- Home
- Entertainment
- Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Maa Inti Bangaram: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ `మా ఇంటి బంగారం`. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి మూవీకి ఎలాంటి టాక్ ఉందనేది చూస్తే.

మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తోన్న సమంత
సమంత హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ `మా ఇంటి బంగారం`. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆమె నుంచి వస్తోన్న సినిమా ఇది. చివరగా `ఖుషి` చిత్రంలో మెరిసింది. ఆ తర్వాత అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఏడాది బ్రేక్ కాస్త ఇప్పుడు మూడేళ్లు అయ్యింది. ఎట్టకేలకు `మా ఇంటి బంగారం`తో ఆమె అలరించబోతుంది. వచ్చే వారం ఈ చిత్రం ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.
మా ఇంటి బంగారం మూవీ సెన్సార్ రిపోర్ట్
తాజాగా `మా ఇంటి బంగారం` మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రం రెండు గంటల 20 (140) నిమిషాల నిడివితో ఉండబోతుంది. డిసెంట్‌గానే నిడివి ఉంది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం మూవీకి పాజిటివ్ రిపోర్ట్ వినిపిస్తోంది. ఈ మూవీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఆ మధ్య విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో సమంత తన విశ్వరూపం చూపించింది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` లో యాక్షన్‌తో అదరగొట్టిన సమంత ఇప్పుడు.. మా ఇంటి బంగారంలో తనదైన యాక్షన్‌తో రెచ్చిపోయింది. చీరకట్టులో ఆమె చేసిన యాక్షన్ మైండ్ బ్లాక్ పోయింది.
క్రేజీ కాంబినేషన్‌తో వస్తోన్న మా ఇంటి బంగారం
మూడేళ్ల తర్వాత సమంత నుంచి వస్తోన్న సినిమా కావడంతో అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి. ఆమె అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సమంతని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీనికితోడు.. సామ్ కూడా తనలోని మరో యాంగిల్‌ని చూపించడంతో మూవీపై మంచి బజ్ నెలకొంది. `ఓ బేబీ` తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. దీంతో సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణంగా చెప్పొచ్చు. దీనికితోడు మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. అదే సమంత భర్త రాజ్ నిడిమోరు దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించడం, ఆయన కూడా నిర్మాత కావడం.
మా ఇంటి బంగారంలో హైలైట్స్
ఇదిలా ఉంటే సినిమా చూసిన వాళ్ల నుంచి వస్తోన్న టాక్ ప్రకారం మూవీ అదిరిపోయిందని అంటున్నారు. ఇందులో సమంత ఒక మధ్యతరగతి ఇంటి కోడలిగా కనిపించబోతుంది. ఆమె ఇంట్లో పద్ధతిగా కనిపిస్తూ, తెరవెనుక మాత్రం మరో యాంగిల్ చూపిస్తుందని తెలుస్తోంది. అయితే తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా అని అంటున్నారు. ఇందులో యాక్షన్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని, కామెడీ కూడా బాగుంటుందని అంటున్నారు. థ్రిల్లింగ్ అంశాలు సర్ప్రైజ్ చేస్తాయని సమాచారం. సంగీతం, బీజీఎం సినిమాకి మరో ప్లస్ కాబోతుందట. ఇలా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం జూన్ 19న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

