- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: కూతురిని దూరంగా నెట్టేసిన యష్.. మాళవిక చెంప చెల్లుమనిపించిన మాజీ భర్త!
Ennenno Janmala Bandham: కూతురిని దూరంగా నెట్టేసిన యష్.. మాళవిక చెంప చెల్లుమనిపించిన మాజీ భర్త!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ ప్రేమ యొక్క గొప్పతనం తెలిపే నేపథ్యం లో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

స్టేజ్ పైకి ఎక్కిన వేద (Vedha) మా శ్రీవారే ఇంట్లో పనులన్నీ చేస్తారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి తండ్రి, ఇలాంటి భర్త నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ.. యష్ (Yash) ను ఆట పట్టిస్తుంది. అది మాలిని ఫ్యామిలీ చూసి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకవైపు యష్ మాత్రం కోపంగా ఉంటాడు.
ఈలోగా అక్కడకు అభిమన్యు (Abhimanyu) కూడా వస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక యష్ ఎందుకు వచ్చావు అని అడగగా నేను కేవలం నా కూతురు కోసం వచ్చాను అని అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు ఖుషి (Khushi) నా కూతురు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకీ ఫాదర్ ఎమోషన్ అని యష్ ను దెప్పి పొడుస్తాడు.
దానికి యష్ (Yash) ఎంతో కోపం వ్యక్తం చేస్తాడు. ఇక ఈ లోపు అక్కడకు మాళవిక కూడా వస్తుంది. దాంతో వేద ఖుషి ను అక్కడి నుంచి తీసుకుని వెళుతుంది. ఆ తర్వాత అభిమన్యు ఖుషి ను చాక్లెట్ ఇస్తానని పిలిచి నువ్వు ఎవరి పోలీకో ఒకసారి మీ నాన్నని అడుగు అని అంటాడు. ఇక ఖుషి (Khushi) యష్ ను అడిగేస్తుంది.
ఆ తర్వాత మాళవిక (Malavika) యష్ లు అనుకోకుండా ఒకరికొకరు తగులుకుంటారు. ఈ క్రమంలో మాళవిక యష్ ను హాగ్ చేసుకుంటుంది. యష్ తన నడుము మీద చెయ్యి వేసాడు. ఆ తరువాత ఒకరికొకరు గ్రహించుకుని అక్కడినుంచి వెళ్ళిపోతారు. ఇక మాళవిక వేద దగ్గరికి వెళ్లి యష్ (Yash) నేను కావాలనే టచ్ చేసుకున్నాం అని చెబుతుంది.
ఇక ఖుషి యష్ (Yash) దగ్గరకు వెళ్లి నేనెవరు పోలిక అని పదే పదే అడుగుతూ ఉండగా ఖుషి ను నెట్టి పడేస్తాడు. అంతేకాకుండా మాళవిక ను చెంపమీద గట్టిగా కొడతాడు. ఇక ముఖం మీద ఉమ్మేసి నట్లుగా కూడా చూస్తాడు. ఇక యష్ ఫుల్లుగా మందు కొట్టి ఇంటికి వచ్చి వేద (Vedha) మీద పడతాడు.