MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Dil Raju: నా బ్యానర్‌లో ఆ స్టార్ హీరో రెమ్యునరేషన్ లేకుండా మూవీ చేశాడు.. ఎందుకని అడిగితే

Dil Raju: నా బ్యానర్‌లో ఆ స్టార్ హీరో రెమ్యునరేషన్ లేకుండా మూవీ చేశాడు.. ఎందుకని అడిగితే

Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన 50 సినిమాల ప్రయాణంలో ఎదురైన అరుదైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నటుడు జగపతి బాబుతో ఉన్న విభేదాలు, ఆ తర్వాత ఏర్పడిన ఆత్మీయ అనుబంధం, 'దిల్' సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 28 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దిల్ రాజు సినీ ప్రస్థానం
Image Credit : Dil Raju\Instagram

దిల్ రాజు సినీ ప్రస్థానం

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్ పేరు వినగానే టాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. నిజామాబాద్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించి, నేడు 50 సినిమాల మైలురాయిని చేరుకున్న అగ్ర నిర్మాత దిల్ రాజు తన సుదీర్ఘ ప్రయాణంలోని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జగపతి బాబుతో చేదు అనుభవం:
Image Credit : Dil Raju\Instagram

జగపతి బాబుతో చేదు అనుభవం:

దిల్ రాజు కెరీర్ ఆరంభంలో 'పెళ్లి పందిరి' సినిమా డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న జగపతి బాబు, కొత్త డిస్ట్రిబ్యూటర్ అయిన రాజును చూసి "నువ్వు ఈ సినిమాను హ్యాండిల్ చేయగలవా?" అని అడిగారట. ఆ మాట రాజును కొంత బాధించినా, దానిని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సినిమా విడుదలయ్యాక, నాంపల్లి ఎగ్జిబిషన్‌లో వినూత్నంగా ప్రమోషన్లు చేయడమే కాకుండా, సినిమాను సక్సెస్ చేయడంలో రాజు చూపించిన ప్యాషన్ చూసి జగపతి బాబు ఆశ్చర్యపోయారు. ఇటీవల ఒక వేదికపై జగపతి బాబు ఆనాటి సంఘటనకు దిల్ రాజుకు సారీ కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

35
రూపాయి తీసుకోకుండా నటించిన జగపతి బాబు
Image Credit : Dil Raju\Instagram

రూపాయి తీసుకోకుండా నటించిన జగపతి బాబు

జగపతి బాబుతో ఉన్న అనుబంధం ఎంత బలపడిందంటే, 'ఆకాశమంత' సినిమా తెలుగు వెర్షన్ కోసం ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించారు. "ఒక మంచి సినిమాలో భాగమైతే చాలు రాజు, నాకు డబ్బు వద్దు" అని ఆయన అన్న మాటలు తనను ఎంతగానో కదిలించాయని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. అలాగే 'పిల్ల నువ్వు లేని జీవితం' సినిమాలో శ్రీహరి మరణం తర్వాత ఆ పాత్రను చేయడానికి జగపతి బాబు వెంటనే అంగీకరించారు.

45
'దిల్' సినిమా, నితిన్ ఎంపిక
Image Credit : Dil Raju\Instagram

'దిల్' సినిమా, నితిన్ ఎంపిక

దిల్ రాజుకు నిర్మాతగా గుర్తింపు తెచ్చిన మొదటి సినిమా 'దిల్'. అప్పటికే 'ఆది' వంటి భారీ హిట్‌తో ఉన్న దర్శకుడు వి.వి. వినాయక్ ఈ సినిమాకు నితిన్ అయితే బాగుంటుందని సూచించారు. నితిన్ నటించిన మొదటి సినిమా 'జయం' విడుదల కాకముందే ఆయనను ఈ సినిమాకు ఎంపిక చేసుకోవడం విశేషం.

55
జీరో నుంచి అగ్ర నిర్మాతగా..
Image Credit : Dil Raju\Instagram

జీరో నుంచి అగ్ర నిర్మాతగా..

జీరో నుంచి ప్రారంభించి అగ్ర నిర్మాతగా ఎదగడం అనేది ఒక గొప్ప అనుభూతి అని దిల్ రాజు పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో డబ్బు కంటే మనుషులను సంపాదించుకోవడం, బలమైన సంబంధాలను నిర్మించుకోవడమే నిజమైన విజయమని ఆయన ఈ ఇంటర్వ్యూ ద్వారా చాటిచెప్పారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image2
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Related Stories
Recommended image1
Dil Raju: పంతానికి పోయిన నిర్మాత..గేమ్ ఛేంజర్ కంటే ముందు దిల్ రాజుకి తప్పిన పెద్ద ప్రమాదం
Recommended image2
Dil Raju: మున్నా సినిమా చూసి ప్రభాస్‌కు వెళ్లి సారీ చెప్పాను.. అప్పుడు డార్లింగ్ ఓ మాట అన్నాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved