హారికతో రిలేషన్‌పై నోరు విప్పిన అభిజిత్.. చెల్లి లేదనే బాధ ఉందట!
First Published Dec 22, 2020, 6:19 PM IST
బిగ్‌బాస్ 4 విన్నర్ అభిజిత్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా ఇంటర్వ్యూలతో హల్చల్ చేస్తున్నారు. విన్నర్‌గా నిలిచిన తర్వాత నిన్నటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే ఇందులో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు అభిజిత్. హౌజ్‌లో జరిగిన విషయాలను షేర్ చేసుకున్నారు. తోటి కంటెస్టెంట్ల గురించి చెప్పారు.

బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఆదివారంతో ముగిసింది. అందరు ఊహించినట్టే అభిజీత్ విన్నర్‌గా నిలిచారు. ట్రోఫీ అందుకున్నారు. అయితే సోహైల్ ముందుగానే 25లక్షల ఆఫర్‌ని తీసుకుని తప్పుకోవడంతో అభిజిత్‌కి దక్కింది కేవలం 25లక్షల రూపాయలే. దీంతోపాటు ఆయన ప్రతి వారం చెల్లించే మొత్తాన్ని తీసుకున్నారు. ఈ విషయంలో అభిజిత్‌కి అన్యాయమే జరిగిందని అంతా విమర్శలు గుప్పిస్తున్నారు. బిగ్‌బాస్ టీమ్ కక్కుర్తి పడిందని కామెంట్ చేస్తున్నారు.

ఇంటికి చేరుకున్న అభిజిత్ రిలాక్స్ అయ్యారు. నిన్నటి నుంచి వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా గడుతున్నారు. క్షణం తీరికలేకుండా ఉంటున్నాడు. తాజాగా ఓ టీవీ ఛానెల్లో అభిజిత్ పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?