MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • విజయ్ - సంగీత మళ్లీ కలిశారా? దళపతి సీఎం అయితే.. ప్రమాణ స్వీకారానికి కలిసే వస్తారా?

విజయ్ - సంగీత మళ్లీ కలిశారా? దళపతి సీఎం అయితే.. ప్రమాణ స్వీకారానికి కలిసే వస్తారా?

నటుడు విజయ్, ఆయన భార్య సంగీత విడిపోయారంటూ వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. మనస్పర్థలు తొలగిపోయి, ఇద్దరూ మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయ ప్రయాణానికి ఈ విషయం ప్లాస్ అవ్వబోతుందా? నిజమెంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 21 2026, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ వ్యక్తిగత జీవితంపై పుకార్లు
Image Credit : Facebook/ Actor Vijay, X

విజయ్ వ్యక్తిగత జీవితంపై పుకార్లు

తమిళ స్టార్ హీరో, ఇప్పుడు రాజకీయాల్లోనూ కీలక శక్తిగా ఎదుగుతున్న 'దళపతి' విజయ్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది దావానలంలా వ్యాపిస్తుంది. కానీ, గత కొన్నేళ్లుగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం కంటే, ఆయన వ్యక్తిగత జీవితం గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరిగింది. ముఖ్యంగా, భార్య సంగీతతో విభేదాలు, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారన్న వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. కొందరైతే ఆయన పర్సనల్ లైఫ్‌ను కించపరిచేలా కూడా మాట్లాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఊహించని మలుపు.. ఒక్కటైన జంట?
Image Credit : X

ఊహించని మలుపు.. ఒక్కటైన జంట?

ఇటీవల వచ్చిన వార్తలు విజయ్ అభిమానులకే కాకుండా, యావత్ తమిళనాడుకు సంతోషాన్నిచ్చాయి. గత కొన్ని నెలలుగా ఉన్న చిన్నపాటి మనస్పర్థలు తొలగిపోయి, విజయ్, సంగీత మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పిల్లల భవిష్యత్తు, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ కారణంగానే వారు ఈ  నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

35
సీఎం ప్రమాణ స్వీకారానికి సంగీత?
Image Credit : our own

సీఎం ప్రమాణ స్వీకారానికి సంగీత?

ఈ సంతోషకరమైన వార్తకు కొనసాగింపుగా, మరో పెద్ద విషయం బయటకు వచ్చింది. విజయ్ తన రాజకీయ ప్రయాణంలో తదుపరి లక్ష్యంగా భావిస్తున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంగీతతో కలిసి హాజరు కావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా ఇది సాధ్యమేనని అంటున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఆయన రాజకీయ ఇమేజ్‌కు కూడా పెద్ద బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 అంతకంటే ముందే ఇద్దరూ కలిసి ఓటు వేయడానికి వెళ్తే అది విజయ్‌కు మరింత ప్లస్ అవుతుందని కూడా వారు చెబుతున్నారు. కుటుంబ పెద్దగా తనను తాను నిలబెట్టుకోవడం, ప్రజల మనసుల్లో ప్రజా నాయకుడిగా మరింత బలంగా ముద్ర వేస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

45
అభిమానుల సంబరాలు...
Image Credit : our own

అభిమానుల సంబరాలు...

ఈ వార్త తెలియగానే, విజయ్ నివాసం ఉండే నీలాంగరై ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. అభిమానులు బాణాసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఈ వార్తను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.  చాలా రోజుల తర్వాత విజయ్ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మళ్లీ కలుస్తుండటంతో, ఆ ప్రాంతానికే కొత్త కళ వచ్చింది.

55
ఒక్కటైన కుటుంబం.. అభిమానులు ఫుల్ ఖుషీ!
Image Credit : our own

ఒక్కటైన కుటుంబం.. అభిమానులు ఫుల్ ఖుషీ!

వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎవరికైనా సహజం. కానీ, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అలాంటి సవాళ్లను అధిగమించి మళ్లీ కలవడం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుంది. విజయ్ రాజకీయ ప్రయాణం ఊపందుకున్న ఈ తరుణంలో, సంగీత రాక ఆయనకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈమర్పు తమిళనాడు రాజకీయాల్లోనూ ఓ కొత్త తరంగాన్ని సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజా నిజాలు తెలియాల్సి ఉంది? 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
అల్లు అర్జున్ హైదరాబాద్ కు బైబై చెప్పబోతున్నాడా? బన్ని ఫ్యామిలీతో ఎక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నాడు? నిజమెంత?
Recommended image2
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు షాక్ తో పాటు సర్ప్రైజ్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి భారీ అప్ డేట్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved