- Home
- Entertainment
- మగాళ్ళను కుక్కలతో పోల్చిన స్టార్ హీరోయిన్ రమ్య, ఇచ్చి పడేస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే?
మగాళ్ళను కుక్కలతో పోల్చిన స్టార్ హీరోయిన్ రమ్య, ఇచ్చి పడేస్తున్న నెటిజన్లు.. అసలు విషయం ఏంటంటే?
ఈమధ్య కొంత మంది సెలబ్రిటీల మాటలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. మొన్నటి వరకూ అనసూయ,శివాజీల కామెంట్స్ రచ్చ మర్చిపోకముందే.. మరో నటి తన నోటికి పనిచెప్పింది. మగాళ్లని కుక్కలతో పోల్చి.. మరో వివాదానికి తెరలేపింది.

నోరు పారేసుకుంటున్న సెలబ్రిటీలు..
ఈమధ్య కాలంలో సినిమా సెలబ్రిటీలు కొంతమంది అనవసరంగా నోరు పారేసుకుంటున్నారు. సమాజాన్ని ప్రభావితంచేయగల స్థానంలో ఉన్నవారు..ప్రజలకు మంచి చెప్పాల్సింది పోయి.. వివాదాలతో.. వీధుల్లోకి ఎక్కుతున్నారు. సినిమాలకంటే కూడా సోషల్ మీడియా పోస్టులు, కాంట్రవర్సియల్ కామెంట్స్ వల్లే వారు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. సున్నితమైన సామాజిక అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి.. నోటికొచ్చినట్టు వారు చేస్తున్న కామెంట్స్ లేనిపోని వివాదాలకు దారితీస్తున్నాయి. అంతే కాదు వారిపై ట్రోలింగ్ కు కారణం అవుతున్నాయి. ఈమధ్య కాలంలో అనసూయ, శివాజీ, నా అన్వేషణ వివాదం ఎంత రచ్చ అయ్యిందో చూస్తూనే ఉన్నాం.. ఈలోపుమరో నటి చేసిన కామెంట్స్ తాజాగా దుమారం రేపుతున్నాయి. కన్నడ నటి రమ్య మగాళ్లపై చేసిన వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు.
స్ట్రీట్ డాగ్స్ విషయంలో సుప్రీంకోర్టు కామెంట్స్..
తాజాగా హీరోయిన్ రమ్య మగాళ్లపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. కన్నడ సినిమాలతో పాటు.. తెలుగు సినిమాలలో కూడా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమ్య.. తాజాగా ఓ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. స్ట్రీట్ డాగ్స్ వల్ల పెరుగుతున్న దాడులు, ప్రజల భద్రతపై ఆందోళనల నేపథ్యంలో జంతు నియంత్రణ, టీకాల అమలు అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కుక్కలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము.. జంతువుల మనస్థితిని అంచనా వేయడం కష్టమని కోర్టు వ్యాఖ్యానించింది. కొన్ని సందర్భాల్లో కుక్కలు మనుషుల భయాన్ని గుర్తించి దాడి చేయవచ్చని కూడా వాదనలు వినిపించాయి.
మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి...
సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన నటి రమ్య, ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన అభిప్రాయం వెల్లడించింది. అందులో కుక్కల ప్రవర్తనను మనుషుల నేరప్రవృత్తితో పోల్చారు. “ఒక వ్యక్తి ఎప్పుడు అత్యాచారం , హత్య చేస్తాడో ముందుగా తెలుసుకోవడం సాధ్యం కాదంటే, అందరు పురుషులను జైలులో పెట్టాలా?” అనే తరహా ప్రశ్నను ఆమె లేవనెత్తారు. కుక్కలు కూడా విషయాన్ని మనుషులతో ముడిపెడుతూ.. ఆమె చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రమ్యపై మండిపడుతున్న నెటిజన్లు
చాలా మంది నెటిజన్లు ఈ పోలిక సరికాదని, మొత్తం ఒక వర్గాన్ని ఇలా అనడం తగదని విమర్శిస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఆమె కామెంట్స్ వెనుక ఉన్న అభిప్రాయం వేరని, దాన్ని అర్ధం చేసుకోవాలసి అవసరం ఉందని రమ్యను వెనకేసుకొస్తున్నారు. కానీ రమ్య కామెంట్స్ పై ఎక్కువగా నెగటివ్ రియాక్షన్‌నే వస్తోంది. రమ్య ఈ కామెంట్స్ చేయడం కొత్తేమి కాదు.. గతంలో కూడా ఈ హీరోయిన్ కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసి.. రచ్చ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నెటిజన్లు కూడా గుర్తు చేస్తున్నారు.
టాలీవుడ్ లోను సినిమాలు చేసిన రమ్య..
కన్నడతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించిన రమ్య, కళ్యాణ్ రామ్ నటించిన ‘అభిమన్యు’, సూర్య నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.సినిమాల తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే వాటిపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. వివాదాలకు కారణం అవుతోంది. తాజాగా వీధి కుక్కల ప్రవర్తను.. పురుషుల ప్రవర్తనని పోల్చి నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

