- Home
- Entertainment
- Directors: త్రివిక్రమ్ నుంచి పూరి జగన్నాథ్ వరకు.. హిట్టు కోసం ఎదురుచూస్తోన్న స్టార్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Directors: త్రివిక్రమ్ నుంచి పూరి జగన్నాథ్ వరకు.. హిట్టు కోసం ఎదురుచూస్తోన్న స్టార్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Directors: టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఆ దర్శకులు ఇప్పుడు సరైన హిట్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సినిమాలతో రెడీగా ఉన్న మేకర్స్ ఎవరో తెలుసా?

ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న డైరెక్టర్లు..
తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా హిట్ అవ్వడం, ఫ్లాప్ అవ్వడం సహజంగా జరిగే పరిణామమే. అయితే ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ ఎదురైనప్పుడు దాని ప్రభావం హీరో కంటే కూడా దర్శకుడి పైనే ఎక్కువగా పడుతుంది. హీరోలు చాలా త్వరగా తదుపరి ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తే, దర్శకులకు మాత్రం మరో అవకాశం రావడానికి , సరైన కథను సిద్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి, సవాలుతో కూడుకున్న ఈ పరిస్థితులను దాటుకొని మళ్ళీ బలమైన కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ దర్శకులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.
త్రివిక్రమ్ -పూరి ఆశలు..
ప్రస్తుతం పరిశ్రమలోని కొందరు దర్శకులు తమ నెక్ట్స్ సినిమాలకు పట్టాలెక్కించి సెట్స్‌పై బిజీగా ఉండగా, మరికొందరు సరైన అవకాశం, కాంబినేషన్ కోసం వేచి చూస్తున్నారు. మొదటగా ఇప్పటికే కమ్‌బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న దర్శకుల విషయానికి వస్తే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందున్నాడు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ స్టోరీతో.. విక్టరీ వెంకటేష్ హీరోగా 'ఆదర్శ కుటుంబం' అనే డిఫరెంట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. అలాగే హీరో ప్రాధాన్యత కలిగిన మాస్ కథలతో ట్రెండ్ క్రియేట్ చేసే దర్శకుడు పూరి జగన్నాథ్, వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి 'స్లమ్ డాగ్' అనే సినిమాతో విజయం సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు.
సంక్రాంతి సీజన్ కాపాడుతుందని నమ్మకం..
హిట్ కొసం ఎదురు చూస్తోన్న దర్శకులలో క్రిష్ కూడా ఉన్నాడు. పీరియాడిక్ - గ్రాండ్ చిత్రాలను వేగంగా తెరకెక్కించే దర్శకుడు క్రిష్, ఈసారి కొత్త నటీనటులతో ఒక విభిన్నమైన చిత్రాన్ని రూపొందించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ , టైమింగ్ కామెడీతో తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో 'జార్జి క్రిష్' అనే ఎంటర్టైనర్‌తో సంక్రాంతి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
ఇక మరోవైపు తమ ప్రతిభతో గతంలో బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ దర్శకులుగా పేరు తెచ్చుకున్న మరికొందరు కెప్టెన్లు తమ తదుపరి కమ్‌బ్యాక్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్, డిఫరెంట్ కాన్సెప్టులతో ఆకట్టుకునే మారుతి, యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల దర్శకుడు పరశురామ్, క్లాస్ అండ్ ఎమోషనల్ కథలు రాసే గౌతమ్ తిన్ననూరి, ఫ్యామిలీ డ్రామా నిపుణుడు శ్రీకాంత్ అడ్డాల తో పాటు యాక్షన్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ఉన్నారు. వీరందరికీ బాక్సాఫీస్ వద్ద మంచి ట్రాక్ రికార్డ్ ఉండటంతో, వారు ప్రకటించబోయే కొత్త సినిమాలపై టాలీవుడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఎప్పుడూ భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. వీరు కూడా తమ నెక్ట్స్ సినిమాలతో సాలిడ్ హిట్ కొట్టి పూర్వ వైభవాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు.




