MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • A Beautiful Breakup: 'ఏ బ్యూటిఫుల్ బ్రేకప్' మూవీ రివ్యూ.. ఇళయరాజా సంగీతం అందించిన సినిమా ఎలా ఉందంటే ?

A Beautiful Breakup: 'ఏ బ్యూటిఫుల్ బ్రేకప్' మూవీ రివ్యూ.. ఇళయరాజా సంగీతం అందించిన సినిమా ఎలా ఉందంటే ?

A Beautiful Breakup Movie Review: ఇళయరాజా సంగీతం అందించిన ఎమోషనల్ లవ్ అండ్ హారర్ చిత్రం ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 18 2026, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
A Beautiful Breakup Review
Image Credit : Asianet News

A Beautiful Breakup Review

వాలంటైన్స్ వీక్ లో విడుదలైన లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం 'ఏ బ్యూటిఫుల్ బ్రేకప్'. ఆంగ్ల భాషలో ఈ చిత్రం తెరకెక్కింది. తెలుగు వారు ముద్రగడ రంగారావు, ఉగ్గిన సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. అజిత్ వాసన్ ఉగ్గిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తక్ష్ ముద్రగడ, మటిల్డా బజర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కథ:
Image Credit : Asianet News

కథ:

విడిపోవడానికి సిద్ధమైన ఒక యువ జంట, తమ అనుబంధాన్ని గౌరవప్రదంగా ముగించాలనే ఉద్దేశంతో ఒక విహారయాత్రకు వెళ్తారు. ఈ క్రమంలో వారు ఒక నిర్మానుష్య ప్రాంతంలోని ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడ వారి మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు, భావోద్వేగాలతో పాటు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సాధారణ హారర్ సినిమాల లాగా కాకుండా, ఒక 'పవిత్రమైన ఆత్మ' చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అసలు వారు సంతోషంగా విడిపోయారా? లేదా మళ్లీ కలిశారా? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. 

36
విశ్లేషణ :
Image Credit : Asianet News

విశ్లేషణ :

ఈ సినిమాకు అతిపెద్ద బలం మాస్ట్రో ఇళయరాజా అందించిన సంగీతం. లండన్‌లోని ప్రసిద్ధ 'బో టై ఆర్కెస్ట్రా'తో కలిసి ఆయన చేసిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశంలోనూ భావోద్వేగాలను పండించడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. కొత్తవారైనప్పటికీ తక్ష్, మటిల్డా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే డ్రామా కావడంతో వారి కెమిస్ట్రీ,ఎమోషన్స్ హైలైట్‌గా నిలిచాయి. దర్శకుడు అజిత్ వాసన్ ఒక వెరైటీ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. చిక్కమగళూరు అడవుల్లో తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్ గా అన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. 

46
ప్లస్ పాయింట్స్:
Image Credit : Asianet News

ప్లస్ పాయింట్స్:

లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ, ఈ చిత్రం తెరకెక్కించిన లొకేషన్స్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. రెగ్యులర్ హారర్ సినిమాలాగా కాకుండా వైవిధ్యంగా తెరకెక్కించడం మరో అదనపు బలం. 

56
మైనస్ పాయింట్స్:
Image Credit : Asianet News

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్ కథ నెమ్మదిగా సాగడం. కొన్ని సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి.

66
ఫైనల్ గా:
Image Credit : Asianet News

ఫైనల్ గా:

'ఏ బ్యూటిఫుల్ బ్రేకప్' అనేది రెగ్యులర్ దెయ్యాల సినిమా కాదు. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. ఇళయరాజా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఓసారి ఈ మూవీ చూసేయొచ్చు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Rajamouli: వారణాసి మూవీలో త్రేతా యుగ సన్నివేశాలపై రాజమౌళి ప్లాన్ ఇదే.. ఇది మాత్రం నెక్స్ట్ లెవల్ అంతే
Recommended image2
తెలుగు సినిమాకి చుక్కలు చూపించిన రైల్వే డిపార్ట్మెంట్, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved