- Home
- Entertainment
- Guppedantha Manasu: ఒక్క మాటతో రిషి, వసుధారలను విడగొట్టిన దేవయాని... బాధతో జగతి, మహీంద్రలు..
Guppedantha Manasu: ఒక్క మాటతో రిషి, వసుధారలను విడగొట్టిన దేవయాని... బాధతో జగతి, మహీంద్రలు..
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 16వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. రిషి దేవయాని దగ్గరికి వెళ్లి భోజనం చేయమని అడుగుతాడు దేవయాని,నువ్వు ముందు తిను రిషి, నేను తర్వాత తింటాను అని చెప్తుంది. అప్పుడు రిషి,వసూలు ఇద్దరు వెళ్లి భోజనం చేస్తారు. ఇంతలో గౌతమ్ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తాడు కానీ రిషి,గౌతమ్ నీ అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు వసుధార భోజనం చేస్తున్నప్పుడు అన్నం మెతుకులు తన పదవిపై ఉండిపోతాయి. ఎవరు చూడని సమయంలో రిషి వాటిని తీస్తాడు. కానీ జగతి, మహీంద్రాలు అందరూ చూస్తారు.
దేవాయాని చూసి రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో దేవయాని వాళ్ళ భర్త,దేవయాని దగ్గరకు వెళ్లి ఈరోజు భోజనం ఏర్పాట్లు బాగున్నాయి కదా,ఫంక్షన్ కూడా బాగా జరిగింది కదా అని అనగా చాలా బాగా జరిగింది అని చిరాకు ముఖంతో అంటుంది దేవయాని. భోజనాలు అయిపోయి అతిథులందరూ వెళ్లిపోయిన తర్వాత అందరూ ఫంక్షన్ బాగా జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని, ఇదంతా వసుధార వల్లే జరిగింది.
వసుధార లేకపోతే ఇంత జరిగేదే కాదు, వసుధార చాలా తెలివైనది,గొప్ప మనిషి అని అనగా ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పొగుడుతున్నారు మేడం అని అంటుంది వసుధార.గొప్పవాళ్ళకి పొగడ్తలు నచ్చవని నాకు తెలుసు వసుధార కానీ నువ్వు ఎంత మంచి దానివి. నీ సామర్థ్యంతో రిషీని నీ వైపు తిప్పుకున్నావు అని అనగా జగతి, మహీంద్రాలకు అనుమానం వస్తుంది. అప్పుడు దేవయాని,కొన్ని కొన్ని సార్లు నువ్వు రిషి ని తప్పు మార్గంలో నడిపించావు అని భయపడి నిన్ను మందలించి ఉంటాను దానికి క్షమించు అని అంటుంది.
వసుధారకి కూడా దేవయాని మాటలు పై అనుమానం వస్తుంది. అప్పుడు దేవయాని ఇంత చేసావు కదా ఇంకొక పని మిగిలిపోయింది. నువ్వు మహేంద్ర కి మాట ఇచ్చినట్టు రిషి చేత జగతిని అమ్మ అని పిలిపించేస్తే ఇప్పుడు సరిపోతుంది అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు రిషి తో సహా.అప్పుడు మహేంద్ర ఇప్పుడు ఈ సంగతి ఎందుకు వదిన అని అనగా, ఇప్పుడే మాట్లాడాలి మహేంద్ర.నాకు ఇంతకన్నా మంచి సమయం లేదు ఈరోజు అంతా బాగా జరిగింది కదా, ఈ సమయంలో మాట్లాడితేనే బాగుంటుంది.
నువ్వు ఒక్క పని చేసే వసుధారా అప్పుడు హాయిగా మీ ఊరికి వెళ్లి, మీ అమ్మానాన్నలతో మాట్లాడి, నీ పెళ్లి జరిపించి వచ్చు. అయినా రిషినీ పెంచిన తల్లి అనే తప్ప సొంత తల్లి జగతి ఏ కదా అని అంటుంది.అప్పుడు మహేంద్ర జగతితో, ఆపడానికి ఏమైనా చేయ్యు అని అనగా, ఇది అక్కయ్య పద్మ వ్యూహం మహేంద్ర ఇప్పుడు ఆపిన ప్రమాదమే అని అంటుంది జగతి. అప్పుడు దేవయాని వసుధార తో ఇప్పుడే పిలిపించమ్మా నేనే దగ్గర ఉండి మీ పెళ్లి చేస్తాను అని అనగా,రిషి ఇంక చాలు అని అరుస్తాడు.
అప్పుడు దేవయాని, ఈ మాట అబద్ధమని వసుధార చేతే చెప్పించు రిషి అని అనగా వసు మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు రిషి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వసుధార, రిషి ని ఆపుతుంది. రిషి వదులు వసుధార అని అన్నా సరే వసు వదలదు. అప్పుడు రిషి బలవంతంగా వెళ్ళిపోతాడు.అప్పుడు వసు,పిలుస్తున్న సరే ఆగకుండా వెళ్ళిపోయారు అని బాధపడుతుంది. ఆ తర్వాత మహేంద్ర దేవయాని తో,అసలు ఎందుకు వదిన అని మాట పూర్తయ్యేలోగే,ఇప్పుడు ఈ ప్రస్తావని ఎందుకు తెచ్చారు? చెప్పకపోయి ఉంటే బాగుండేది కదా? ఇలాంటి ప్రశ్నలు నాతో ఏం అడగొద్దు.
నేనేమీ కల్పితం చేసి చెప్పలేదు కదా వాస్తవమే చెప్పాను అని అంటుంది.అప్పుడు మహీంద్రా కోపంతో చేతులెత్తి దండం పెట్టి, మీరు మా కన్నా పెద్దవారు, మీరేం చేసినా మేము సైలెంట్ గా ఉంటాము. మా హద్దులు దాటము కానీ కొన్ని కొన్ని సార్లు మీరు చేసినవి కూడా మంచిగా అవుతాయి. ఏమో, రిషి జగతిని అమ్మ అని పిలిచే రోజు కూడా వస్తుందేమో అని అనగా అదే జరగాలని కోరుకుందాం మహేంద్ర.అందరూ అదే కదా కోరుకుంటున్నారు నేను అదే కోరుకుంటాను అని అంటుంది దేవయాని.
అప్పుడు దేవయాని జగతి దగ్గరికి వచ్చి ఈ విషయం నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా? ఇందాక నువ్వు, మహేంద్ర మాట్లాడుకుంటున్నప్పుడు విని రికార్డ్ చేశాను. నా మంచికే జరిగింది అనుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దేవయాని. ఆ తర్వాత జగతి,మహీంద్ర లు ఒకరినొకరు చూసుకొని బాధపడతారు. వసుధార కూడా బాధపడుతుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!