- Home
- Entertainment
- Ennenno Janmala Bandham: కైలాష్ కు చివాట్లు పెట్టిన నీలాంబరి.. మరో ప్లాన్ చేసిన అభి?
Ennenno Janmala Bandham: కైలాష్ కు చివాట్లు పెట్టిన నీలాంబరి.. మరో ప్లాన్ చేసిన అభి?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన మాజీ భర్త సంతోషంగా ఉండడం భరించలేకపోతున్న ఒక స్వార్ధపరురాలి కథ సీరియల్. ఇక ఈరోజు జూన్ 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు నా పిల్లలకి తల్లిగా ఈ ఇంటి కోడలుగా చేయవలసిన దానికన్నా చాలా ఎక్కువగా చేశావు. నేను నా బాధ్యతను మర్చిపోయినప్పటికీ నీ బాధ్యతని నువ్వు వదలలేదు అంటూ భార్యని మెచ్చుకుంటూ మాట్లాడుతాడు యష్. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటుంది వేద. చెప్పని వేద కోపాన్ని ప్రదర్శించినంత తేలిక కాదు ప్రేమని ప్రదర్శించడం.
మామూలుగా పెళ్లి లో ప్రమాణాలు చేస్తారు కానీ ఏ ప్రమాణాలు చేయకుండానే మన పెళ్లి అయిపోయింది కానీ ఈరోజు నేను ప్రమాణం చేస్తున్నాను ఇకమీదట నీ కళ్ళల్లో కన్నీరు రానివ్వను ఒకవేళ వస్తే అవి ఆనందభాష్పాలు మాత్రమే అవ్వాలి నీ ప్రతి అడుగులో నేను తోడుంటాను అంటాడు యష్. ఆ మాటలకి ఎమోషనల్ అయిన వేద భర్తని పట్టుకొని కన్నీరు పెట్టుకుంటుంది.
ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాళవిక ఇదంతా చూస్తూ కుళ్ళుకుంటుంది. మాళవిక వచ్చినట్లు గ్రహించిన వేద దంపతులు అవాక్కవుతారు.నేరుగా బెడ్ రూమ్ లోకి వచ్చేయటమేనా ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లేద్దా అని కసురుకుంటాడు యష్. సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మాళవిక.
ఏం అవసరం మీద వచ్చిందో ఏంటో అనుకుంటూ మాళవిక వెనకాతల వెళుతుంది వేద.టై నాట్ వేయించుకోవటానికి వచ్చాను అంటుంది మాళవిక. నేను వేస్తాను ఇవ్వు అంటుంది వేద. వద్దు అంటుంది మాళవిక. ఈసారి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రా ఎందుకంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి వెళ్ళిపోతుంది వేద. నా ప్లేస్ లో ఉన్న నువ్వు నాకే నీతులు చెప్తున్నావు. నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చూసుకుంటాను అనుకుంటుంది మాళవిక.
మరోవైపు చెయ్యి నొప్పితో బాధపడుతున్న అభి ని చూసి బాధపడుతుంది నీలాంబరి. అప్పుడే అక్కడికి వచ్చిన కైలాష్ ఏం జరిగింది అని అడుగుతాడు. జరిగిందంతా చెప్తాడు అభి.ఒంటరిగా ఎందుకు వెళ్లారు అయినా బెయిల్ తీసుకొచ్చినదాన్ని మీ మీద కేసు లేకుండా చేయలేనా.. ఇప్పుడు చూడండి ఎంత బాధ పడుతున్నారో అంటూ అతి ప్రేమ చూపిస్తుంది నీలాంబరి.
ఎప్పుడూ ఆయనతో గంటలు గంటలు సొల్లు కబుర్లు చెప్తారు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఆయనకి తోడుగా వెళ్లాలనే జ్ఞానం లేదు అంటూ కైలాష్ కి చివాట్లు పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కైలాష్ ఖుషి బర్త్డే సంగతి చెప్తాడు. వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అంటాడు అభి.ఏం చేస్తావ్ బ్రో అంటాడు కైలాష్. నేనొక్కడినే కాదు నువ్వు కూడా.. ఏం చేస్తున్నామో సాయంత్రం నీకే తెలుస్తుంది అంటాడు అభి. మరోవైపు బర్త్డేకి వస్తున్న అతిథులు అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు మాలినీ, సులోచన.
ఇద్దరికీ తేడా వచ్చి మళ్లీ గొడవ పడుతూ ఉంటారు. ఆపండమ్మా.. ఇక్కడ చిన్న పిల్లలు ఎవరో అర్థం కావట్లేదు అంటూ చికాకు పడుతుంది వేద. అయినా శాంతించని మాలిని సులోచన ఇద్దరూ పోటీపడి మరీ మనవడికి మనవరాలికి దిష్టి తీస్తారు. అదే ఫంక్షన్ కి జోకర్ వేషాల్లో వస్తారు కైలాష్, అభి. కాసేపు పిల్లలతో ఆడిన తర్వాత ఇక్కడ అందరూ కనిపిస్తున్నారు కానీ నా మాజీ బంగారం మాళవిక కనిపించడం లేదేంటి అంటాడు అభి.
పిల్లలు వాళ్ళిద్దర్నీ చుట్టుముట్టడంతో కాస్త కంగారు పడతాడు కైలాష్. అతనికి ధైర్యం చెప్తాడు అభి. ఫంక్షన్ అయ్యే లోపు ఈ అభి అంటే ఏంటో అందరికీ తెలియాలి అంటాడు. ఆ తర్వాత వేద కంట్లో ఏదో పడటంతో నా వేద కంట్లో పడితే నేను పడాలి కానీ ఈ దుమ్ము పడటం ఏంటి అంటూ దానిని తీసే ప్రయత్నం చేస్తాడు యష్. అది చూసిన మాళవిక అసూయతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.