MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Indraja: ట్రైన్ లో వస్తే నాకు వామిటింగ్‌ అవుద్ది.. ఇంద్రజకి చుక్కలు చూపించిన డైరెక్టర్‌.. దెబ్బకి ఏం చేసిందంటే?

Indraja: ట్రైన్ లో వస్తే నాకు వామిటింగ్‌ అవుద్ది.. ఇంద్రజకి చుక్కలు చూపించిన డైరెక్టర్‌.. దెబ్బకి ఏం చేసిందంటే?

హీరోయిన్‌ ఇంద్రజ కెరీర్‌ ప్రారంభంలో అతి చేసిందట. దర్శకుడు సాగర్‌ ఆ విషయాన్ని వెల్లడించారు. ట్రైన్‌లో వస్తే తనకు వామిటింగ్‌ అవుతుందని తెలిపిందట. దీంతో ఆమెకి పెద్ద ఝలక్‌ ఇచ్చారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 28 2026, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంద్రజకి షాక్‌ ఇచ్చిన దర్శకుడు సాగర్‌
Image Credit : Asianet News

ఇంద్రజకి షాక్‌ ఇచ్చిన దర్శకుడు సాగర్‌

హీరోయిన్‌ ఇంద్రజ ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తూ రాణిస్తోంది. అదే సమయంలో స్పీడ్‌ కూడా పెంచింది. ఓ వైపు జబర్దస్త్ కామెడీ షోకి హోస్ట్ గా చేస్తూనే ఉంది. మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఆమె ఒకప్పుడు స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ వంటివారితోనూ రొమాన్స్ చేయడం విశేషం. ఈ క్రమంలో ఆమె కెరీర్‌ బిగినింగ్‌లో జరిగిన ఒక సంఘటన గురించి దర్శకుడు సాగర్‌ ఓపెన్‌ అయ్యాడు. ఇంద్రజ చేసిన మిస్టేక్‌ని వెల్లడించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ట్రైన్‌లో వామిటింగ్‌ అవుద్దని చెప్పిందట ఇంద్రజ
Image Credit : Asianet News

ట్రైన్‌లో వామిటింగ్‌ అవుద్దని చెప్పిందట ఇంద్రజ

దర్శకుడు విద్యా సాగర్‌ రెడ్డి(సాగర్‌) దర్శకత్వంలో `అమ్మదొంగ` చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించింది ఇంద్రజ. ఇందులో కృష్ణ హీరో. సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. ఈ మూవీతో ఇంద్రజ కూడా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత మరో సినిమా చేశారు. అందులో కృష్ణ హీరో. కేఆర్‌ విజయ, ప్రేమ వంటి వారు నటించారు. ఇంద్రజ కూడా ఓ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా షూటింగ్‌ మైసూర్‌లో అనుకున్నారు దర్శకుడు సాగర్‌. కేఆర్‌ విజయకి అప్పటికే సొంతంగా ఫ్లైట్‌ ఉంది. కావాలంటే అందులోనే వస్తుంది. ఆమెకి విషయం చెబితే ట్రైన్‌లోనే వస్తానని చెప్పింది. ఆమె టీమ్‌ కారులో వస్తారని చెప్పింది. ఆ తర్వాత ఇంద్రజని ఎలా వస్తావని అడిగితే ఫ్లైట్‌లో వస్తానని చెప్పింది. ఇలా కేఆర్‌ విజయ వాళ్ల టీమ్‌ ట్రైన్‌లోనే వస్తున్నారని చెబితే, తనకు ట్రైన్‌లో వస్తే వామిటింగ్‌ అవుతుందని చెప్పింది. ఫ్లైట్‌లోనే వస్తానని చెప్పింది.

34
ఇంద్రజకి చుక్కలు చూపించిన సాగర్‌
Image Credit : Asianet News

ఇంద్రజకి చుక్కలు చూపించిన సాగర్‌

దీంతో అలానే వచ్చింది. వచ్చాక సెట్‌లో ఎవరూ ఆమెతో మాట్లాడొద్దు అని టీమ్‌తో చెప్పాను. డైరెక్టర్‌, అసిస్టెంట్‌, కెమెరామెన్‌ తప్ప ఎవరూ మాట్లాడలేదు. షూటింగ్‌ మొత్తం అలానే చేశాం. దీంతో ఆమెకి అర్థమయ్యింది. తాను ఏం తప్పు చేశానో తెలుసుకుంది. ఆ తర్వాత వచ్చి సారీ చెప్పింది. అప్పుడే చెప్పాను. అమ్మ ఇక్కడ ఎవరు ఎలా ఉండాలో అలానే ఉండాలి. ఎక్కువ చేయొద్దు. ఇలా చేస్తే కెరీర్‌ పోతుందని చెప్పి వార్నింగ్‌ ఇచ్చాడట దర్శకుడు సాగర్‌. ఆ తర్వాత తాను తగ్గిందని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆమెతో పనిచేయలేదని వెల్లడించారు. కానీ ఇంద్రజ ఇతర సినిమాలు చేసి మెప్పించింది.

44
ఇంద్రజ తెలుగులో చేసిన ప్రధానమైన సినిమాలు
Image Credit : youtube/@@SignatureStudiostv

ఇంద్రజ తెలుగులో చేసిన ప్రధానమైన సినిమాలు

ఆ తర్వాత ఇంద్రజ `పిట్టల దొర`, `ఒక చిన్నమాట`, `చిలక్కొట్టుడు`, `పెద్దన్నయ్య`, `చిన్నబ్బాయి`, `చిన్న చిన్న ఆశ`, `సమ్మక్క సారక్క` వంటి చిత్రాలు చేసింది. ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకొని రాణించింది. భారీగా సినిమాలు చేసి మెప్పించింది. ఇటీవల `చకోర` చిత్రంలో మెరిసింది. హీరోకి తల్లిగా నటించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 
3rd TEST • SA vs AUS
Lunch
SASA
329
AUSAUS
(27.0 ov)90/2
Day 2 - Session 1
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Directors: త్రివిక్రమ్ నుంచి పూరి జగన్నాథ్ వరకు.. హిట్టు కోసం ఎదురుచూస్తోన్న స్టార్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Recommended image2
Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ గ్లామర్ షో.. గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరుపులు చూశారా
Recommended image3
Top 10 Day 1 Box Office: తొలి రోజే ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలు.. తెలుగు హీరోలు ఎందరంటే?
Related Stories
Recommended image1
Rajasekhar: ఆ కారణంతోనే నా కెరీర్‌ ట్రాక్‌ తప్పింది, లేదంటే మెగాస్టార్‌ రేంజ్‌.. నిజాన్ని ఒప్పుకున్న రాజశేఖర్‌
Recommended image2
Top 10 Day 1 Box Office: తొలి రోజే ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలు.. తెలుగు హీరోలు ఎందరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved