MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dil Raju: మున్నా సినిమా చూసి ప్రభాస్‌కు వెళ్లి సారీ చెప్పాను.. అప్పుడు డార్లింగ్ ఓ మాట అన్నాడు

Dil Raju: మున్నా సినిమా చూసి ప్రభాస్‌కు వెళ్లి సారీ చెప్పాను.. అప్పుడు డార్లింగ్ ఓ మాట అన్నాడు

Dil Raju: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వచ్చిన 'మున్నా' సినిమా ఫలితంపై నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా విడుదల నాటి పరిస్థితులు, ప్రభాస్‌తో తనకున్న అనుబంధం.. 

1 Min read
Author : Pavithra D
Published : Mar 27 2026, 07:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
'మున్నా' ఫలితంపై దిల్ రాజు మనోగతం
Image Credit : Dil Raju\Instagram

'మున్నా' ఫలితంపై దిల్ రాజు మనోగతం

దిల్ రాజు నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(SVC) బ్యానర్‌లో వచ్చిన సినిమాల్లో 'మున్నా' ఒక ప్రత్యేకమైన చిత్రం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 2007లో ఈ సినిమాను నిర్మించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వంశీ పైడిపల్లితో అనుబంధం
Image Credit : Asianet News

వంశీ పైడిపల్లితో అనుబంధం

దర్శకుడు వంశీ పైడిపల్లితో దిల్ రాజుకు కేవలం సినిమా పరంగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడి లాంటి అనుబంధం ఉంది. వంశీలోని ప్రతిభను గుర్తించి, తన బ్యానర్‌లో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. షూటింగ్ సమయంలో యంగ్ టీమ్ అంతా కలిసి చాలా ఉత్సాహంగా పనిచేశారని రాజు గుర్తు చేసుకున్నారు.

35
విడుదల రోజున ఏం జరిగింది?
Image Credit : Asianet News

విడుదల రోజున ఏం జరిగింది?

మున్నా సినిమా విడుదలైన రోజున దిల్ రాజు హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్‌లో సినిమా చూశారు. మొదటి భాగం అద్భుతంగా ఉందని అందరూ ప్రశంసించినప్పటికీ, సెకండ్ హాఫ్‌పై మిశ్రమ స్పందన వచ్చింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభాస్‌ను కలిసినప్పుడు ఆయన కొంత నిరుత్సాహంగా ఉన్నట్లు గమనించారు. ప్రభాస్ తన ఫ్రెండ్స్, అభిమానుల నుండి వచ్చిన రిపోర్ట్స్ చూసి కొంత బాధపడ్డారని, ఆ సమయంలో ఆయనకు సారీ చెప్పానని రాజు వివరించారు.

45
అంచనాలు, ఫలితం
Image Credit : Dil Raju\Instagram

అంచనాలు, ఫలితం

అప్పటికే వరుస విజయాలతో ఉన్న దిల్ రాజు బ్యానర్.. ప్రభాస్ క్రేజ్ వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మున్నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో 'సూపర్ హిట్' కాలేకపోయినప్పటికీ, టెక్నికల్ గా, మేకింగ్ పరంగా మంచి గుర్తింపు పొందిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సినిమా ఫలితం తనను కొంత బాధించినా, ప్రభాస్‌తో ఉన్న స్నేహ బంధం ఏమాత్రం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు.

55
ప్రతి సినిమా విజయం సాధించాలని..
Image Credit : Dil Raju\Instagram

ప్రతి సినిమా విజయం సాధించాలని..

ఒక నిర్మాతగా ప్రతి సినిమా విజయం సాధించాలని కోరుకోవడం సహజమని, అయితే కొన్నిసార్లు అంచనాలు తప్పవచ్చునని దిల్ రాజు పేర్కొన్నారు. మున్నా సినిమా నేటికీ స్టైలిష్ యాక్షన్ మూవీగా ప్రభాస్ కెరీర్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
Chiranjeevi-Balakrishna: చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా? టాలీవుడ్‌లోనే అదొక సంచలనం
Recommended image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved