- Home
- Entertainment
- Actor Naresh: తరుణ్, ఎన్టీఆర్ వచ్చాక అనుమానం మొదలైంది.. కృష్ణ, విజయ నిర్మల ఆ ఖర్చు భరించారు
Actor Naresh: తరుణ్, ఎన్టీఆర్ వచ్చాక అనుమానం మొదలైంది.. కృష్ణ, విజయ నిర్మల ఆ ఖర్చు భరించారు
సీనియర్ నటుడు నరేష్ ఓ ఇంటర్వ్యూలో సినిమాలు, రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో పూర్తిగా రాజకీయాల వైపు వెళుతున్న తాను తిరిగి మళ్ళీ సినిమాల్లో ఎలా బిజీ అయ్యాను అనేది వివరించారు.

Naresh
ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నుంచి వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది నరేష్ నుంచి హే బలవంత్, శ్రీనివాస మంగాపురం, సతీ లీలావతి లాంటి చిత్రాలు వచ్చాయి. నరేష్ ఒకప్పుడు హీరోగా సక్సెస్ ఫుల్ చిత్రాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్నారు.
ఎన్టీఆర్, తరుణ్ హవా
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాలనే ఆలోచన తనకు అనేక సంఘటనల వల్ల వచ్చింది అని నరేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 2000 సంవత్సరంలో నేను హీరోగా నటించిన చంద్రవంశం అనే సినిమా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, తరుణ్ లాంటి హీరోలు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి హవా ప్రారంభించారు. ఇంకా నేను హీరోగా నటించడం అవసరమా అని అనుకున్నాను.
ఎన్నికల ఖర్చు వాళ్లదే
రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండడంతో పాలిటిక్స్ లోకి వెళ్ళాను. బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయాను. సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తుంటే కృష్ణ, విజయ నిర్మల గారు ముందుగా తిట్టారు. కానీ ఆ తర్వాత నా ఆసక్తిని గమనించి వాళ్లే పాలిటిక్స్ లో నాకు సపోర్ట్ చేశారు. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు నా ఎలక్షన్ ఖర్చు భరించింది కృష్ణ , విజయ నిర్మల గారే. వాళ్లిద్దరూ 60 శాతం ఖర్చు భరించారు.
ఓటమి తర్వాతే నిర్ణయం
ఎన్నికల్లో పోటీ చేయకముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీ శ్రేయోభిలాషి అనే మూవీ చేశా. అది నాకు చాలా బాగా నచ్చింది. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగాలి, నా జీవితం సినిమా మాత్రమే అని ఎన్నికల్లో ఓడిపోయాక నిర్ణయించుకున్నట్లు నరేష్ తెలిపారు.
వైఎస్ఆర్ ని కలిశా
ఎన్నికల్లో ఓడిపోయాక కృష్ణ గారు నన్ను రాజశేఖర్ రెడ్డి దగ్గరకు పంపారు. అప్పుడు ఆయన సీఎం. ఏవయ్యా మీ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ లో ఉంటే నువ్వు బీజేపీలో ఉన్నవేంటి అని సరదాగా అడిగారు. ఈ సారి కూడా నువ్వు పోటీ చెయ్, నేను టికెట్ ఇస్తా అని అన్నారు. కానీ అంతలోనే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. నేను పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాను అని నరేష్ తెలిపారు.





