MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: అవమానంలో దుగ్గిరాల కుటుంబ సభ్యులు.. నిజం తెలుసుకొని షాకైన కనకం దంపతులు?

Brahmamudi: అవమానంలో దుగ్గిరాల కుటుంబ సభ్యులు.. నిజం తెలుసుకొని షాకైన కనకం దంపతులు?

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. నిజాన్ని నిరూపించి కాపురాన్ని నిలబెట్టుకున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jun 02 2023, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

 ఎపిసోడ్ ప్రారంభంలో వీళ్ళందరూ నామీద కుట్ర చేశారు. వీళ్ళేవరిని నమ్మొద్దు అంటాడు రాహుల్. రాహుల్ చెంప పగలగొడతాడు రాజ్. పిన్ని నీకు గుర్తుందా ఆ రింగ్ నేను స్వప్న కోసం కొంటే వీడే లాక్కున్నాడు అని ధాన్యలక్ష్మికి చెప్తాడు రాజ్. అవును రాజ్ ఇప్పుడు గుర్తొస్తుంది అంటుంది ధాన్యలక్ష్మి. చిన్నప్పటినుంచి నేను ఇష్టపడిన ప్రతిదీ నువ్వు ఇష్టపడుతుంటే పోనీలే నాతోనే పెరిగాడు అని నీకే ఇచ్చేవాడిని.

210

 అలాంటిది నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని కూడా నువ్వు లాగేసుకున్నావు అంటూ రాహుల్ ని అసహ్యించుకుంటాడు రాజ్. ఏంటి రుద్రాణి నోరు పడిపోయిందా ఆరోజు వెన్నెలకి ఈ సంబంధం తగదు అంటే నన్ను ఎన్ని మాటలు అన్నావు ఇప్పుడు మాట్లాడు అంటుంది అపర్ణ. ఇదంతా ఏదో కుట్ర లాగా ఉంది అంటుంది రుద్రాణి.

310

ఎవరిది కుట్ర? ఒక అమ్మాయిని తల్లిని చేసి మరో తల్లి బిడ్డకి అన్యాయం చేయాలనుకున్నాడు ఈ త్రాస్టుడు అంటూ తల్లి కొడుకులని మందలిస్తాడు సీతారామయ్య. వాడు అలాంటి వాడని తెలిసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు అపర్ణ.. నిన్ను నమ్మే కదా ఈ సంబంధం మాట్లాడింది. ఇలాంటి కుటుంబంలోకా నా కూతుర్ని ఇవ్వాలనుకున్నాను. ఒకడు భార్యని అపార్థం చేసుకుని దూరం పెట్టాడు.

410

మరొకడు పెళ్లికి ముందే తల్లిని చేశాడు. ఏం కుటుంబం మీది ఛీ.. అని అసహ్యించుకుంటుంది  అరుంధతి. వేలికి ఉన్న ఉంగరం తీసి రాహుల్ మొహాన కొడుతుంది వెన్నెల. అవమానంతో తలదించుకుంటారు దుగ్గిరాల కుటుంబ సభ్యులు. ఇందులో వాళ్ల తప్పేమీ లేదు రుద్రాణివల్ల నేను ముసుగేసుకుని పెళ్లి పీటల మీదకి వస్తే దానిని వీళ్ళందరూ అపార్థం చేసుకున్నారు అంతేకానీ ఈ కుటుంబంలో ప్రతి మనిషికి సంస్కారం ఉంది అంటూ తన కుటుంబాన్ని వెనకేసుకొస్తుంది కావ్య.

510

అదంతా నీ పర్సనల్ మేటర్ కానీ నా కూతుర్ని మాత్రం నువ్వే సేవ్ చేశావు అని కావ్యని మెచ్చుకొని అక్కడ నుంచి కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది అరుంధతి. సేమ్ కట్ చేస్తే కారులో అక్కచెల్లెళ్ళు ముగ్గురు ఇంటికి వస్తారు. కావ్య తో వస్తున్న స్వప్నను చూసి షాక్ అవుతుంది కనకం. ఏం జరిగింది? తను ఎందుకు నీతో వస్తుంది అని కావ్య అని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది కావ్య. మోసం చేసినవాడు రాహుల్ అని తెలుసుకొని షాక్ అవుతారు కనకం దంపతులు.

610

వాడు అన్న వరస అవుతాడు కదా అంటుంది కావ్య పెద్దమ్మ. ఎంత పాపం చేసావు.. ఇంత దిగజారి పోయావేంటి అంటూ స్వప్నని అసహ్యించుకుంటారు తల్లిదండ్రులు. వాళ్లు దుగ్గిరాల రక్తసంబంధికులు కాదు అంటూ జరిగింది చెప్తుంది కావ్య. ఇంతకీ వాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏమైనా అన్నారా అని అడుగుతుంది కనకం. ఏమి అనలేదు ఎవరి మటుకు వాళ్ళు వెళ్లిపోయారు మేము ముగ్గురమే ఉన్నాము అందుకే ఇక్కడికి వచ్చేసాము అంటుంది అప్పు.

710

 సీన్ కట్ చేస్తే రాహుల్ చెంప పగలగొడుతుంది రుద్రాణి. రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అధినేతగా నిన్ను చూడాలనుకున్నాను కానీ ఎప్పటికీ ఆ స్థితికి చేరుకోలేనంతగా దిగజారిపోయావు అంటూ కొడుకుని మందలిస్తుంది. స్వప్న నన్ను మోసం చేసిందమ్మ. డబ్బున్న దానిని అని నమ్మించింది. రాజ్ ని దెబ్బ కొడదాం అనుకున్నాను కానీ నేనే మోసపోయాను అంటాడు రాహుల్.

810

ఇకనుంచి మన మధ్య ఉండవలసింది కోపరేషన్ కాదు కోఆర్డినేషన్ అంటూ.. స్వప్నని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అని కొడుక్కి చెప్తుంది రుద్రాణి. మరోవైపు కనకం ఇంటికి వస్తారు రాజ్, సీతారామయ్య దంపతులు. అక్కడ ఉన్న అమ్మలక్కలు దుగ్గిరాల వారి కుటుంబం లో కూడా ఇలాంటి మోసగాళ్లు ఉంటారా అంటూ నిలదీస్తారు. స్వప్నక్క ని మోసం చేసిన అబ్బాయి దుగ్గిరాల వంశస్థుడు కాదు.
 

910

వాళ్లు కేవలం మా ఇంట్లో ఉంటారు అంతే. మా వంశాన్ని ఏమీ అనొద్దు అంటూ అత్తింటి వాళ్ళని వెనకేసుకొస్తుంది కావ్య. అమలక్కలు బయటకు వెళ్లిపోయిన తర్వాత మీ అమ్మాయిని మోసం చేసిన అబ్బాయి మా వంశస్థుడు కాదు కానీ మా ఇంట్లో మా చేతుల్లో పెరిగిన వాడు అందుకే మేము బాధ్యత తీసుకొని ఇక్కడికి వచ్చాం.

1010

ఈ సమస్యకి పరిష్కారం మీరు కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకుందాం అంటారు సీతారామయ్య దంపతులు. తరువాయి భాగంలో పెళ్లి అయిన చేయించుకుని వచ్చాము రెండు రోజుల్లో రాహుల్ పెళ్లి అంటారు సీతారామయ్య దంపతులు. నేను ఒప్పుకోను అంటుంది రుద్రాణి. పోలీస్ కేసు పెడతానంటూ షాక్ ఇస్తుంది కావ్య.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Recommended image3
క్లైమాక్స్ రాయడానికే 18 ఏళ్లు.. 138 నిమిషాల ప్రభాస్ డిజాస్టర్ సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved