'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Ariyana: బిగ్ బాస్ హౌస్‌లో చింటూ బొమ్మ అంశంపై నటి అరియానా గ్లోరీ కీలక విషయాలు తెలిపింది. అది ప్రొడక్షన్ టీం చేసిన పనేనని తెలిపింది. గేమ్‌లో లీనమైపోయిన తాను డాజ్లర్ గిఫ్ట్ ద్వారా, ఆపై చింటూ బొమ్మతో..

బిగ్ బాస్‌పై కీలక వ్యాఖ్యలు
బిగ్ బాస్ ఇంట్లో అరియానా గ్లోరీ.. చింటూ బొమ్మతో తనకున్న ప్రత్యేక అనుబంధంపై, అలాగే డాజ్లర్ గిఫ్ట్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ బొమ్మను తాను ఉతికి బయట ఆరేసానని.. అయితే బ్లైండ్స్ మూసి ఉన్నప్పుడు ప్రొడక్షన్ బృందం అది తడిగా ఉందని లోపలికి తెచ్చి బాత్రూంలో పెట్టారని ఆమె వివరించింది. తడిగా ఉన్నదానిని బెడ్ రూమ్‌లోకి తీసుకెళ్లలేను కాబట్టి.. అది ఆరేవరకు బాత్రూంలోనే ఉంచాల్సి వచ్చిందని చెప్పింది.
మొదటి ఆరు వారాలు..
బిగ్ బాస్ ఇంట్లో ఉన్న మొదటి ఆరు వారాలు కేవలం ఆటపైనే దృష్టి సారించానని.. బయటి ప్రపంచం, కుటుంబం గురించిన ఆలోచించలేదని తెలిపింది. అయితే దీపావళి సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని చెప్పింది. ఆ సమయంలో ఇంటి సభ్యుల కోసం గిఫ్టులు రాయమని టాస్క్ వచ్చిందని.. ఒక్కరికే రాయాలని రూల్ ఉండటంతో.. అవినాష్, రాజశేఖర్‌లకు గిఫ్టులు రాయలేదని పేర్కొంది.
గిఫ్ట్ ఎవరికి పంపలేదు..
తాను కేవలం ఖాళీ పేపర్లు మాత్రమే పంపించానని తెలిపింది. దీంతో తనకు ఎవరి నుంచి గిఫ్ట్ రాలేదని చెప్పింది. అందరూ కూడా తానేవరికీ గిఫ్ట్ రాయలేదు కాబట్టే.. బహుశా తన గిఫ్ట్ తనే రాసుకుందని అనుకున్నట్టు అరియానా చెప్పింది. ఈ ఘటన వల్ల తాను మరింతగా కృంగిపోయానని స్పష్టం చేసింది.
లిప్‌స్టిక్‌లు వచ్చాయి..
అయితే, బిగ్ బాస్ టీం తరపున తనకు ఒక ప్యాక్ వచ్చిందని, అందులో 'డాజ్లర్' బ్రాండ్ లిప్‌స్టిక్‌లు, తన పేరు మీద ఉన్నాయని ఆమె చెప్పింది. తనకు గిఫ్టులు రాలేదని బిగ్ బాస్ బృందం గుర్తించి, స్వయంగా ఈ గిఫ్టులను పంపించిందని ఆమె భావోద్వేగంగా తెలిపింది. చింటూ అనే బొమ్మను చూడటం వల్ల తన ఇంట్లో ఉన్న చింపాంజీ బొమ్మలు, తన కుటుంబం, తన ఇల్లు గుర్తుకువచ్చాయని అరియానా వివరించింది.
ఆ బొమ్మ నాతోనే ఉంది..
ఆ సమయంలో ఆటలో లీనమై బయటి ప్రపంచాన్ని మర్చిపోయిన తాను, అప్పుడప్పుడు ఇల్లు గుర్తొస్తే బాగుంటుందని బిగ్ బాస్‌ను అడిగి చింటూ బొమ్మను తన దగ్గర ఉంచుకున్నట్లు తెలిపింది. బిగ్ బాస్ బృందం తన భావోద్వేగాన్ని అర్థం చేసుకుని, ఆ బొమ్మను అనుమతించిందని అరియానా తెలిపింది.

