్స్ పబ్లిక్ టాక్
Related Stories
Recommended image1
Husharu Pittalu Review: హుషార్‌ పిట్టలు మూవీ రివ్యూ.. కుర్రాళ్లకి పండగే, కానీ అసలు ట్విస్ట్‌ ఏంటంటే?
Recommended image2
Agnipariksha Final List: అగ్ని పరీక్ష టాప్ 15 లిస్ట్.. పదో సీజన్‌లోకి వెళ్లేది వీళ్లేనా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved