MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. చిరంజీవి నన్ను పిలిచి ఇలా అన్నాడు'

'సినిమాలు వదిలేద్దామనుకున్నా.. చిరంజీవి నన్ను పిలిచి ఇలా అన్నాడు'

Srikanth: నటుడు శ్రీకాంత్ తన కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్ల గురించి, అలాగే తన కెరీర్‌పై చిరంజీవి ప్రభావం గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నన్ను.. చిరంజీవి పిలిచి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీలో తెలుసుకుందామా.. 

1 Min read
Author : Pavithra D
Published : Jan 18 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు..
Image Credit : Actor Srikanth\Twitter

చిరంజీవిపై కీలక వ్యాఖ్యలు..

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ తన సినీ కెరీర్‌లో ఎదుర్కున్న సవాళ్లు, చిరంజీవి ప్రభావం గురించి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవిని తొలిసారిగా తన తండ్రి ద్వారా కలిసినప్పుడు, చిరంజీవి తనను ఒక తమ్ముడిలా చూసుకున్నారని శ్రీకాంత్ గుర్తుచేసుకున్నాడు. తమ మధ్య ర్యాపో అప్పటినుంచి పెరుగుతూ వచ్చిందన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వరుసగా ఏడెనిమిది ఫ్లాప్‌లు..
Image Credit : https://www.facebook.com/ActorSrikanthMeka

వరుసగా ఏడెనిమిది ఫ్లాప్‌లు..

శ్రీకాంత్ కెరీర్‌లో ఒకానొక సమయంలో వరుసగా ఏడెనిమిది సినిమాలు ఫ్లాప్‌లు, యావరేజ్‌లు పడ్డాయి. అప్పటివరకు సక్సెస్‌లను మాత్రమే చూసిన తాను, హఠాత్తుగా ఎదురైన ఈ డౌన్‌ఫాల్‌తో మానసికంగా కృంగిపోయానని, ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని కూడా ఆలోచించానని శ్రీకాంత్ చెప్పాడు. మూడు నెలల పాటు చిరంజీవిని కలవడం మానేశాను. అప్పుడు చిరంజీవి.. శ్రీకాంత్‌కు కబురు పంపి, అన్నపూర్ణ స్టూడియోస్‌కు రప్పించారట.

35
గంటపాటు మాట్లాడమని చెప్పి..
Image Credit : zee telugu

గంటపాటు మాట్లాడమని చెప్పి..

అక్కడ చిరంజీవి.. శ్రీకాంత్‌ను గంటపాటు మాట్లాడమని చెప్పి, తన సమస్య ఏమిటో తెలుసుకున్నారు. ఆ రోజు చిరంజీవి ఇచ్చిన మెసేజ్ శ్రీకాంత్ జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసిందట. సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి జీవితంలో సహజమని, వాటిని ఒకే విధంగా స్వీకరించాలని చిరంజీవి బోధించారట.

45
పొంగిపోకూడదు.. కృంగిపోకూడదు..
Image Credit : https://www.facebook.com/ActorSrikanthMeka

పొంగిపోకూడదు.. కృంగిపోకూడదు..

ఒక విజయం వస్తే పొంగిపోకుండా, అపజయం వస్తే కృంగిపోకుండా ఉండాలని ఆయన సలహా ఇచ్చారట. జీవితం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, ఎత్తుపల్లాలు ఉంటాయని, వాటిని అలవాటు చేసుకోవాలని చిరంజీవి వివరించారట. ఈ మాటలు కేవలం సినిమా కెరీర్‌కు మాత్రమే కాకుండా, సాధారణ జీవితానికి కూడా వర్తించే అమూల్యమైన పాఠమని శ్రీకాంత్ అన్నాడు.

55
డిప్రెషన్, నిరాశ పోయాయి..
Image Credit : zee telugu

డిప్రెషన్, నిరాశ పోయాయి..

ఆ రోజు నుంచి తనలో డిప్రెషన్, నిరాశ లాంటివి పోయాయని, జీవితాన్ని హ్యాపీగా గడపడమే తన లక్ష్యమని శ్రీకాంత్ తెలిపాడు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ గురించి ప్రస్తావిస్తూ జీవితంలో సంతృప్తి పొందడం ముఖ్యమని పేర్కొన్నాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mohan babu: ఆ పనిచేస్తే నేను రోడ్డుపై అడుక్కుతినే వాడిని.. మోహన్‌ బాబు చెప్పిన జీవిత సత్యం
Recommended image2
Subbaraju: అమితాబ్ బచ్చన్‌ ముఖంపై సిగరెట్ పొగ ఊదమన్న డైరెక్టర్, భయంతో వణికిపోయిన సుబ్బరాజు ఏం చేశాడో తెలుసా?
Recommended image3
Aadarsha Kutumbam: ఆదర్శకుటుంబం స్టోరీ ఇదేనా, చాలా కాంప్లికేటెడ్ గా ఉందే.. వెంకీ మామ, త్రివిక్రమ్ పైనే భారం
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved