- Home
- Entertainment
- ఇక నీ శవమే బయటకి వస్తుంది అన్నారు, ఆయన లేకుంటే నా పరిస్థితి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
ఇక నీ శవమే బయటకి వస్తుంది అన్నారు, ఆయన లేకుంటే నా పరిస్థితి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటుడు సుమన్ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటనని ఎవరూ మరచిపోలేరు. సుమన్ కెరీర్ ని ఎఫెక్ట్ చేసిన కేసు అది. ఒక కాంట్రవర్సీలో సుమన్ జైలు పాలయ్యారు.

Suman
సీనియర్ నటుడు సుమన్ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటనని ఎవరూ మరచిపోలేరు. సుమన్ కెరీర్ ని ఎఫెక్ట్ చేసిన కేసు అది. ఒక కాంట్రవర్సీలో సుమన్ జైలు పాలయ్యారు. ఆ టైంలో సుమన్ పై అనేక ఆరోపణలు వినిపించాయి. సుమన్ వివాదంలో చిక్కుకోవటానికి కారణం చిరంజీవి అనే పుకార్లు కూడా వినిపించాయి. కానీ అది అవాస్తవం.
suman
అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్, తమిళనాడు డీజీపీ పన్నిన వ్యూహంలో సుమన్ చిక్కుకుపోయాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. అప్పటి తమిళనాడు డీజీపీ కుమార్తె సుమన్ ని ఇష్టపడేదట. దీనితో సుమన్ ని ఇరికించారు. సుమన్ ని అరెస్ట్ చేసి అనేక ఆరోపణలో కేసులు పెట్టారు. తనని సాధారణ సెల్ లో కాకుండా తీవ్రమైన నేరాలు చేసే క్రిమినల్స్ ని ఉంచే చీకటి సెల్ లో ఉంచినట్లు సుమన్ స్వయంగా తెలిపారు.
Suman
అక్కడున్న వాళ్ళు అన్నది నేను విన్నాను. ఇక సుమన్ పని అయిపోయింది. అతడు బయటకి వెళ్ళేది శవంగానే అని మాట్లాడుకోవడం విన్నాను. కానీ నన్ను ఆ వివాదం నుంచి బయట పడేయడానికి ఎవరూ రాలేదు. ఒకే ఒక్క వ్యక్తి వచ్చారు. ఆయన తమిళనాడు రాజకీయాల్లో దిగ్గజం, మాజీ సీఎం కరుణానిధి. ఆయన రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో నాకే తెలియదు.
Suman
ఆయన స్వయంగా జైలుకి వచ్చి సుమన్ ని క్లోజ్డ్ సెల్ లో ఎందుకు ఉంచారు. అతడు అంత పెద్ద నేరం ఏం చేశాడు ? అతడిపై ఉన్న ఆరోపణలు కూడా ఇంకా రుజువు కాలేదు. సుమన్ ని వెంటనే నార్మల్ సెల్ కి మార్చండి. లేకుంటే నేను పెద్ద గొడవ చేస్తా అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కరుణానిధి చెప్పడంతో నన్ను నార్మల్ సెల్ కి మార్చారని సుమన్ పేర్కొన్నారు.
karunanidhi
ఆ సంఘటనలో సుమన్ కొన్ని నెలలపాటు జైల్లోనే ఉన్నారు. ఆ టైంలో సుమన్ హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నారు. కానీ అరెస్ట్ అయి జైల్లో ఉండడం వల్ల మొత్తం మారిపోయింది. చాలా సినిమాలు సుమన్ నుంచి చేజారాయి. దీనితో సుమన్ కెరీర్ లో బాగా వెనుకబడిపోయారు. ఆ సంఘటన జరగకుండా ఉంటే సుమన్ టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరు అయ్యేవారని చాలా మంది భావిస్తుంటారు. అందగాడిగా, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన హీరోగా సుమన్ కి మంచి గుర్తింపు ఉండేది.