వెంకటేష్ కి క్లాస్ పీకిన రజనీకాంత్, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంఘటన
విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లు రాబట్టింది.

Venkatesh, Rajinikanth
విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లు రాబట్టింది. వెంకీ కెరీర్ లోనే కాదు తెలుగు రీజినల్ చిత్రాల్లో కూడా సంక్రాంతికి వస్తున్నాం అతిపెద్ద విజయంగా నిలిచింది. దీంతో వెంకటేష్ ఆ అంచనాలని మ్యాచ్ చేసేందుకు తను నెక్స్ట్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
వెంకటేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ సూపర్ స్టార్ రజనీకాంత్ తో తనకున్న అనుబంధాన్ని వివరించారు. రజనీకాంత్ మా నాన్న రామానాయుడు గారి నిర్మాణంలో నటించారు. రజనీకాంత్ లాగే నాకు కూడా ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ అని వెంకీ తెలిపారు.
నేను సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు రజనీకాంత్ నాకు కొన్ని సూచనలు చేశారు. అవి నా కెరీర్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సినిమాల్లో నటిస్తున్నప్పుడు పబ్లిసిటీ కంటే మన పని కరెక్ట్ గా చేయడం మీదే దృష్టి పెట్టాలి. రిలీజ్ టైం లో బ్యానర్లు కట్టారా? ముఖం కనిపించేలా ఫోటోలు వేశారా? మ్యాగజైన్ కవర్ పేజీలో మన ఫోటో వచ్చిందా? ఇలాంటివి అసలు పట్టించుకోవద్దు.. నీ పని నువ్వు కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళు అని రజనీకాంత్ తనకి చిన్నపాటి క్లాస్ పీకారట.
రజని చెప్పిన విషయాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని వెంకటేష్ తెలిపారు. అప్పటినుంచి తాను వర్క్ పైనే ఫోకస్ చేస్తానని మిగిలిన విషయాలు పట్టించుకోనని తెలిపారు. చిన్నప్పటి నుంచి తనకి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ అని వెంకటేష్ అన్నారు. అరుణాచలం అంటే బాగా ఇష్టం.
విధిని నమ్ముతాను. ఘర్షణ షూటింగ్ సమయంలో నేను ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దేవుడి దయవల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు వెంకీ తెలిపారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘర్షణ చిత్రంలోని పాటలు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.