Ennenno Janmala Bandham: వసంత్ చెంప పగలగొట్టిన చిత్ర.. తమ్ముడికి సంబంధం చూసిన యష్!
Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala bandam) సీరియల్ మంచి ప్రేమకథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే యష్ (Yash) వేదను నగలతో అలంకరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వేదకు లిప్ స్టిక్ కూడా పెడతాడు. దాంతో వేద మనసులో ఎంతో ప్రేమగా ఫీల్ అవుతుంది. ఇక ఖుషి (Khushi) డాడీ మమ్మీకి బుగ్గకి చుక్క కూడా పెట్టండి అని అంటుంది. అంతేకాకుండా కాటుక కూడా పెట్టండి అని ఖుషి అంటుంది.
ఇక ఆ గేమ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా యష్ (Yash) వేద ను చేసిన అలంకరణ నిలుస్తుంది. దాని గురించి స్కూల్ స్టాప్ యష్ ను ఎంతో పొగుడుతారు. అంతేకాకుండా ఆ గేమ్ విన్నర్ గా యష్ ను అనౌన్స్ చేస్తారు. ఇక అది దూరం నుంచి గమనించిన మాళవిక (Malavika) అది బెస్ట్ మదర్ గా చలామని అవ్వడం ఏమిటి అని ఆవేశ పడుతూ ఉంటుంది.
ఇక అభిమన్యు (Abhimanyu) నేను వేటాడే వేటకుక్క రేపు వాడిని వదలను అని యష్ ను అంటాడు. ఆ తర్వాత యష్ దంపతులు హ్యాపీ గా కారులో వెళుతూ ఉండగా కారు ముందు ఒక వ్యక్తి పడిపోయినట్లు గా కనిపిస్తాడు. ఇక యష్ (Yash) అతడి దగ్గరకు వెళ్లగా ఆ వ్యక్తి లేచి కత్తి పట్టుకుని యష్ పై తిరగ పడతాడు.
అంతేకాకుండా జేబులో డబ్బులు తియ్యి.. చేతికున్న ఉంగరాలు తియ్యి అంటూ బెదిరిస్తాడు. ఇక తనే కాకుండా ఇంకా కొంతమంది రౌడీలు వస్తారు. ఇక యష్ (Yash) వాళ్లకి ఏ మాత్రం భయపడకుండా వాళ్ళ ని ఒక రేంజ్ లో ఇరగదీస్తాడు. ఇక వేద (Vedha) రౌడీలతో యష్ ఫైట్ చేసింది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.
ఇక ఆ తర్వాత వేద (Vedha) యష్ కు చిన్న దెబ్బ తగలగా తానే స్వయంగా కట్టుకట్టి ఒక టాబ్లెట్ ఇస్తుంది. ఇక మరోవైపు ఖుషి (Khushi) ఫ్యామిలీ అందరికీ వాళ్ల డాడీ రౌడీలతో ఫైట్ చేసిన సంగతిని షేర్ చేసుకుంటూ బాగా హడావిడి చేస్తుంది. ఇక వేద యష్ ను ఆట పట్టించడానికి కొన్ని మాటలు అంటుంది.
ఇక తరువాయి భాగంలో వసంత్ (Vasanth) ను లేట్ గా వచ్చినందుకు చిత్ర గట్టిగా చెంప మీద కొడుతుంది. దాంతో యష్ కోపంగా వసంత్ ను అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. ఇక వేద (Vedha) మా చెల్లెలికి మీ తమ్ముడికి పెళ్లి చేయాలి అనగా.. మా తమ్ముడు పెళ్లి నా బిజినెస్ పార్ట్నర్ కూతురితో అని అంటాడు యష్.