`ఏస్ vs మామన్` బాక్సాఫీస్ వార్.. విజయ్ సేతుపతికి ఝలక్ ఇచ్చిన సూరి
విజయ్ సేతుపతి హీరోగా నటించిన `ఏస్` మూవీ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటుంది. కానీ గత వారం విడుదలైన సూరి మూవీ విజయ్‌కి షాకిస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
విజయ్ సేతుపతి `ఏస్` వర్సెస్ సూరి `మామన్`
విజయ్ సేతుపతి నటించిన గత మూవీ `మహారాజా` పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఆయన్నుంచి వచ్చిన `ఏస్` మూవీ పై అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీంతో ఇది వస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం విడుదలైంది `ఏస్.
విజయ్ సేతుపతి `ఏస్` మూవీ రెస్పాన్స్
క్రైమ్ కామెడీగా రూపొందిన `ఏస్` మూవీలో కన్నడ నటి రుక్మిణి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీతో ఆమె కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో యోగిబాబు ముఖ్య పాత్ర పోషించారు. శుక్రవారం విడుదలైన మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. యోగిబాబు పాత్ర వల్లే ఈ మూవీ అంతో ఇంతో ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు.
`ఏస్` మొదటి రోజు వసూళ్లు
విజయ్ సేతుపతి గత చిత్రాలతో పోల్చితే `ఏస్` ఫస్ట్ డే కలెక్షన్లలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. విజయ్ గత మూవీని `ఏస్` టచ్ చేయలేకపోయింది. ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 1.8 కోట్లు వసూలు చేసింది. ఇది చాలా పూర్ ఓపెనింగ్స్ కావడం గమనార్హం.
ఇక సూరి `మామన్` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ
గత వారం విడుదలైన సూరి నటించిన 'మామన్' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. కోలీవుడ్‌లో ఈ మూవీ శుక్రవారం ఒక్క రోజే రూ. 1.54 కోట్లు వసూలు చేసింది. ఇది విజయ్ సేతుపతి సినిమాకి దారుణమైన అవమానమనే చెప్పాలి. ఈ వారం కూడా `మామన్` సత్తా చాటే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి మూవీకి వస్తున్న టాక్ చూస్తుంటే ఇది నిలబడటం కష్టమే అనిపిస్తుంది. దీంతో ఇది సూరి సినిమాకి కలిసి వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.