2025 లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన 8 సినిమాలు, అందులో టాలీవుడ్ మూవీస్ ఎన్ని?
300 Crore Movies in 2025 : ఈ ఏడాదికి గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. అన్ని రంగాలతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా 2025 లో చాలా సాధించింది. అందులో భాగంగా ఈ ఇయర్ లో 300 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు ఎన్ని? అందులో తెలుగు సినిమాలున్నాయా?

8. ధురంధర్ (హిందీ)
ఈ ఏడాది చాలా సినిమాలు 300 కోట్ల కలెక్షన్ మార్క్ ను దాటి దూసుకుపోయాయి. అందులో సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ వచిత్రం ఏంటంటే.. పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతోన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక్క సినిమా కూడా ఈ లిస్ట్ లో లేదు. ఇక 300 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటిన సినిమాల లిస్ట్ చూస్తే..?
విడుదల తేదీ : 5 డిసెంబర్ 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 313.75 కోట్ల రూపాయలు (7 రోజుల్లో)
దర్శకుడు : ఆదిత్య ధర్
తారాగణం : రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ, సారా అర్జున్
జానర్ : స్పై యాక్షన్ థ్రిల్లర్
7. కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1 (కన్నడ)
విడుదల తేదీ : 2 అక్టోబర్ 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 852.21 కోట్ల రూపాయలు (4 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : రిషబ్ శెట్టి
తారాగణం : రిషబ్ శెట్టి, జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడ్
జానర్ : ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా
6. లోకః చాప్టర్ 1: చంద్ర (మలయాళం)
విడుదల తేదీ : 28 ఆగస్టు 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 303.86 కోట్ల రూపాయలు (40 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : డొమినిక్ అర్జున్
తారాగణం : కళ్యాణి ప్రియదర్శిని, నస్లేన్, శాండీ, అరుణ్ కురియన్, చందు సలీం కుమార్
జానర్ : సూపర్‌హీరో సినిమా
5. కూలీ (తమిళం)
విడుదల తేదీ : 14 ఆగస్టు 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 518 కోట్ల రూపాయలు (3 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : లోకేష్ కనగరాజ్
తారాగణం : రజనీకాంత్, నాగార్జున, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్
జానర్ : యాక్షన్ థ్రిల్లర్
4. వార్ 2 (హిందీ)
విడుదల తేదీ : 14 ఆగస్టు 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 364.35 కోట్ల రూపాయలు (7 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : అయాన్ ముఖర్జీ
తారాగణం : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్
జానర్ : స్పై యాక్షన్ థ్రిల్లర్
3. మహావతార్ నరసింహ (కన్నడ)
విడుదల తేదీ : 25 జూలై 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 326.82 కోట్ల రూపాయలు (32 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : అశ్విన్ కుమార్
తారాగణం : NA
జానర్ : ఎపిక్ మైథలాజికల్ డ్రామా
2. సైయారా (హిందీ)
విడుదల తేదీ : 18 జూలై 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 570.33 కోట్ల రూపాయలు (9 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : మోహిత్ సూరి
తారాగణం : అహాన్ పాండే, అనీత్ పడ్డా
జానర్ : మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా
1. ఛావా (హిందీ)
విడుదల తేదీ : 14 ఫిబ్రవరి 2025
ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్ : 807.91 కోట్ల రూపాయలు (7 రోజుల్లో 300 కోట్ల క్లబ్‌లో చేరింది.)
దర్శకుడు : లక్ష్మణ్ ఉతేకర్
తారాగణం : విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న
జానర్ : ఎపిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా

