Ennenno Janmala Bandham: యష్ ను క్షమాపణ కోరిన మాళవిక.. మరో ప్లాన్ చేసిన అభి?
Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. తను వదిలేసిన భర్త పంచన చేరి వాళ్ల కాపురానికే చిచ్చు పెడుతున్న ఒక మాజీ భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో స్టేజ్ మీదకి వెళ్ళిన ఖుషి వేద గురించి మాట్లాడుతూ ఉంటుంది. నన్ను నా తల్లి వదిలేసి వెళ్ళిపోతే కన్నా తల్లి కన్నా ఎక్కువగా నన్ను పెంచింది. ఈరోజు తన వల్లే నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నేనే కాదు మా నాన్న నానమ్మ తాతయ్య కూడా అమ్మ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. మా నాన్న బాధలో ఉన్నప్పుడు మా అమ్మ ఓదార్చి ధైర్యం చెప్పి మా నాన్న బాధ పోగొట్టింది.
ఐ లవ్ యు అమ్మ అని చెప్పి వేదని స్టేజి మీదకి రమ్మని ఆమెని హగ్ చేసుకుంటుంది ఖుషి. తర్వాత యష్ ని కూడా స్టేజి మీదకి రమ్మని నేను ఆడుకునే ఒక ప్లాస్టిక్ ఉంగరాన్ని మా నాన్న మా అమ్మకి తొడిగితే దాన్ని అపురూపంగా ఇన్నాళ్లు మా అమ్మ ఉంచుకుంది. ఇప్పుడు ఈ ఉంగరాన్ని మా నాన్న మార్చాలి. అందుకే ఆయన దాచిన ఉంగరాన్ని తెచ్చేసాను అని చెప్పి తండ్రికి ఆ ఉంగరాన్ని తల్లికి తొడగమని ఇస్తూ ఇది మీరు నాకు ఇచ్చే బర్త గిఫ్ట్ అంటుంది ఖుషి.
ఇదంతా చూస్తున్న అభి నా మాళవిక బంగారం రియాక్షన్ చూసావా తను ఎప్పటికీ ఇలాగే ఉండాలి కోపంతో రగిలిపోవాలి. అదే కోపంతో యష్ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయాలి అని కైలాష్ తో చెప్తాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన యష్ ఉంగరం తీసుకుని నా కూతురికి ఇంకా మాట్లాడటం కూడా సరిగ్గా రాదు అనుకున్నాను చాలా బాగా మాట్లాడేసింది. అనగానే తను చెప్పినట్లు నా భార్య నా జీవితంలోకి రావడం ఒక అదృష్టం.
నాకు భార్యగా, ఖుషికి తల్లిగా, నా తల్లిదండ్రులకి కోడలిగా ఆ ఇంటిని స్వర్గం లాగా మార్చేసింది. నేను ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరని మాట మళ్లీ ఇప్పుడు అందరి ముందు చెప్తున్నాను అని చెప్పి వేదవైపు తిరిగి ఉంగరం తొడుగుతూ ఐ లవ్ యు చెప్తాడు. బాగా ఎమోషనల్ అయిపోతుంది వేద. ఇదంతా చూస్తుంటే నీకు కడుపు మండడం లేదా అని అభిని అడుగుతాడు కైలాష్.
మండుతుంది కానీ తప్పదు చప్పట్లు కొట్టాలి లేదంటే మన మీద డౌట్ వస్తుంది అంటాడు అభి. మరోవైపు వసంత్, చిత్ర క్లోజ్ గా ఉండడాన్ని చూసి భరించలేక పోతాడు అభి. కోపంతో రగిలిపోతూ బెలూన్స్ పగలగొడతాడు. అతను ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో చిత్రకి అర్థం కాదు. అదే విషయాన్ని వసంత్ కి చెప్తే లైట్ తీసుకోమని చెప్తాడు వసంత్.
మరోవైపు మాళవిక యష్ తో మాట్లాడుతూ మీరిద్దరూ ఖుషి ని చాలా బాగా పెంచుతున్నారు తను సంతోషంగా ఉండాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఆదిత్యని కూడా అలాగే ఉంచాలని చూస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి నేను చేసిన తప్పులు క్షమించలేనివి అయినా నన్ను ఆదిత్య ని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది దయచేసి నా తప్పులు క్షమించు అని అడుగుతుంది.
పగిలిపోయిన అద్ధం ఎప్పటికీ అతుక్కోదు అలాగే విరిగిపోయిన మనసుతో స్నేహం కూడా జరగని పని అని చెప్పి కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు యష్. నన్ను నేను తప్పుగా చేసుకొని నిన్ను క్షమాపణ అడిగితే ఇంత చులకనగా చూస్తావా మీరిద్దరూ ఎలా సంతోషంగా ఉంటారు నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది మాళవిక. మరోవైపు యష్ ఫ్యామిలీ సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే ఆదిత్య ని కిడ్నాప్ చేద్దాము అంటాడు అభి.
సరే అంటాడు కైలాష్. వాళ్ళిద్దరూ ఆదిత్య ని కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉండగా అప్పటికే మత్తులో ఉన్న రత్నం, శర్మ అభి వాళ్ళని జోకర్లు అనుకొని వాళ్ళని ఒక ఆట ఆడిస్తారు.వీళ్లేంటి మనతో ఆడుకుంటున్నారు అనుకోని టైం చూసి పక్కకి తప్పుకుంటారు అభి వాళ్ళు. తరువాయి భాగంలో నువ్వు కేక్ కోసం తర్వాత మొదటి ముక్క మాళవిక అమ్మకి పెట్టు అని ఖుషి కి చెప్తుంది వేద. కానీ ఖుషి నాకు నిన్ను తప్పితే వేరే ఎవరిని చూసినా అమ్మ లాగా కనిపించడం లేదు అని వేద నోట్లో కేక్ పెడుతుంది.