- Home
- Entertainment
- Suman: సుమన్ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్.. భర్తకి నటి వార్నింగ్
Suman: సుమన్ అర్థరాత్రి వరకు నాతోనే ఉన్నాడు, ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తావ్.. భర్తకి నటి వార్నింగ్
హీరో సుమన్.. బ్లూ ఫిల్మ్ కేసులో ఇరుకొన్ని కొన్నాళ్లపాటు జైలు జీవితాన్ని అనుభవించారు. అయితే ఆయన అరెస్ట్ వెనక జరిగిన షాకింగ్ నిజాన్ని నటి జయశీల వెల్లడించారు. అసలు జరిగిందేంటో తెలిపారు.

ఒకప్పుడు స్టార్ గా రాణించిన సుమన్
హీరో సుమన్ ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించారు. మెగాస్టార్ కి పోటీ ఇచ్చారనే విషయం తెలిసిందే. కానీ అనూహ్యంగా బ్లూ ఫిల్మ్ ఆరోపణ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కెరీర్ తలక్రిందులయ్యింది. తనకు సంబంధం లేని కేసులో తాను అరెస్ట్ కావాల్సి వచ్చింది. కెరీర్‌నే పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో ఆయన నిర్ధోశిగానే విడుదలయ్యారు. కానీ కొందరు చేసిన కుట్రలకు ఆయన బలయ్యారు. ఈ క్రమంలో అసలు ఆ రోజు ఏం జరిగింది? సుమన్ అరెస్ట్ వెనకాల ఉన్నది ఎవరనేది నటి జయశీల వెల్లడించారు.
సుమన్ అరెస్ట్ రోజు జరిగింది ఇదే
ఆమె మాట్లాడుతూ, `వడియార్ కూతురుకి దినకర్(దివాకర్) మధ్య ఏదో ఉందట. అతన్ని ఇరికించడం కోసం సుమన్‌ని ఇరికించారట. దివాకర్ స్నేహితుడు సుమన్ కావడం వల్ల ఆయన్ని కూడా ఈ కేసులో ఇరికించారు. వడియార్ కోసం ఎంజీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు నా భర్త ఇన్‌స్పెక్టర్. సుమన్‌ని అరెస్ట్ చేశాడు. అయితే అరెస్ట్ చేశాక ఆయన చాలా బాధపడ్డాడు. నేను కూడా చాలా తిట్టాను. ఎందుకంటే అప్పుడు సుమన్‌తో సినిమా చేస్తున్నా. మేమిద్దరం కలిసి రాత్రి పది గంటల వరకు యాక్ట్ చేశాం. ఇలా అరెస్ట్ చేశారని తెలియగానే మా ఆయన్ని తిట్టేశాను. ఏంటి నీకు ఏమైనా పిచ్చిపట్టిందా, రాత్రి పది గంటల వరకు సుమన్ నాతోనే యాక్ట్ చేశాడు. ఆయన్ని పట్టుకొని ఎలా అరెస్ట్ చేస్తావని తిట్టాను.
సుమన్ విషయంలో భర్తకి నటి వార్నింగ్
అందుకు మా ఆయన రియాక్ట్ అవుతూ, నన్ను ఏం చేయమంటావు, పై నుంచి వచ్చింది. ఆ పని చేయకపోతే నన్ను సస్పెండ్ చేస్తారు. నేను చిన్న ఇన్ స్పెక్టర్‌ని, పైన డీజీపీ నుంచి వచ్చిన ఆర్డర్స్ అవి అన్నాడు. ఏం చేయలేకపోయాం. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చాక సుమన్‌ని కలిశాను. అప్పుడే చెప్పాను ఇలా జరిగిందని, మా ఆయనే బిర్యానీ పెట్టించాడని, ఆయన చాలా బాధపడ్డారని చెప్పాను. నీ తప్పు లేదని చెప్పాడని సుమన్‌తో అన్నాను, ఆయన కూడా అర్థం చేసుకున్నాడు` అని తెలిపారు జయశీల. సుమన్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకుంది. సీనియర్ నటి జయశీల ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో చాలా సినిమాలు చేశారు. మెయిన్‌గా తెలుగులో ఆమె `వేటగాడు`, `తాతయ్య ప్రేమలీలలు` చిత్రాల్లో కనిపించారు. కన్నడలో చాలా సినిమాలు చేశారు. ఆమె భర్త పోలీస్ ఇన్‌స్పెక్టర్.





