MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • కారు ప్రమాదానికి గురైన 'యాత్ర 2' హీరో జీవా.. ఫ్యామిలీతో వస్తుండగా ఘటన

కారు ప్రమాదానికి గురైన 'యాత్ర 2' హీరో జీవా.. ఫ్యామిలీతో వస్తుండగా ఘటన

నటుడు జీవా తన కుటుంబ సభ్యులతో కలిసి సేలం నుండి చెన్నైకి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురయ్యారు. కల్లకురిచ్చి సమీపంలో జరిగిన కారు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Sep 11 2024, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటుడు జీవా

నటుడు జీవా

తమిళ సినిమా రంగంలో ప్రముఖ నిర్మాత అయిన ఆర్.బి. చౌదరి రెండవ కుమారుడు జీవా. తమిళ సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితుడు. చిన్నతనంలోనే బాల నటుడిగా కొన్ని చిత్రాలలో నటించే అవకాశం లభించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీవా సినిమాలు

జీవా సినిమాలు

2003 సంవత్సరంలో 'ఆశై ఆశాయై' అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా, తర్వాత వరుసగా తితిక్కుతే, రామ్, డిష్యుం, పోరి, ముఖముడి వంటి చిత్రాలలో నటించాడు. జీవా తొలుత ప్రేమకథా చిత్రాలలో నటించినప్పటికీ, తర్వాత విభిన్నమైన పాత్రలను ఎంచుకుని నటించడం ప్రారంభించాడు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా జీవా నటించిన చిత్రాలు ఏవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. 

బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

35
జీవా రాబోయే సినిమాలు

జీవా రాబోయే సినిమాలు

గతేడాది వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన 'కస్టడీ' చిత్రంలో అతిథి పాత్రలో మాత్రమే కనిపించాడు. ఈ ఏడాది జీవా.. వైఎస్ జగన్ జీవిత చరిత్ర, పాదయాత్ర ఆధారంగా తెరెకెక్కించిన యాత్ర 2 చిత్రంలో నటించారు. వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. 

Also Read: ఆ స్టార్ హీరో మూవీ రీమేక్ చేయమని అడిగిన సమంత..ఇకపై నోరెత్తకుండా మహేష్ దిమ్మతిరిగే సమాధానం

45
జీవా కారు ప్రమాదం

జీవా కారు ప్రమాదం

నటుడు జీవా కుటుంబం ప్రమాదానికి గురైన వార్త తీవ్ర కలకలం రేపింది. జీవా తన కుటుంబ సభ్యులతో కలిసి సేలం నుండి చెన్నైకి కారులో తిరిగి వస్తుండగా, కల్లకురిచ్చి సమీపంలోని చిన్న సేలం ప్రాంతంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి, రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను తాకి కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. జీవా కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా, ఆయన కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

55

ఈ ప్రమాదంతో సంఘటనా స్థలానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జీవాను పరిస్థితి ఏమిటని అడిగిన ఓ వ్యక్తిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవా అతడి ఫ్యామిలీ స్వల్ప గాయాలతో బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image2
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Recommended image3
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved