- Home
- Entertainment
- విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే సమీపిస్తున్న తరుణంలో ఓటింగ్ హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజేతని డిసైడ్ చేసే ఫైనల్ వీక్ ఓటింగ్ లో ఎవరు ముందంజలో ఉన్నారు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

బిగ్ బాస్ తెలుగు 9 ఫైనల్ ఓటింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 సభ్యులు తనూజ, కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. వీరిలో ఎవరు విజేత అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగిపోతోంది. ప్రేక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్ కోసం ఓటింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నామినేషన్స్ కోసం సాగిన ఓటింగ్ ఒక లెక్క అయితే విజేతని డిసైడ్ చేసే ఈ ఓటింగ్ మరో లెక్క.
ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్
దీనితో ఓటింగ్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. నామినేషన్స్ లో ఉన్న ప్రతి సారీ తనూజ వన్ సైడెడ్ గా అత్యధిక ఓట్లు పొంది సేఫ్ అవుతూ వచ్చింది. కానీ విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ మాత్రం వన్ సైడెడ్ గా జరగడం లేదని సమాచారం. గ్రాండ్ ఫినాలే వీక్ ఓటింగ్ లో అనూహ్యంగా కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
కళ్యాణ్, తనూజ మధ్య నెక్ టు నెక్ ఫైట్ కానీ..
తనూజ, కళ్యాణ్ ఇద్దరి మధ్య నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పటికీ కళ్యాణ్ దే పైచేయి అని అంటున్నారు. తనూజ కాస్త వెనుకబడింది అట. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనూజ టీం ప్రమోషన్స్ తో హోరెత్తిస్తున్నారు. తనూజ అభిమానులు, ఆమె టీమ్ చేస్తున్న ప్రమోషన్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. తెలుగు బిగ్ బోస్ చరిత్రలో తొలి మహిళా విజేతగా నిలవబోతున్న తనూజకి ఓట్ వేయండి అంటూ క్యాంపైన్ చేస్తున్నారు. మన క్వీన్ తనూజకి ఓట్ వేయండి అని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు.
వీళ్లిద్దరి వల్ల దెబ్బైపోయిన ఇమ్ము
కళ్యాణ్ పడాలకి సంబంధించిన క్యాంపైన్ అంతగా కనిపించడం లేదు కానీ అతడి అభిమానులు మాత్రం పోస్ట్ చేస్తున్నారు. వీళ్లిద్దరి హంగామాలో పాపం ఇమ్మాన్యుయేల్ దెబ్బై పోయాడు. అసలు బిగ్ బాస్ తెలుగు 9 షోకి ముందు నుంచి అట్రాక్షన్ గా ఉన్న సెలెబ్రిటీ ఇమ్మునే. తనదైన శైలిలో నవ్వులు పండిస్తూ, టాస్క్ లలో బలంగా పోరాడుతూ సత్తా చాటాడు.
సైలెంట్ గా సైడ్ చేసేశారు
దీనితో తొలి 8 వారాల్లో ఇమ్మాన్యుయేల్ విజేత అవుతాడు అంటూ అంచనాలు వినిపించాయి. ఆ తర్వాత నుంచి తనూజ, కళ్యాణ్ పడాల రేసులోకి వచ్చారు. ఇమ్మని సైలెంట్ గా సైడ్ చేసేశారు. ఇప్పుడు ఇమ్ము వీరిద్దరితో పోల్చుకుంటే ఫైనల్ వీక్ ఓటింగ్ లో బాగా వెనుకబడిపోయినట్లు తెలుస్తోంది. తనూజ, కళ్యాణ్ లకు పడుతున్న ఓట్లు.. ఇమ్ముకి పడుతున్న ఓట్లలో వ్యత్యాసం చాలా మార్జిన్ ఉందట. కానీ సంజన, పవన్ కంటే ఇమ్ము బెటర్ గా ఉన్నాడు.

