జంతువులను వేటాడుతున్నారా?మరో వివాదంలో మోహన్ బాబు కుటుంబం!
మోహన్ బాబు కుటుంబం మరో సమస్యలో చిక్కుకుంది. వన్యప్రాణుల రక్షణ చట్టం క్రింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్న మోహన్ బాబు సిబ్బంది వీడియో వైరల్ అవుతుంది.
Mohan Babu
వరుస వివాదాలతో మోహన్ బాబు కుటుంబం వార్తల్లో నిలుస్తుంది. మొన్నటి వరకు సొంత కొడుకు మనోజ్ తో అమీ తుమీకి దిగారు మోహన్ బాబు. శత్రువుల మాదిరి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫిర్యాదులు చేసుకున్నారు. మోహన్ బాబు లైసెన్డ్ గన్స్ తీసుకుని తిరిగాడు.తండ్రి మోహన్ బాబుతో పాటు విష్ణుపై మనోజ్ ఆరోపణలు చేశారు. వారిద్దరూ నిర్వహిస్తున్న శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థల్లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మనోజ్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా మంచు మోహన్ బాబు, విష్ణు వద్ద పనిచేస్తున్న సిబ్బంది వన్యప్రాణులను వేటాడుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. మోహన్ బాబుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో గల జుల్పల్లిలో ఫార్మ్ హౌస్ ఉంది. మోహన్ బాబు అక్కడే నివాసం ఉంటున్నారని సమాచారం. జుల్పల్లి ఫార్మ్ హౌస్ కి అనుకుని అడవి ఉంది. ఆ అడవిలో సంచరించే పందులను వేటాడుతున్నారట.
Manchu Vishnu
ఒక అడవి పందిని చంపి మోహన్ బాబు సిబ్బంది కర్రకు కట్టి తరలిస్తున్నారు. వారిలో మేనేజర్ కిరణ్ తో పాటు ఎలక్ట్రిషియన్ దుర్గా ప్రసాద్ ఉన్నారట. ముగ్గురు వ్యక్తులు అడవి పందిని తరలిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. దీనిపై జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణులకు హానీ చేస్తున్న వారిని ఉపేక్షించకండి, వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.
Manchu Vishnu
చాలా కాలంగా మోహన్ బాబు జుల్పల్లి సిబ్బంది సమీపంలో గల అడవి జంతువులను వేటాడుతున్నారని సమాచారం. మనోజ్ వేటకు పాల్పడుతున్న మోహన్ బాబు సిబ్బందిని హెచ్చరించాడట. అయినప్పటికీ వారి తీరులో మార్పు రేలదని మనోజ్ ఆరోపించడం విశేషం. దేశంలో వన్యప్రాణి రక్షణ చట్టాలు కఠినంగా ఉన్నాయి. అడవి జంతువులను వేటాడితే శిక్ష తప్పదు. సల్మాన్ వంటి బడా హీరోనే కృష్ణ జింకలను వేటాడిన కేసులో జైలుపాలయ్యాడు.
ఆ చెత్త చరిత్ర అంతా చెరిపేయాలని ఫిక్స్ అయిన మోహన్ బాబు, అనుకూలంగా తీర్పు
వన్యప్రాణుల వేటతో మోహన్ బాబు కుటుంబ సభ్యులకు సంబంధం ఉంటే సమస్యలు తప్పవు. మీడియా ప్రతినిధి పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు అరెస్ట్ కానున్నాడని ప్రచారం జరుగుతుంది. మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ కూడా కోర్ట్ నిరాకరించింది. ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.