MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి

Actress Poorna: రెండోసారి తల్లి కాబోతున్న నటి పూర్ణ, బేబీ బంప్ ఫోటోలు చూసేయండి

Actress Poorna: నటి పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిం. తెలుగులో మంచి హీరోయిన్ పేరు తెచ్చుకుని ఇప్పుడు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. ఇప్పుడు రెండోసారి గర్భం దాల్చినట్టు బేబీ బంప్ ఫోటోలతో ప్రకటించింది.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 11 2026, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
నటి పూర్ణ ఫోటోలు
Image Credit : X

నటి పూర్ణ ఫోటోలు

నటి పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. ఈమె తెచ్చిన భారత సినీ పరిశ్రమలో ఎంతో గుర్తింపు పొందిన నటి. మంచి డాన్సర్ కూడా. తెలుగు ప్రేక్షకులకు మాత్రం పూర్ణ పేరుతోనే పరిచయం అయింది. మలయాళం, తెలుగు, తమిళ కన్నడ భాషలో ఆమె ఎన్నో సినిమాలు చేసింది. పూర్ణ కేరళలోని కన్నూర్ ప్రాంతానికి చెందిన అమ్మాయి. డాన్స్ పై ఆసక్తితో డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బేబీ బంప్ ఫోటోలతో పూర్ణ
Image Credit : X

బేబీ బంప్ ఫోటోలతో పూర్ణ

2004లో మలయాళ సినిమా ద్వారా సినీ రంగంలోకి వచ్చింది. తర్వాత తెలుగులో కూడా నటించింది. ఇప్పుడు కొన్ని టీవీ షోలో జడ్జిగా కూడా కనిపిస్తోంది. స్టేజ్ ప్రోగ్రాములు, డాన్స్ షోల ద్వారా ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే పూర్ణ 2022లో అక్టోబర్లో షానిద్ ఆసిఫ్ అలీ అనే దుబాయ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లి కూడా దుబాయ్ లోనే జరిగింది. పెళ్లి తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది. తన భర్త తనకు ఎంతో సపోర్ట్ చేస్తాడని, కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా ఉందని ఆమె ఎన్నోసార్లు చెబుతూ ఉంటుంది.

Related Articles

Related image1
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Related image2
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
34
భర్తతో పూర్ణ ఫోటోలు
Image Credit : X

భర్తతో పూర్ణ ఫోటోలు

సినిమాల్లోనే కాకుండా, పూర్ణ పలు టీవీ సీరియళ్లు, షోలలో కూడా కనిపించేది. ఇటీవల బాలయ్య 'అఖండ 2 తాండవం' చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించింది. 2023 ఏప్రిల్ లో పూర్ణకు ఒక బాబు పుట్టాడు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారానే పంచుకుంది. తర్వాత 2025లో గర్భం దాల్చినట్టు ప్రకటించింది. ఇప్పుడు బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో పూర్ణ ఎంతో అందంగా కనిపిస్తోంది. పూర్ణ కేవలం నటిగానే కాదు కష్టపడి ఎదిగిన మహిళగా కూడా ఎంతోమందికి కారణంగా నిలుస్తుంది.

44
కుటుంబానికే విలువ
Image Credit : X

కుటుంబానికే విలువ

పూర్ణ కుటుంబ జీవితానికి చాలా విలువ ఇస్తుంది. దుబాయ్ లో ఆమె పూర్తిగా సెటిల్ అయింది. కానీ అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం ఇండియాకు వచ్చి వెళుతుంది. పదే పదే హైదరాబాద్ కు కూడా వచ్చి షూటింగులలో పాల్గొంటుంది.  తనతో పాటూ తన కొడుకు హమ్జాద్ ను కూడా తీసుకుని వస్తుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image2
Mahesh Bang: రామ్ చరణ్ ఉపాసన కవలల డెలివరీ ముహూర్తం పెట్టిన జ్యోతిష్కుడు ఈయనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved