ఆర్జీవీని మొదటిసారి చూడగానే చాలా భయమేసింది.. ఓపెన్‌గా చెప్పేసిన క్రేజీ హీరోయిన్
Actress Dakkshi: నటి దక్షీ గుత్తికొండ తన తొలి చిత్రం కరోనా వైరస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గురించి మాట్లాడారు. తాను ఆర్జీవీని మొదట కలిసినప్పుడు భయమేసిందని.. కానీ.! ఆ తర్వాత ఆయనకు..

అప్పుడు చాలా భయమేసింది..
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో తన మొదటి పరిచయం ఇలా జరిగిందని యువ నటి దక్షీ గుత్తికొండ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్జీవీ డైరెక్షన్‌లో వచ్చిన కరోనా వైరస్ చిత్రంతో అరంగేట్రం చేసిన దక్షీ.. తన దర్శకుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆర్జీవీ గురించి చాలా పుకార్లు విన్నానని.. ముఖ్యంగా ఆయన కెమెరా ముందు ప్రవర్తించే తీరుపై కూడా కామెంట్స్ చెవిన పడ్డాయని దక్షీ తెలిపింది.
మొదటిసారిగా ఈ వ్యాఖ్యలు..
రామ్ గోపాల్ వర్మ గురించి మొదటిసారిగా ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత.. ఆయన సినిమాకు ఆడిషన్ కోసం వెళ్లాలంటే.. ముందుగా కొంచెం భయపడ్డానని ఆమె తెలిపింది. అయితే ఆర్జీవీని దగ్గరగా చూసిన తర్వాత, తన అభిప్రాయం పూర్తిగా మారిందని దక్షీ గుత్తికొండ స్పష్టం చేసింది.
బయట అలా మాట్లాడినా..
ఆర్జీవీ బయట అలా మాట్లాడటం వల్ల ప్రజలు ఆయనను అపార్థం చేసుకుంటున్నారని.. కానీ ఆయన చెప్పే ప్రతీ మాట వాస్తవమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం జనాలు ఆయన చెప్పే కొన్ని వాస్తవాలను అంగీకరించలేకపోవచ్చునని తెలిపింది. అలాగే ఆర్జీవీకి అపారమైన తెలివి ఉందని ప్రశంసించింది.
ఆయనకు అన్ని తెలుసు
ఆర్జీవీకి సినిమాలోని ప్రతి క్రాఫ్ట్‌పై చక్కటి అవగాహన ఉందని దక్షీ గుత్తికొండ తెలిపింది. ఇప్పటికీ ఆయన వద్ద పనిచేసిన చాలామంది మళ్లీ మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లడానికి కారణం ఇదేనని చెప్పింది. కరోనా వైరస్ చిత్రం తర్వాత తాను పలు ప్రాజెక్టులలో నటించానని దక్షీ చెప్పుకొచ్చింది.
కరోనా వైరస్ తర్వాత ఈ ప్రాజెక్టులు..
కరోనా వైరస్ తర్వాత శేఖర్ సూరి ప్రాజెక్ట్, ఆ తర్వాత దూదేకుల పేరుతో ఆహాలో వచ్చిన కొత్తపొరడు టీమ్ చేసిన మరో చిత్రం, ఆపై నితిన్ హీరోగా నటించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ చిత్రాలలో నటించానని చెప్పింది. ప్రస్తుతం తాను మరో రెండు ప్రాజెక్టులలో పనిచేస్తున్నానని తెలిపింది. కొత్త నటీనటులకు లేదా చిన్న ప్రొడక్షన్ బ్యానర్లకు సంబంధించిన సినిమాలు విడుదల కావడానికి ఎక్కువ సమయం పడుతుందని ఆమె తెలిపింది.

