- Home
- Entertainment
- Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Samantha:త్వరలో బిడ్డకు తల్లి కాబోతోంది స్టార్ హీరోయిన్ సమంత. సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత నుంచి రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. తాజాగా సమంత కవలపిల్లలను కనబోతోందంటూ మరో న్యూస్ తెగ తిరిగేస్తోంది. ఇంతకీ ఈ వార్తలో నిజమెంత.?

ఫిట్నెస్ జర్నీ అండ్ 'ది ఫైనల్ ల్యాప్'
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే సమంతకు సంబంధించిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్ట్ కంటే కూడా, తోటి హీరోయిన్ చేసిన ఒక చిన్న కామెంట్ ఇప్పుడు అభిమానుల్లో ఊహాగానాలకు తెరలేపింది.
ప్రెగ్నెంట్ అయ్యిండి .. ఏమాత్రం తగ్గకుండా ఫిట్నెస్ను కాపాడుకుంటుంది సమంత. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మహిళలకు సమంత ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తన మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు సాగిన వర్కౌట్ ప్రయాణానికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోకు 'ది ఫైనల్ ల్యాప్' (The Final Lap) అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇచ్చారు.. ఈ పోస్ట్ చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
హీరోయిన్ చేసిన ఆ ఒక్క కామెంట్ ?
సమంత షేర్ చేసిన ఈ వర్కౌట్ వీడియోపై హీరోయిన్ కృతి కర్బందా (Kriti Kharbanda) స్పందించారు. సమంత పోస్ట్‌కు రిప్లై ఇస్తూ.. "సెండింగ్ ఆల్ 3 ఆఫ్ యూ సో మచ్ లవ్" (Sending all 3 of you so much love) అంటూ తన ప్రేమను చూపించారు. అంటే మీ ముగ్గురికీ ఎంతో ప్రేమను పంపిస్తున్నానని ఆమె అన్నారు. సాధారణంగా భార్యాభర్తలు, పుట్టబోయే బిడ్డను కలిపి అలా 'ముగ్గురు' అంటారని కొందరు భావించినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఇందులో మరో కోణాన్ని వెతకడం ప్రారంభించారు.
కవల పిల్లలంటూ నెట్టింట జోరుగా ప్రచారం
కృతి కర్బందా చేసిన కామెంట్లోని 'ఆల్ 3' (All 3) అనే పదాలపై సోషల్ మీడియాలో రకరకాలుగా విశ్లేణలు జరుగుతున్నాయి. ఈ వీడియోలో సమంత మాత్రమే కనిపిస్తున్నారని, అలాంటప్పుడు ఆ ముగ్గురు ఎవరు అనే ప్రశ్నలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సమంత కడుపులో ఉన్నది ఒక్కరే కాకుండా ఇద్దరు పిల్లలా? అంటే సమంతకు నిజంగానే కవల పిల్లలు (Twins) పుట్టబోతున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
సమంతకు అత్యంత సన్నిహితంగా ఉండే కృతి కర్బందా పొరపాటున ఈ విషయాన్ని ముందే బయటపెట్టేశారా అంటూ నెటిజన్లు రకరకాల గాసిప్స్‌ను ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఏంతో తెలియాల్సి ఉంది. నిజంగా సమంత కవల పిల్లలకు జన్మనిస్తే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.




