MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం

Actress Work with 7 CMs: ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఆ కోరిక తీరకుండానే మరణం

Actress Work with 7 CMs: నటి మనోరమ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అనేక భాషల్లో నటించి మెప్పించింది. అంతేకాదు ఆమె ఏడుగురు సీఎంలతో కలిసి నటించింది. అరుదైన ఘనతని ఆమె సొంతం చేసుకుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2026, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి
Image Credit : Chat Gpt

ఏడుగురు సీఎంలతో కలిసి నటించిన ఏకైక నటి

సినిమా ఇండస్ట్రీలో ఊహించని మిరాకిల్స్ జరుగుతుంటాయి. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు స్టార్‌ అయిపోవచ్చు, బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్నవారు రాణించలేకపోవచ్చు. ఒక్క సినిమా జీవితాలనే మార్చేస్తుంది. ఇలాంటి మిరాకిల్స్ మాత్రమే కాదు ఊహించనివి చాలా ఉంటాయి. అయితే ఒక నటి ఏడుగురు సీఎంలతో పనిచేసిన సంఘటన కూడా ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. ఏడుగురు సీఎంలతో కలిసి నటించడమనేది దేశంలోనే చాలా అరుదైన సంఘటనగా చెప్పొచ్చు. అలాంటి అరుదైన సంఘటన.. ఒక్క నటి మనోరమ విషయంలో చోటు చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చిన మనోరమ
Image Credit : our own

నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చిన మనోరమ

మనోరమ నటించిన ఏడుగురు సీఎంలు ఎవరనేది చూస్తే, మనోరమ.. సినిమాల్లోకి రాకముందు నాటకాలు ప్రదర్శించారు. ఆమె సుమారు ఐదు వేల నాటకాల ప్రదర్శించినట్టు సమాచారం. అప్పట్లో నాటకాలకు విశేషమైన ఆదరణ ఉండేది. వాటి ద్వారానే సీనియర్‌ నటీనటులు సినిమాల్లోకి వచ్చారు. అలా మనోరమ.. నాటకాలు వేసే సమయంలోనే  కరుణానిధి, అన్నాదురైలతో కలిసి పనిచేసిందట. వీరు ఎన్నో నాటకాలు వేశారట.  ఆ తర్వాత అన్నాదురై, కరుణానిధి సీఎంలు అయిన విషయం తెలిసిందే. 

35
తెలుగు, తమిళ సీఎంలతో మనోరమ మూవీస్‌
Image Credit : Asianet News

తెలుగు, తమిళ సీఎంలతో మనోరమ మూవీస్‌

ఇక సినిమాల్లో ఐదుగురు సీఎంలతో పనిచేసింది మనోరమా. ఆమె ఎంజీఆర్‌తో అనేక సినిమాలు చేసింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత జయలలితతో పనిచేసింది. ఆమె హీరోయిన్‌గా చేసిన చాలా చిత్రాల్లో కలిసి నటించింది మనోరమా. అలాగే తెలుగులో ఎన్టీఆర్‌తోనూ కలిసి నటించిందట. రాము, మంచికి మరో పేరు వంటి ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లో మనోరమ నటించిందని సమాచారం. దీనికి సంబంధించిన మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

45
మొన్నటి సీఎం స్టాలిన్‌తో, అలాగే రేపటి సీఎం విజయ్‌తోనూ
Image Credit : our own

మొన్నటి సీఎం స్టాలిన్‌తో, అలాగే రేపటి సీఎం విజయ్‌తోనూ

మరోవైపు మొన్నటి వరకు తమిళనాడు సీఎంగా చేసిన స్టాలిన్‌తోనూ కలిసి నటించింది మనోరమ. స్టాలిన్‌ పెద్దగా సినిమాలు చేయలేదు, కానీ `మక్కల్‌ అనైయిట్టల్‌`, `ఓరె రత్తం` అనే చిత్రాల్లో నటించాడు. ఈ మూవీస్‌లో మనోరమ కూడా చిన్న పాత్రల్లో మెరిసింది. ఇలా స్టాలిన్‌తోనూ సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం తమిళనాడులో కాబోయే సీఎం విజయ్‌ తోనూ అనేక సినిమాలు చేసింది మనోరమ. ఇలా అన్నాదురై, ఎంజీఆర్‌, కరుణానిధి, ఎన్టీఆర్‌, జయలలిత, స్టాలిన్‌, దళపతి విజయ్‌లతో నటించింది. ఇలా ఏడుగురు సీఎంలతో పనిచేసిన అరుదైన ఘనత మనోరమ సొంతం.

55
మనోరమ తీరని కోరిక
Image Credit : our own

మనోరమ తీరని కోరిక

మనోరమ దాదాపు ఐదు దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను శాసించింది. హీరోయిన్‌గా, నటిగా ఆకట్టుకుంది. తనదైన నటనతో మెప్పించింది. కామెడీ చేయడంలోనూ ఆమె ముందే ఉన్నారు. అయితే మనోరమ అనేక పాత్రలు పోషించింది. కానీ ట్రాన్స్ జెండర్‌గా చేయలేదు. ఒక్క సినిమాలో అయినా అలా ట్రాన్స్ జెండర్‌గా నటించాలని ఉండేదట. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయింది. అనారోగ్యం కారణంగా 2013 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఆమె  2015లో కన్నుమూసింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Related Stories
Recommended image1
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image2
Gang Leader: చిరంజీవి గ్యాంగ్‌ లీడర్‌తో పోటీపడి చిత్తైపోయిన సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు.. రాజేంద్రప్రసాద్‌ రాక్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved