ఆ చెత్త చరిత్ర అంతా చెరిపేయాలని ఫిక్స్ అయిన మోహన్ బాబు, అనుకూలంగా తీర్పు
ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో సంక్షోభం చేసుకుంది.మోహన్ బాబు మీద కొడుకు మనోజ్ ఆరోపణలు చేశాడు. భౌతిక దాడులు చోటు చేసుకున్నాయి. కేసులు పెట్టుకున్నారు.
మోహన్ బాబు కుటుంబ గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు మీద మంచు మనోజ్ యుద్ధం ప్రకటించాడు. తండ్రి స్వయంగా తనపై దాడి చేయించాడని మనోజ్ ఆరోపించారు. గాయాలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చిన మనోజ్.. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు.
మోహన్ బాబుకు చెందిన జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద దాదాపు మూడు రోజులు హైడ్రామా నెలకొంది. మనోజ్-మోహన్ బాబు భౌతిక దాడులకు సిద్ధమయ్యారు. ఇరు వర్గాలు బౌనర్స్ ని దించారు. ఎప్పుడేం జరుగుతుందో అనే యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు లైసెన్స్డ్ గన్ తీసుకుని తిరిగారు. మనోజ్ ని ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడంతో గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు.
మోహన్ బాబు మనుషుల వలన తన కుటుంబానికి ప్రమాదం ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మనోజ్ ఫిర్యాదు చేశాడు. మోహన్ బాబు సైతం రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. మనోజ్, మౌనికల నుండి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మంచు ఫ్యామిలీ వివాదాలు ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. దాంతో ఇరు వర్గాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశాడు.
Mohan Babu
మోహన్ బాబు,విష్ణు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీవిద్యా నికేతన్ లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటూ మనోజ్ విమర్శలు గుప్పించారు. మనోజ్ ఆరోపణలకు ప్రతిగా మోహన్ బాబు వాయిస్ సందేశాలు రిలీజ్ చేశాడు. తాగుడు బానిసైన మనోజ్ తప్పుల మీద తప్పులు చేస్తున్నాడని సదరు ఆడియో రికార్డ్స్ లో మోహన్ బాబు వెల్లడించాడు.
Mohan Babu
కాగా మోహన్ బాబు-మనోజ్ వివాదానికి సంబంధించిన వీడియోలు, తన వాయిస్ సందేశాలు గూగుల్, సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుండి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు. మోహన్ బాబు పిటిషన్ పై సానుకూలంగా స్పందించిన కోర్టు .. సదరు కంటెంట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
Mohan Babu, Manoj and Vishnu
భవిష్యత్ లో తమ ఫ్యామిలీ వివాదానికి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్ లో లేకుండా మోహన్ బాబు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారనిపిస్తుంది. మరోవైపు రిపోర్టర్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతుంది.