- Home
- Entertainment
- Ennenno Janamala bandam: వేద అందానికి యష్ ఫిదా.. అవకాశాన్ని చూసి దెబ్బకొట్టె ప్రయత్నంలో అభిమన్యు!
Ennenno Janamala bandam: వేద అందానికి యష్ ఫిదా.. అవకాశాన్ని చూసి దెబ్బకొట్టె ప్రయత్నంలో అభిమన్యు!
Ennenno Janamala bandam: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janamala bandam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

యశోదర్ (Yashodhar) మోసేన్స్ అవ్వడానికి కారణం నువ్వే అని ఫన్నీగా వేదని తిడుతాడు. ఇక యశోదర్ (Yashodhar) బాధను చూడలేక వేద మోషన్స్ టాబ్లెట్లు తెప్పిస్తుంది. అంతేకాకుండా వేద వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి మజ్జిగలో వాము మిక్స్ చేసి తీసుకొని రా అంటుంది.
మరోవైపు యశోదర్ వేద (Vedha) తెప్పించిన టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలి అని ఫన్నీగా ఇగో ఫీలింగ్ చూపిస్తాడు. మరోవైపు అభిమన్యు మాళవిక (Malavika) లు ఒక దగ్గర కూర్చుని యశోదర్ ను ఎలా దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. మాళవిక ఈ సారి గురి తప్పకూడదు బంగారం అని అంటుంది.
ఇక అభిమన్యు (Abhimanyu) వేటాడడానికి చాలా ఓర్పు కావాలి బంగారం ఇంకా కొంచెం ఓపిక పట్టు అని అంటాడు. ఇక యశోధర్ (Yashodhar) వాళ్ళ దగ్గరకు చిత్ర, వసంతులు రానే వస్తారు. వేద మజ్జిగ వాము తాగమని ఇవ్వగా.. యశోదర్ దాన్ని వేసుకోవడానికి ఇష్ట పడడు. దాంతో వేద అక్కడ్నుంచి అలిగి వెళ్ళిపోతుంది.
చిత్ర (Chithra) మజ్జిగకు బదులుగా పాలలో వాము కలిపి తీసుకోవస్తుంది. దాన్ని యశోదర్ తాగేస్తాడు. ఇక పాలు ఇచ్చినందుకు వాళ్ళిద్దరి పై చిరాకు పడతాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొంత సేపు క్లాస్ జరుగుతూనే ఉంటుంది. ఇక వసంత్ (Vasanth) చిత్రలు అక్కడినుంచి భయపడి బయటకు వచ్చి వీళ్లిద్దరు పెళ్లయిన తర్వాత కూడా ఎందుకు దెబ్బలాడు కుంటున్నారు అని అనుకుంటారు.
ఆ తర్వాత యశోదర్ (Yashodhar) మోషన్స్ తట్టుకోలేక రాత్రంతా బాత్రూం లోనే పడుకుంటాడు. ఒక వైపు మంచం మీద వేద (Vedha) హాయిగా మహారాణిలా పడుకొని ఉంటుంది. ఇక అది చూసిన యశోదర్ అసూయ పడతాడు. తరువాయి భాగం లో మాళవిక (Malavika) స్కూల్ దగ్గరికి వెళ్లి ఖుషి ను దగ్గరకి తీసుకోబోతుంది.
ఈలోపు యశోధర్ (Yashodhar) అక్కడికి వచ్చి డోంట్ టచ్ మై డాటర్ అని అంటారు. అది చెప్పడానికి నువ్వు ఎవరు అని మాళవిక అడగగా నేను ఖుషీ (Khushi) కన్నతండ్రి అని అంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.