- Home
- Entertainment
- చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవితో ఎంతో అనుబంధం కలిగిన నటుడితో ఓ స్టార్ హీరోయిన్ లవ్ ఎఫైర్ పెట్టుకున్నారు. కానీ చివరికి ఆమె పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయారు. ఆ నటుడు, ఆ హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవితో మంచి అనుబంధం
చిరంజీవికి ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. చిరంజీవితో మంచి అనుబంధం కలిగిన తమిళ నటుల్లో శరత్ కుమార్ పేరు ప్రధానంగా చెప్పాలి. శరత్ కుమార్, చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉంది. తాను సమస్యల్లో ఉన్నప్పుడు చిరంజీవి ఆదుకున్నారని శరత్ కుమార్ పలు సందర్భాల్లో తెలిపారు. గ్యాంగ్ లీడర్ చిత్రంలో శరత్ కుమార్, చిరంజీవి కలిసి నటించారు.
సీనియర్ డైరెక్టర్ కామెంట్స్
శరత్ కుమార్ సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు ఎదుర్కొన్నారు. శరత్ కుమార్ నటుడిగా రాణిస్తున్న 90వ దశకంలో ఒక స్టార్ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్నారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు 90 వ దశకంలో స్టార్ గా వెలుగు వెలిగిన నగ్మా. ఆమెతో శరత్ కుమార్ ఘాడమైన ప్రేమలో మునిగిపోయారు. దీని గురించి నందం హరిశ్చంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడారు.
నగ్మాతో శరత్ కుమార్ ఎఫైర్
శరత్ కుమార్ కి 1984లోనే ఛాయాతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. వారిలో ఒకరు వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం నటిగా రాణిస్తున్నారు. శరత్ కుమార్, నగ్మాతో ప్రేమలో పడడంతో ఆయన వ్యక్తిగత జీవితంలో సమస్యలు వచ్చాయి అని నందం హరిశ్చంద్ర రావు అన్నారు. శరత్ కుమార్ కి ఛాయా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా శరత్ కుమార్.. నగ్మాని దూరం పెట్టలేదు. దీనితో ఆమె భరించలేక శరత్ కుమార్ నుంచి విడిపోవాలని డిసైడ్ అయ్యారు.
భార్యతో శరత్ కుమార్ విడాకులు
ఆ విధంగా వీరిద్దరూ 2000 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. తనకు భర్త అవసరం లేదని, పిల్లలు చాలని ఛాయా నిర్ణయించుకున్నారు. తన వల్ల శరత్ కుమార్ ఫ్యామిలిలో సమస్యలు వచ్చాయని నగ్మా కూడా అతడికి దూరం జరిగారు. ఆ తర్వాత శరత్ కుమార్, రాధికాతో కొన్ని సినిమాల్లో నటించారు. అప్పటికి ఆమె కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకుని ఉన్నారు.
రాధికతో వివాహం
శరత్ కుమార్ కి రాధికా ఓ సినిమా విషయంలో సాయం కూడా చేశారట. ఆ విధంగా శరత్ కుమార్, రాధిక మధ్య అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కానీ నగ్మా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. 50 ఏళ్ళ వయసొచ్చినా కూడా నగ్మా వివాహం చేసుకోలేదు.

