- Home
- Entertainment
- Brahmanandam: బ్రహ్మానందంకి తగిలిన శాపం, ఆ దర్శకుడి వల్లే.. ఉన్న డైలాగ్ కూడా లేపేశారు
Brahmanandam: బ్రహ్మానందంకి తగిలిన శాపం, ఆ దర్శకుడి వల్లే.. ఉన్న డైలాగ్ కూడా లేపేశారు
బ్రహ్మానందంకి ఓ దర్శకుడు ఇచ్చిన శాపం నిజం అయింది. ఆ దర్శకుడు బ్రహ్మానందంకి బాగా క్లోజ్. అయినప్పటికీ శపించారు. అసలేం జరిగింది ? ఆ దర్శకుడు ఇచ్చిన శాపం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

Brahmanandam
నటుడు బ్రహ్మానందం టాలీవుడ్ లో హాస్య బ్రహ్మగా, కామెడీ కింగ్ గా గుర్తింపు పొందారు. 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిల్ వరల్డ్ రికార్డ్ అందుకున్నారు. బ్రహ్మానందం కామెడీ వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. హాస్యం పండించడంలో బ్రహ్మానందం తనకు తానే సాటిగా నిలిచారు. బ్రహ్మానందం గురించి దర్శకుడు శివ నాగేశ్వర రావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రావుగారి ఇల్లు మూవీలో..
బ్రహ్మానందంకి మొదట మంచి పేరు తీసుకువచ్చిన చిత్రం అహ నా పెళ్ళంట. ఈ మూవీలో కోట, బ్రహ్మానందం కాంబినేషన్ చాలా బావుంటుంది. ఆ సినిమాలో బ్రహ్మానందంని చూసి దర్శక నిర్మాతలు దాదాపుగా ఒకేసారి 10 సినిమాలకు బుక్ చేసుకున్నారు. అందులో నాగార్జున, ఏఎన్నార్ నటించిన రావుగారి ఇల్లు మూవీ కూడా ఒకటి. ఆ చిత్రానికి తాను కో డైరెక్టర్ గా పనిచేసినట్లు శివనాగేశ్వర రావు తెలిపారు.
నూతన్ ప్రసాద్ కి అసిస్టెంట్ గా..
ఆ మూవీలో నూతన్ ప్రసాద్ కూడా నటించారు. ఆయనకి అసిస్టెంట్ గా ఉండే పాత్ర కోసం బ్రహ్మానందంని తీసుకున్నాం. బ్రహ్మానందంకి ఈ సినిమాలో డైలాగులు ఎక్కువగా లేవు. ఓ సన్నివేశంలో నూతన్ ప్రసాద్ డైలాగ్ చెబుతూ.. మంచైనా చెడైనా మన చేతికి మట్టంటుకోకూడదు.. ఇది ఎవరు చెప్పార్రా' అని బ్రహ్మానందం ని అడిగాలి. అప్పుడు బ్రహ్మానందం అడవిరాముడు సినిమాలో నాగభూషణం చెప్పారండి అని అనాలి. అయితే వెళ్లి వాడిని వేసేయండి అని నూతన్ ప్రసాద్ అంటారు. ఇది వాస్తవానికి ఉన్న సన్నివేశం. అలా నేను వారిద్దరి చేత ప్రాక్టీస్ చేయించాను. కానీ సీన్ షూటింగ్ వచ్చే సమయానికి పరిస్థితి మారిపోయింది.
బ్రహ్మీకి ఒక్క డైలాగ్ కూడా లేదు
నూతన్ ప్రసాద్ మంచి పేరున్న నటుడు, లెజెండ్. ఇలా నేనొక డైలాగ్ చెప్పడం.. బ్రహ్మానందం మరో డైలాగ్ చెప్పడం వల్ల ల్యాగ్ ఎక్కువ అవుతోంది. కాబట్టి నేను ఇలా చెబుతాను. అడవిరాముడు సినిమాలో నాగభూషణం చెప్పినట్లు మంచైనా చెడైనా మన చేతికి మట్టి అంటుకోకూడదు రా.. కాబట్టి వెళ్లి వాడిని వేసేయండి అని డైలాగ్ చెప్పారు. నూతన్ ప్రసాద్ చెప్పడంతో డైరెక్టర్ కూడా కాదనలేకపోయాను. దీనితో బ్రహ్మానందంకి ఉన్న ఒక్క డైలాగ్ కూడా లేకుండా పోయింది.
బ్రహ్మానందంకి తగిలిన శాపం
దీనితో బ్రహ్మి ఫీల్ అయ్యాడు. ఆ సినిమా నుంచి బ్రహ్మికి నాకు పరిచయం బాగా పెరిగింది. నన్ను అతడు శివయ్య అని అతడిని నేను బ్రహ్మయ్య అని పిలుచుకునేవాళ్ళం. ఒకరోజు నేను బ్రహ్మితో ఇలా అన్నాను. బ్రహ్మి నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఏదో ఒకరోజు కాకి అవుతావు అని చెప్పా. నన్ను ఎందుకు శపించావు.. అసలు నేను కాకిని ఎందుకు కావాలి అని బ్రహ్మి అన్నారు. అప్పుడు నేను నువ్వు ఏదో ఒకరోజు 'కామెడీ కింగ్' అవుతావు. కాకి కావడం అంటే అదే అని చెప్పా. నేను కామెడీ కింగ్ ని అవుతానా.. ఇది జరుగుతుందా అని అడిగారు. తప్పకుండా జరుగుతుంది అని చెప్పా. నేను దర్శకుడిని అయ్యాక మనీ సినిమాలో బ్రహ్మానందంని తీసుకున్నా. ఆ సినిమాకే బ్రహ్మికి తొలిసారి బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు వచ్చింది. నేను బ్రహ్మికి ఇచ్చిన శాపం నా సినిమాతోనే నిజం అయింది అని శివ నాగేశ్వర రావు గుర్తు చేసుకున్నారు.





