'7G బృందావన కాలనీ` సీక్వెల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్, క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్న పోస్టర్
'7G బృందావన కాలనీ` రెండు దశాబ్దాల క్రితం వచ్చి యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది. తాజాగా దీనికి సీక్వెల్ వస్తుంది. పోస్టర్‌తోనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.
రెండు దశాబ్దాల క్రితం లవ్ స్టోరీస్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది `7G బృందావన కాలనీ` మూవీ. ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ యూత్‌ని ఓ ఊపు ఊపేసింది. కుర్రాళ్ల మదిలోకి చొచ్చుకుని వెళ్లింది. యువతపై ఈ సినిమా ప్రభావం చాలా కాలం ఉండిపోయింది. దర్శకుడు సెల్వరాఘవన్ టేకింగ్, రవికృష్ణ నటన, సోనియా గ్లామర్, యాక్టింగ్, సుమన్ శెట్టి కామెడీ అంతగా ఇంపాక్ట్ చూపించింది. ఇదొక కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది డబ్బింగ్ మూవీ అయినా తెలుగు ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దీనికి సీక్వెల్ రాబోతుంది. ప్రస్తుతం `7G బృందావన కాలనీ`కి సీక్వెల్‌ని `7G బృందావన కాలనీ 2`ని రూపొందిస్తున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవికృష్ణ హీరోగా నటిస్తున్నారు. జయరామ్, సుమన్ శెట్టి, సుధ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్ సోనియా స్థానంలో అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తుంది.
read more:సాయిపల్లవి కొత్త ఏడాది పూజలు, భక్తుల మధ్య కూర్చొని మామూలు అమ్మాయిగా మారిన వైనం, ఎక్కడో తెలుసా?
మొదటి భాగం విజయంలో యువన్ శంకర్ రాజా యొక్క అద్భుతమైన సంగీతం కీలక పాత్ర పోషించింది. సీక్వెల్ తో కూడా ఆయన మరోసారి తన సంగీతంతో మ్యాజిక్ చేయబోతున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు రామ్‌జీ తనదైన కెమెరా పనితనంతో సీక్వెల్ కి మరింత అందం తీసుకురానున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ "7G బృందావన కాలనీ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న చిత్రం. సినీ చరిత్రలో ఈ చిత్రం ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇప్పుడు ఈ చిత్ర సీక్వెల్ తో నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సరికొత్త మరియు ఆకట్టుకునే కథనాన్ని అందించి, అప్పటి మ్యాజిక్‌ను పునఃసృష్టి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము` అని అన్నారు.
'7G బృందావన కాలనీ 2' అనేది సెల్వరాఘవన్ శైలి కథాకథనాలు, బలమైన భావోద్వేగాలతో రూపొందుతోన్న హృదయాలను హత్తుకునే ఓ విభిన్న ప్రేమ కథా చిత్రం. ఇది ప్రేక్షకులను ఎప్పటికీ మరచిపోలేని సరికొత్త అనుభూతిని అందించనుంది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది.
లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. సిటీలో దగదగ మెరిసే బిల్డింగ్స్ మధ్యలో జంట నడుచుకుంటూ వెళ్తుండగా, అర్థరాత్రి భవనాల వెలుగులు, ఆకాశంలో నక్షత్రాల వెలుగులు ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. నేటి ట్రెండీ లవ్ స్టోరీగా ఈ మూవీ రాబోతుందనే విషయాన్ని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతుంది.
మొదటి పార్ట్ సంచలన విజయం సాధించింది. ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. మరి ఈ సీక్వెల్ ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా? అనేది చూడాలి. కానీ ఈ మూవీకి సీక్వెల్ అనేది అందరిలోనూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. '7G బృందావన కాలనీ` 2004లో విడుదలైన విషయం తెలిసిందే.
read more: శోభన్ బాబు భోజనంలో ప్రతిరోజూ వడ పాయిసం.. ప్రొడక్షన్ బాయ్ చేత అంత అవమానం ఫేస్ చేశాడా?