తిరుగుబాటు మొదలవుతుంది..చంద్రబాబు అరెస్ట్ పై సీనియర్ నటుడు నరేష్ హాట్ కామెంట్స్..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు మాత్రం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించేందుకు ఆచితూచి మాట్లాడుతున్నారు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. దీనితో తెలుగుదేశం పార్టీ నేతలు, మద్దతు దారులు అడుగడుగునా ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చిత్ర పరిశ్రమకి చెందిన వారికి కూడా చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అయితే చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు మాత్రం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించేందుకు ఆచితూచి మాట్లాడుతున్నారు. రాఘవేంద్ర రావు, కేఎస్ రామారావు లాంటి వారు మాత్రం బహిరంగంగానే బాబుకి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ చంద్రబాబు అరెస్ట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు స్కిల్ డెవెలెప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనకి బెయిల్ కోసం లాయర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి కూడా కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Chandrababu Naidu
అయితే మార్టిన్ లూథర్ కింగ్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సీనియర్ నటుడు నరేష్ కి చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా.. ఈ విషయంలో నేను ఏ ఒక్క నాయకుడి గురించో మాట్లాడను. కానీ ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది.
వ్యక్తిగత కక్షలు, దూషణలు కారణంగా ఎవరినైనా అణచివేయడానికి బంధించినప్పుడు ప్రజాస్వామ్యంలో తిరుగుబాటు మొదలవుతుంది. ఎమెర్జన్సీ సమయంలో చాలా మంది నాయకులు జైల్లో మగ్గారు. కానీ ఎమెర్జెన్సీ అనేది దేశ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయింది.
ప్రస్తుతం రాజకీయాలకు, డబ్బుకి చిక్కుముడులు పడ్డాయి. దీనిపై నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోరాటం చేస్తుండడం గర్వంగా ఉంది అని నరేష్ అన్నారు. ఇక చిత్ర పరిశ్రమ మొత్తం చంద్రబాబు అరెస్ట్ పై ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించగా.. రాజకీయ పరమైన అంశాల్లోకి నేను లోతుగా వెళ్ళను అని నరేష్ అన్నారు.