MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Isha Ambani: అభిషేక్ బచ్చన్‌ పెళ్లి నగలను అంబానీలకు అమ్మేశారా? ఈశా అంబానీ ఒంటిపై 200కోట్ల ఆభరణం

Isha Ambani: అభిషేక్ బచ్చన్‌ పెళ్లి నగలను అంబానీలకు అమ్మేశారా? ఈశా అంబానీ ఒంటిపై 200కోట్ల ఆభరణం

అభిషేక్ బచ్చన్ పెళ్లి నాటి నగలకి, ఈ మధ్యే మెట్ గాలాలో ఈశా అంబానీ ధరించిన ఆభరణానికి మధ్య ఉన్న పోలిక సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బచ్చన్ కుటుంబం తమ వారసత్వ నగలను అంబానీలకు అమ్మేసిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2026, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బచ్చన్‌, అంబానీ ఫ్యామిలీ మధ్య నగల రచ్చ
Image Credit : X

బచ్చన్‌, అంబానీ ఫ్యామిలీ మధ్య నగల రచ్చ

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వింత చర్చ కార్చిచ్చులా వ్యాపిస్తోంది. విషయం సింపుల్ - ఓ ఆభరణం! కానీ అది ధరించిన వ్యక్తులు, సందర్భాలు మాత్రం చాలా హై ప్రొఫైల్. 2007లో ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకునేటప్పుడు అభిషేక్ బచ్చన్ తలపాగాకు పెట్టుకున్న నగ, ఈ మధ్య మెట్ గాలాలో ఈశా అంబానీ బ్లౌజ్ వెనుక అలంకరించిన పచ్చల ఆభరణం.. రెండూ అచ్చం ఒకేలా ఉన్నాయి!
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
నగలను కనిపెట్టే పనిలో నెటిజన్లు
Image Credit : X

నగలను కనిపెట్టే పనిలో నెటిజన్లు

ఇది చూసిన నెటిజన్లు, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల వెంటపడే Gen Z కుర్రాళ్లు ఊరుకుంటారా? 'రెడ్డిట్' లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పెద్ద డిటెక్టివ్ పనే మొదలుపెట్టారు. ఈ రెండు నగల ఫోటోలను పక్కపక్కన పెట్టి చూస్తూ, అభిమానులు పదుల కొద్దీ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Related Articles

Related image1
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Related image2
మొదటి సినిమాకు లక్ష... ఇప్పుడు 10 వేల కోట్లకు యజమానురాలు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
36
బచ్చన్ ఫ్యామిలీ అమ్మేసిందా?
Image Credit : X

బచ్చన్ ఫ్యామిలీ అమ్మేసిందా?

"బచ్చన్ కుటుంబం తమ ఈ వారసత్వ ఆభరణాన్ని అంబానీ కుటుంబానికి అమ్మేసి ఉండాలి" అనేది కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు అభిషేక్‌ బచ్చన్‌ ధరించిన నగలు.. ఇప్పుడు ఈశా అంబానీ ధరించిన నగలు ఒకేలా ఉండటంతో కొంటె ప్రశ్నలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు కుర్రాళ్లు. 

46
క్వాలిటీ చెక్ కూడా చేస్తున్న అభిమానులు
Image Credit : X

క్వాలిటీ చెక్ కూడా చేస్తున్న అభిమానులు

మరికొంతమంది ఫ్యాషన్ ప్రియులు ఇంకాస్త లోతుగా పరిశీలిస్తున్నారు. "అభిషేక్ ధరించిన నగల పచ్చల రంగుకు, ఈశా ధరించిన ఆభరణం మెరుపుకు తేడా ఉంది. ఈశా ధరించింది హై క్వాలిటీ ఒరిజినల్ పీస్, అభిషేక్ ధరించింది కేవలం డిజైనర్ రీ-క్రియేషన్ కావచ్చు` అని వాదిస్తున్నారు. `ఇదంతా శ్రీమంతుల ఆట! వారసత్వ నగలను ఒకసారి పెళ్లిలో తల మీద పెట్టుకుంటారు, మరోసారి బ్లౌజ్‌కు స్టైల్‌గా తగిలించుకుంటారు" అని కొందరు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

56
వారసత్వమా? డిజైనర్ మాయా?
Image Credit : X

వారసత్వమా? డిజైనర్ మాయా?

బచ్చన్ కుటుంబం ఆభరణాలు వారసత్వంగా వచ్చినవని నమ్ముతారు. కానీ మెట్ గాలాలో ఈశా అంబానీ ధరించిన ఆభరణాన్ని 'జేడ్ బై మోనికా అండ్ కరిష్మా' డిజైన్ చేశారు. ఇది అంబానీ కుటుంబ వారసత్వ నగలను లేటెస్ట్ మోడల్‌కి మార్చడమా, యాదృచ్ఛికమా అనేది ఇంకా రహస్యమే. మొత్తానికి, ఈ 'పచ్చ'ల ఆభరణం రహస్యం బాలీవుడ్‌లో కొత్త చర్చకు దారి తీసింది.

66
నిజాం నవాబ్‌ ధరించిన నగలు
Image Credit : X

నిజాం నవాబ్‌ ధరించిన నగలు

ఇదిలా ఉంటే ఈ నగలను నిజాం నవాబ్‌ ధరించారు. ఈశా అంబానీ ధరించిన డైమాండ్‌ అభరణం.. అచ్చం నిజాం  నవాబ్‌ ధరించిన కిరీటం మాదిరిగానే ఉంది. అది రాజు తన స్థాయిని తెలియజేసేలా ఈ నగలను తలపై ధరిస్తారు. ఇప్పుడు దాన్ని ఈశా ఇలా తనదైన స్టయిల్‌లో ధరించడం విశేషం. ఇక ఈశా అంబానీ ధరించిన ఈ నగల కాస్ట్ తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే. దీని విలువ ఏకంగా రూ.200కోట్లు ఉంటుందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mother's Day: అందంలో కూతుళ్లతో పోటీ పడే తల్లీ కూతుళ్లు వీళ్ళే.. ఫోటోస్ చూశారా
Recommended image2
మొదటి సినిమాకు లక్ష... ఇప్పుడు 10 వేల కోట్లకు యజమానురాలు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే
Related Stories
Recommended image1
Vijay Deverakonda కెరీర్‌పై ఆందోళన చెందిన ఏకైక మహిళ ఎవరో తెలుసా?.. పెళ్లైన వెంటనే ఆమె సమాధి వద్దకు విజయ్‌, రష్మిక
Recommended image2
మొదటి సినిమాకు లక్ష... ఇప్పుడు 10 వేల కోట్లకు యజమానురాలు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved