MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: భర్త కోసం ఎదురుచూస్తున్న వేద! యశోదర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన మాళవిక!

Ennenno Janmala Bandham: భర్త కోసం ఎదురుచూస్తున్న వేద! యశోదర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన మాళవిక!

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Oct 03 2022, 01:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు,మొత్తానికి వసంత్ చిత్రల నిశ్చితార్థం అయిపోయింది అని అనుకుంటారు. అప్పుడు మాలిని, ఇదంతా నా కోడలు వల్లే అని అంటుంది. దానికి సులోచన, లేదు ఇదంతా మా అల్లుడి వల్లే అని అంటుంది. దానికి ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు.ఇంతలో వాళ్ళ భర్తలు వాళ్ళిద్దరిని ఆపి, చూశారా ముందు వరకు నా కొడుకు గొప్ప, నా కూతురు గొప్ప అని కొట్టుకునే వారు. ఇప్పుడు, నా కోడలు గొప్ప, నా అల్లుడు గొప్ప అని కొట్టుకుంటున్నారు దీన్నే మార్పు అంటారు అని అంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇంతలో చిత్ర అక్కడికి వచ్చి వసంత్ ఎక్కడ  అని అడగగా మాలిని, ఈపాటికి వాసంత్ ని కొంగున చుట్టుకొని తిరుగుతావు అనుకున్నాను  ఇంకా వెతుక్కుంటున్నవా అని అంటుంది. ఇంతలో చిత్ర, వేద దగ్గరికి వచ్చి వసంత్ ఎక్కడా అని అడగగా మా ఆయనే కనిపించలేక నేను ఎదురు చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు చిత్ర, ఫోన్ చేసిన ఎత్తట్లేదు, నిశ్చితార్థం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాడు అని అనగా, ఇక్కడ కూడా అదే ప్రాబ్లమ్. అంటే ఇద్దరు కలిసే వెళ్లారన్నమాట అని అంటుంది వేద. ఆ తర్వాత సీన్లో డాక్టర్లు వచ్చి, ప్రమాదం ఏమీ లేదు.

37

సరైన సమయానికి తీసుకువచ్చారు కనుక సరిపోయింది లేకపోతే ప్రాణాలకు ప్రమాదం అయ్యేది అని అంటారు.అప్పుడు పోలీసులు, మేము వెళ్లి స్టేట్మెంట్ తీసుకోవచ్చా అని అనగా, ఆ తప్పకుండా వెళ్లొచ్చు అని డాక్టర్లు అంటారు.ఇంతలో అభిమన్యు, ఈరోజు పని అయిపోతుంది అని అంటాడు. ఆ తర్వాత వేద ఇంటి బయట యష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.మరో వైపు  మాళవిక దగ్గరికి తన కొడుకు వచ్చి, అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా! నువ్వు లేకపోయేసరికి నేను ఎంత బాధ పడ్డానో ఐ లవ్ యు అని అనగా ఇంకెప్పుడు అలా చేయను అని మాళవిక అంటుంది.

47

ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ రాస్తాము చెప్పండి మేడం. మీరు ఎవరి గురించి చెప్పినా వాళ్లని జైల్లో పెడతాము అని అంటారు. బయట ఉన్న వసంత్ యష్ తో, తను గాని నీ పేరు చెప్పినట్లయితే ఇంకా మనకి ప్రమాదం యశ్.కోర్టులో ఆడవాళ్ళ వైపే ఎక్కువ న్యాయం ఉంటుంది వాళ్ళు ఏం చెప్పినా జరుగుతుంది అని అంటారు. మరోవైపు అభిమన్యు చాలా సంతోషపడుతూ ఉంటాడు.అప్పుడు అభిమన్యు యశ్ దగ్గరికి వెళ్లి, నాకు నువ్వంటే ఇష్టం లేదు కానీ మొట్టమొదటిసారి నిన్ను చూస్తే జాలేస్తుంది.
 

57

ఇప్పుడు పోలీసులు బయటకు వచ్చి నిన్ను జైలుకి తీసుకెళ్తే నాకు చూడ్డానికి ఎంత ఆనందంగా ఉంటుందో అని అనుకుంటాడు. మరోవైపు వేద యశ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా వాళ్ళ బావ అక్కడికి వస్తారు. బావ నేను ఆయన గురించి ఎదురు చూస్తున్నాను అని మీరు అనుకోవద్దు. నేను ఊరికినే ఇటువైపు వచ్చాను అసలు నేను ఆయన భార్యను కాదు కదా అని అనగా, ముందు నువ్వు ఖుషి వాళ్ళ తల్లివనే అన్నావు కదా ఇప్పుడు భార్య వరకు వచ్చావు అంటే మీ ఇద్దరి మధ్య ఏదో బంధం చిగురిస్తున్నది అని అంటాడు. దానికి వేద అలాంటిదేమీ లేదు అని అంటుంది.
 

67

ఆ తర్వాత పోలీసులు మాలవిక దగ్గర స్టేట్మెంట్ రాసుకుంటారు. అప్పుడు పోలీసులు,ఇదే కదా మీ చివరి మాట. దీన్నే మేము ఫైనల్ రిపోర్ట్ గా తీసుకుంటాము అని అంటారు. బయటకు వచ్చిన తర్వాత అభిమన్యు ఆనందంగా ఏం చెప్పింది అని అనగా,ఆవిడ ఆ డోస్ వేసుకోవడానికి కారణం తనేనట. ఎప్పుడు అవి వేసుకుంటారట కాకపోతే ఈరోజు తెలియకుండా కొంచెం ఎక్కువ వేసుకున్నారట అని చెప్పారు అని అనగా, అలా చెప్పిందా అని అభిమన్యు కోప్పడతాడ. ఇంతలో పోలీసులు ఆవిడ మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు అని అనగా అభిమన్యు లోపలికి వెళ్ళడానికి చూస్తాడు.

77

ఇంతలో పోలీసులు, మిమ్మల్ని కాదు యష్ గారిని అనగా యష్ లోపలికి వెళ్తాడు. అప్పుడు మాళవిక యశోధర్ తో, నాకు ఒక్క మాట చాలు నిన్ను లోపల పెట్టించడానికి,నిన్ను ఏడేళ్ల వరకు బయటకు రానివ్వకుండా ఉండడానికి కానీ నేను నీ పేరు ఎందుకు చెప్పలేదు అంటే, ఈ వంకతో వేదకి నీ మీద ఎక్కడ ప్రేమ పెరిగిపోతుందో అని నీ పేరు చెప్పలేదు జాగ్రత్త అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved