MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • డైరెక్టర్ ముందు నల్ల బావ అని చిరంజీవిని పిలిచిన నటి, చుక్కలు చూపించిన మెగాస్టార్.. సురేఖ ఏం చేశారో తెలుసా

డైరెక్టర్ ముందు నల్ల బావ అని చిరంజీవిని పిలిచిన నటి, చుక్కలు చూపించిన మెగాస్టార్.. సురేఖ ఏం చేశారో తెలుసా

మెగాస్టార్ చిరంజీవిని ఓ నటి ముద్దుగా నల్లబావ అని పిలుస్తారట. అలా పిలిచినప్పుడు చిరంజీవి రియాక్షన్ ఏంటి ? ఆయన ఫ్యామిలీతో ఆమెకి ఉన్న అనుబంధం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 17 2026, 02:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవిపై హేమ కామెంట్స్
Image Credit : Instagram/Chiranjeevi

చిరంజీవిపై హేమ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. సంక్రాంతి ముగిసినా శంకర వరప్రసాద్ జోరు తగ్గేలా లేదు. ఇది పక్కన పెడితే చిరంజీవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల వివాదాల్లో నిలిచిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నల్ల బావ అని పిలిచిన నటి
Image Credit : Asianet News

నల్ల బావ అని పిలిచిన నటి

చిరంజీవిని హేమ ముద్దుగా నల్ల బావ అని పిలుస్తారట. గతంలో ఓ స్టార్ డైరెక్టర్ ముందు అలా పిలవడంతో చిరంజీవి గారు తనకి చుక్కలు చూపించారు అని హేమ గుర్తు చేసుకుంది. హేమ మాట్లాడుతూ చాలా ఏళ్ళ క్రితం పోకిరి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పక్కనే చిరంజీవి గారి సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. 

Related Articles

Related image1
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్
Related image2
Chiranjeevi కెరీర్ లో టాప్ 5 గ్రాసర్స్..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఆ మూవీని బీట్ చేసే సత్తా ఉందా ?
35
పూరి జగన్నాధ్ కి తెలుసు
Image Credit : Asianet News

పూరి జగన్నాధ్ కి తెలుసు

పూరి జగన్నాధ్ గారు నాకు బాగా కావలసిన వారు కావడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి ఇక్కడ ఉన్నావ్ అని పూరి అడిగారు. పక్కనే నల్ల బావ సినిమా షూటింగ్ జరుగుతోంది అని చెప్పా. అవునా.. అయితే నేను కూడా వస్తాను.. వెళదాం పద అని పూరి అన్నారు. నేను చిరంజీవి గారిని నల్ల బావ అని పిలుస్తాను అని పూరి గారికి మరికొందరికి తెలుసు అని హేమ తెలిపింది. 

45
అయితే నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు ?
Image Credit : Instagram/@hemakolla1211

అయితే నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎవరు ?

ఇద్దరం వెళ్లి చిరంజీవి గారిని కలిశాం. మిమ్మల్ని హేమ నల్లబావ అని పిలుస్తోంది అని పూరి జగన్నాధ్ చిరంజీవి గారికి చెప్పేశారు. దీనితో నాకు టెన్షన్ మొదలైంది. నేను మరీ అంత నల్లగా ఉన్నానా హేమ అని అడిగారు. అంటే ఏంటి ఇప్పుడు నాగబాబు తెల్లబావ, పవన్ కళ్యాణ్ చిన్న బావ అవుతారా నీకు అని నన్ను ఆడేసుకున్నారు. 

55
సురేఖ కొణిదెల ఏం చేశారంటే
Image Credit : Instagram/@hemakolla1211

సురేఖ కొణిదెల ఏం చేశారంటే

మరుసటి రోజు షూటింగ్ కి పరుచూరి వెంకటేశ్వర రావు గారు వచ్చారు. నన్ను ముందు పెట్టుకుని.. నేను నల్లగా ఉన్నానా వెంకటేశ్వర రావు గారు అని అడిగారు. ఆయన మీరు నల్లగాలేరు బాబు.. చామనఛాయ అని చెప్పారు. నన్ను చిరంజీవి గారు ఆడుకుంటున్నారు అనే విషయం ఆయనకి తెలియదు. తన ఇంట్లో ఏ మంచి విషయం జరిగినా తాను నాగార్జున, చిరంజీవి గారికి చెబుతాను అని హేమ అన్నారు. తాను బీఎండబ్ల్యూ ఎక్స్ 5 కారు కొన్నప్పుడు తొలిసారి కీస్ చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకొవాలి అనుకున్నా. చిరంజీవి గారికి చెబితే వెంటనే ఓకె చెప్పారు. అలా ఆయన చేతుల మీదుగా కీస్ తీసుకుని కారు డ్రైవ్ చేశా. చిరంజీవి గారు కారులో కూర్చున్నారు. ఆయన ఇంటి చుట్టూ డ్రైవ్ చేశా. ఈ లోపు చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు పట్టు చీర, పసుపు కుంకుమ రెడీ చేసి నాకు కానుకగా ఇచ్చి పంపారు. చిరంజీవి గారి ఫ్యామిలీతో అంత మంచి రిలేషన్ ఉంది అని హేమ గుర్తు చేసుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana: రామాయణ్‌పై టాక్సిక్‌ డిజాస్టర్‌ దెబ్బ, ప్రమోషన్‌లో వెనుకబాటు.. సైలెన్స్ కి కారణం ఇదేనా?
Recommended image2
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image3
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Related Stories
Recommended image1
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్
Recommended image2
Chiranjeevi కెరీర్ లో టాప్ 5 గ్రాసర్స్..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఆ మూవీని బీట్ చేసే సత్తా ఉందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved